Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 12 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“నేను ముస్లిములపై ఎక్కువ భారం వేస్తున్నానేమో అనే సందేహం లేకపోయినట్లయితే (జుబైర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఇదే హదీసులో “....నా ఉమ్మత్’పై ఎక్కువ భారం వేస్తున్నానేమో” అనే పదాలు ఉన్నాయి) నిశ్చయంగా ప్రతి నమాజు సమయాన ‘సివాక్’ (పలుదోము పుల్ల) వాడమని ఆదేశించి ఉండేవాడిని.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
«నిశ్చయంగా నేను శపించేవానిగా పంపబడలేదు, దానికి బదులు కారుణ్యంగా పంపబడ్డాను»
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఒక బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల వద్దకు వచ్చి, "ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఏకాంతంలో ఏయే పనులు (ఆరాధనలు) చేస్తారు?" అని అడిగినారు, వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు ఇలా అన్నారు: నేను మాంసం తినను. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఇది తెలిసిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అల్లాహ్‌ను స్తుతించారు, తరువాత ఆయనను ప్రశంసించి, ఇలా పలికినారు: "నేను అలా చేయ్యను, నేను ఇలా చేయ్యను అని చెప్పిన వారి గతి ఏమిగాను? నిజానికి, నేను నమాజు చేస్తాను మరియు నిద్ర పోతాను, నేను ఉపవాసం ఉంటాను మరియు ఉపవాసం విరమిస్తాను మరియు నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా సున్నతు నుండి తప్పుకున్నవాడు నాకు చెందినవాడు కాదు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎరుపు రంగు (కండువా లాంటి) పైవస్త్రములో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే అందమైన ఛాయ కలిగిన వ్యక్తిని నేను ఎపుడూ చూడలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుట్టు ఆయన భుజాలను తాకుతూ, భుజాల మధ్య భాగం వరకు ఉండేది; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చాలా పొడవైన వ్యక్తీ కాదు, అలాగని పొట్టి వ్యక్తి కూడా కాదు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ ముగించిన తరువాత, సూర్యుడు బాగా ఉదయించే వరకు ఆయన నమాజు చేసిన చోటనే కూర్చునేవారు, ఆయన ఫజ్ర్ (ఉదయం) నమాజు చేసిన చోట నుండి సూర్యుడు ఉదయించే వరకు లేచేవారు కాదు. సూర్యుడు ఉదయించిన తర్వాతనే లేచేవారు. సహాబాలు (జాహిలియ్యా) అజ్నా కాలం నాటి విషయాలను మాట్లాడుకుంటూ, నవ్వుకునేవారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చిరునవ్వు నవ్వేవారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
«ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను ఒక మానవుడ్ని మాత్రమే. కావున ముస్లింలలో ఏ వ్యక్తినైనా నేను దూషించినా, శపించినా లేదా కొరడాతో కొట్టినా, నీవు దానిని అతని కొరకు శుద్ధీకరణగా మరియు కారుణ్యంగా చేయుము».
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఓ విశ్వాసుల మాతృమూర్తీ! రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వము గురించి వివరించండి”. దానికి ఆమె “ఏం, నీవు ఖుర్’ఆన్ చదవలేదా?” అని ప్రశ్నించారు. నేను “చదివాను” అన్నాను. ఆమె “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము, శీలసంపద పూర్తిగా ఖుర్’ఆనే” అన్నారు
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసిన ఒక పెద్ద హదీథులోని భాగము:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారు మదీనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వరుసగా మూడు రోజుల పాటు కడుపునిండా గోధుమ రొట్టెలు తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు