Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 3 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒకనాటి చిమ్మ చీకటి రాత్రి, వర్షం కురుస్తుండగా మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు బయలుదేరినాము, మాకు నమాజు చదివించమని కోరడానికి”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను ఆయనను పట్టుకున్నాను”. ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన మళ్ళీ “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన తిరిగి “ఇలా అను” అన్నారు. అపుడు నేను “ఏమని అనాలి (ఓ ప్రవక్తా!)” అన్నాను. దానికి ఆయన: “ఖుల్ హువల్లాహు అహద్” (సూరతుల్ ఇఖ్లాస్); మరియు ‘ముఅవ్విజతైన్’ (సూరతుల్ ఫలఖ్ మరియు సూరహ్ అల్-న్నాస్) వీటిని ప్రతి సాయంత్రం మరియు ప్రతి ఉదయం మూడు సార్లు పఠించు; అవి నీకు ప్రతి విషయానికీ సరిపోతాయి (అంటే ప్రతి విషయం నుండీ నీకు రక్షణ కల్పిస్తాయి)” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:
“ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు. మరియు ఎవరైతే ఈ పదాలను ఉదయం పలుకుతాడో, అతడు సాయంత్రం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు.” (ఇది విని అక్కడే ఉన్న వ్యక్తి, పక్షవాతానికి గురి అయి ఉన్న అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) ను చూడసాగినాడు, దానితో ఆయన అతనితో) “ఎందుకలా చూస్తున్నావు నా వైపు? అల్లాహ్ సాక్షిగా, నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) పట్ల అబద్ధం చెప్పలేదు, అలాగే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. ఏ రోజైతే నాకు ఈ పక్షవాతం వచ్చిందో, ఆ రోజు నేను కోపంలో ఉండి ఈ మాటలు పలుకడం మర్చిపోయాను” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఉదయం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్” సాయంత్రం అయితే ఆయన (స) ఇలా పలికేవారు: “బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వైలైకన్నుషూర్”. అబూహురైరహ్ (ర) ఇంకా ఇలా అన్నారు: “ఒక్కోసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనేవారు: “...వ ఇలైకల్ మసీర్”. (ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయంలోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. (ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “...అంతిమ గమ్యం కూడా నీ వైపునకే)
హసన్ హదీథు. అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు: