Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 15 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
"మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో”. ఎపుడైతే అతడు నిద్ర నుండి లేచి అల్లాహ్ పేరును స్మరిస్తాడో ఒక ముడి విడి పోతుంది; ఎపుడైతే అతడు ఉదూ చేస్తాడో మరొక ముడి విడిపోతుంది; (ఉదూ చేసిన తరువాత) ఎపుడైతే అతడు నమాజును ఆచరిస్తాడో చివరి ముడి విడి పోతుంది. మరియు అతడు ఉదయం చురుకైన ఆత్మతో, ఉల్లాసంగా లేస్తాడు; లేకుంటే ఉదయం దౌర్భాగ్యపూరితంగా, నిరుత్సాహంగా, సొమరితనంతో లేస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుదూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుదూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి; మీలో ఎవరైనా తన నిద్ర నుండి లేచినపుడు, వుదూ చేయుట కొరకు నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు, తన చేతులను కడుగుకోవాలి, ఎందుకంటే మీలో ఎవరికీ తెలియదు తన చేతులు రాత్రి ఎక్కడ గడిపాయో”; సహీహ్ ముస్లింలో ఈ పదాలున్నాయి: “మీలో ఎవరైనా తమ నిద్ర నుండి లేచినపుడు, చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు, (వుజూ కొరకు) నీటి పాత్రలో చేతులను పెట్టకండి, ఎందుకంటే అతడికి తెలియదు తన చేయి రాత్రి ఎక్కడ గడిపిందో”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనాబత్ గుస్ల్ (స్నానం) ఒక ‘సా’ నీటితో, మరియు ఉదూ ఒక ‘ముద్’ నీటితో పూర్తి చేసేవారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"పరిశుభ్రత (తుహూర్) విశ్వాసం (ఈమాన్) లో సగభాగం. 'అల్-హమ్దు లిల్లాహ్' (అల్లాహ్ కే సకల పొగడ్తలు, కృతజ్ఞతలు శోభిస్తాయి) త్రాసును నింపుతుంది. 'సుబ్హానల్లాహ్' (అల్లాహ్ పరమ పరిశుద్ధుడు) మరియు 'అల్-హమ్దు లిల్లాహ్' ఆకాశానికి మరియు భూమికి మధ్య ఉన్న ఖాళీని నింపుతాయి. నమాజ్ మన హృదయాలకు, ముఖాలకు వెలుగును ఇస్తుంది. దానధర్మం మన విశ్వాసానికి ఒక స్పష్టమైన రుజువు. కష్టాలలో సహనం ఒక ప్రకాశవంతమైన ఒక మార్గదర్శకం, ఒక కాంతి. ఖుర్ఆన్ నీకు అనుకూలంగా లేదా నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది. ప్రతి మనిషి ఉదయం లేచి వెళ్ళిపోతాడు, తన ఆత్మను (స్వర్గానికి లేదా నరకానికి) అమ్ముకుంటాడు, ఆ తర్వాత దాన్ని విముక్తి చేస్తాడు లేదా దాన్ని నాశనం చేసుకుంటాడు."
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: