Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 1 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

లఖీత్ ఇబ్న్ సబిరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “బనూ అల్ మున్తఫిఖ్ తెగవారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను వారికి నాయకునిగానో లేదా వారిలో ఒకనిగానో ఉన్నాను. మేము చేరుకున్నపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలో లేరు. ఇంటిలో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉన్నారు. ఆమె మా కోసం ‘ఖజీరా’ అనే వంటకం తయారు చేయాలని ఆదేశించినారు, ఆ వంటకం తయారైంది కూడా. తరువాత ఖర్జూరాలు ఉన్న ఒక పళ్ళెమును మా ముందు ఉంచడం జరిగింది. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చినారు, వచ్చి “మీకు ఏదైనా వడ్డించబడిందా లేదా మీ కోసం ఏదైనా తయారు చేయడానికి ఆదేశించడం జరిగిందా?” అని అడిగారు. మేము “అవును, ఓ రసూలుల్లాహ్! అలా ఆదేశించబడింది” అని జవాబిచ్చాము. మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కూర్చుని ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఒక గొర్రెల కాపరి గొర్రెలను తోలుకుంటూ వచ్చి వాటిని మందలో కలపడానికి తీసుకు వెళుతున్నట్లు చూశాము. అతని వెంట కొత్తగా పుట్టిన గొర్రెపిల్ల ఉన్నది, అది అరుస్తూ ఉన్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని “ఓ ఫలానా! అది (ఆ తల్లి గొర్రె) ఏమి ఈనింది?” అని అడిగారు. దానికి అతడు: “ఆడ గొర్రెపిల్ల” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే ఆ గొర్రెపిల్లకు బదులుగా ఒక పెద్ద గొర్రెను వధించు” అన్నారు. తరువాత (మాతో) “పెద్ద గొర్రెను మీకోసం వధిస్తున్నామని అనుకోకండి. మా వద్ద వంద గొర్రెలున్నాయి. ఆ సంఖ్య పెరగడం మాకు ఇష్టం లేదు. ఆ సంఖ్యను నిలకడగా అలాగే ఉంచడానికి, కొత్తగా గొర్రెపిల్ల పుట్టినపుడల్లా ఒక పెద్ద గొర్రెను వధిస్తూ ఉంటాము” అన్నారు. తరువాత నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ఒక భార్య ఉంది, ఆమె నాలుకలో ఏదో తప్పు ఉంది, అంటే ఆమె దుర్భాషలాడుతుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే ఆమెకు విడాకులు ఇవ్వు". నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము చాలా కాలంగా కలిసి ఉన్నాము, ఆమె ద్వారా నాకు పిల్లలు ఉన్నారు”. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే, ఆమెను ఆజ్ఞాపించు, ఆదేశించు" అంటే: ఆమెకు సలహా ఇవ్వు. "ఆమెలో మంచితనం ఉంటే, ఆమె కట్టుబడి ఉంటుంది. అయితే నీవు నీ బానిసను కొట్టినట్లు నీ భార్యను కొట్టకు." తరువాత నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ‘ఉదూ’ గురించి చెప్పండి. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉదూను సమగ్రంగా, పరిపూర్ణంగా చేయి; ఒక్కొక్క వేలు మధ్య వేలుతో శుభ్రం చేయి, ముక్కు లోనికి నీరు బాగా ఎక్కించి నీటిని చీది వేయి, నీవు ఉపవాసపు స్థితిలో ఉంటే తప్ప”.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు: