Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 5 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (57)
أبو موسى الأشعري2 حذيفة2 سهل بن سعد2 علي2 إبراهيم النخعي عن همام بن الحارث قال1 ‌ابن عباس1 أبو أيوب الأنصاري1 أبو بردة بن أبي موسى1 أبو حازم بن دينار1 أبو حميد الساعدي1 أبو شريح1 أبو عبد الرحمن عبد الله بن عمر بن الخطاب1 أبو قتادة1 أبو هريرة قال1 ‌أبي قتادة السلمي1 ‌أبي هريرة1 أبيه أبي موسى الأشعري1 الأسود بن يزيد قال1 البراء بن عازب1 الزبير بن العوام1 المغيرة1 النعمان بن بشير1 أم قيس بنت محصن1 بريدة بن الحصيب1 رافع بن خديج1 زيد بن ثابت1 ‌سهل1 عبادة بن الصامت1 عبد الرحمن بن أبي ليلى قال1 ‌عبد الله بن زيد1 عبد الله بن عمرو بن العاص1 عبد الله بن مغفل1 عبد الله بن يزيد الخطمي قال1 عدي بن حاتم1 عقبة بن عامر1 عكرمة1 عمار بن ياسر1 عمر1 عمران بن حصين1 عمرو بن سليم الأنصاري قال1 عمرو بن عامر عن ‌أنس بن مالك قال1 مالك بن أوس بن الحدثان أنه قال1 ‌محمود بن لبيد1 معاذة قالت1 ميمونة أم المؤمنين1 ‌وراد كاتب المغيرة بن شعبة قال1 يحيى بن عمارة المازني قال1
అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు అన్ని సందర్భాలలో ఇస్తిఖారా నమాజ్‌ చేయుటను ఖుర్ఆన్‌లోని సూరాలు నేర్పినట్టుగా నేర్పించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పేవారు: "మీలో ఎవరికైనా ఏదైనా పని చేయాలనే ఉద్దేశం ఉంటే, తప్పనిసరి ఫర్ద్ నమాజ్ కాకుండా రెండు రకాతుల (ఇస్తిఖారహ్) నమాజ్ చేయాలి. తర్వాత ఇలా దువా చేయాలి: اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ، فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ، وَتَعْلَمُ وَلَا أَعْلَمُ، وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ، اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي، وَمَعَاشِي، وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ، وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ، وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ، ثُمَّ أَرْضِنِي» قَالَ: «وَيُسَمِّي حَاجَتَه». ("అల్లాహుమ్మ ఇన్నీ అస్'తఖీరుక బి ఇల్మిక, వ అస్తఖ్'దిరుక బి ఖుద్'రతిక, వ అస్అలుక మిల్ ఫద్'లికల్ అజీమ్, ఫఇన్నక తఖ్'దిరు వలా అఖ్'దిరు, వ తఅ్'లము వలా అఅ్'లము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదాల్ అమ్'ర - (ఇక్కడ మీ విషయం ప్రస్తావించాలి) - ఖైరున్ లి ఫిద్దునియా వమఆషీ వ ఆఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు - ఆజిలిహి వ ఆజిలిహి - ఫఖ్'దుర్'హు లీ వ యస్సిర్'హు లీ థుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదల్ అమ్'ర షర్రు లీ ఫిద్దునియా వ మఆ్'షీ వ ఆ్'ఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు ఆజిలిహి వ ఆజిలిహి - ఫస్'రిఫ్'హు అ'న్నీ వస్'రిఫ్'నీ అ'న్'హు వఖ్'దుర్ లిల్ ఖైర హంథు కాన థుమ్మ అర్'దినీ బిహి) అర్థం: "అల్లాహ్, నేను నీ జ్ఞానంతో నీ సలహా అడుగుతున్నాను. నీ శక్తితో నేను నీ వద్ద బలాన్ని కోరుతున్నాను. నీ గొప్ప దయను నేను అడుగుతున్నాను. ఏదైనా నువ్వే చేయగలవు, నేనేమీ చేయలేను. నీకే సర్వం తెలుసు, నాకేమీ తెలియదు. నువ్వే గోచర, అగోచరాలన్నింటి జ్ఞానం గలవాడివి. ఓ అల్లాహ్! ఈ విషయం (తన అవసరాన్ని ఇక్కడ చెప్పాలి) నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) మంచిదని నీ జ్ఞానంలో ఉంటే, అది నా కొరకు నిర్ణయించు, సులభతరం చేయు, దానిలో నాకు శుభాలు ప్రసాదించు. ఇది నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) చెడుగా ఉంటే, దానిని నన్ను దూరం చేయు, నన్ను దాని నుండి దూరం చేయు, అది ఎక్కడ ఉన్నా నా కొరకు మంచి దానినే నిర్ణయించు, నన్ను దానితో సంతృప్తిగా ఉంచు." ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: "తన అవసరాన్ని (ఏ విషయం కోసం ఇస్తిఖారా చేస్తున్నాడో) స్పష్టంగా పేరు పెట్టి చెప్పాలి."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఒక ప్రయాణంలో ఉండగా చాలామంది ఒకచోట కూడి ఒక వ్యక్తికి నీడను కల్పిస్తున్నారు,అది చూచి ప్రవక్త అది ఏమిటి ?అని అడిగారు అక్కడ ఉన్నవారు ‘అతడు ఉపవాసి’ అని చెప్పారు, ప్రవక్త సమాధానమిస్తూ; ప్రయాణంలో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు అని చెప్పారు, ముస్లిం హదీథు నమోదు ప్రకారం ‘అల్లాహ్ మీ కొరకు అనుగ్రహించిన అనుమతిని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’ అని ఉంది.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి” మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈ విధంగా నివేదించబడినది “ఓ రసూలల్లాహ్ (స)! మరి చనిపోయిన జంతువులనుండి తీసే కొవ్వు గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది ఓడలకు, మరియు చర్మాలకు (అవి పాడుకాకుండా) పూయబడుతుంది; మరియు ప్రజలు దానిని దీపాలలో (చమురుగా) వాడుతారు”. దానికి ఆయన (స) “లేదు, అది హరాం” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భముగా ఇలా అన్నారు: “యూదులను అల్లాహ్ నాశనం చేయుగాక! నిశ్చయంగా అల్లాహ్ (చనిపోయిన జంతువుల) కొవ్వును వారికి నిషేధించినాడు. కానీ వారు దాని కరిగించారు, దానిని అమ్మినారు మరియు దానినుండి వచ్చిన సొమ్మును తిన్నారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: