Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 138 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (59)
عبد الله بن عمرو3 ‌ابن عباس2 أبو موسى2 أبو الدرداء1 أبو الهياج الأسدي قال1 أبو بشير الأنصاري1 أبو طلحة1 أبو عبد الرحمن عبد الله بن عمر بن الخطاب1 أبو عبد الله جابر بن عبد الله الأنصاري1 أبو عمرو- وقيل1 أبو مرثد الغنوي1 أبو هريرة عبد الرحمن بن صخر1 ‌أبي هريرة1 أسماء بنت أبي بكر1 البراء1 البراء بن عازب1 المغيرة بن شعبة1 المقداد بن الأسود1 المقداد بن عمرو الكندي1 النعمان بن بشير1 أم الدرداء و أبي الدرداء1 أم المؤمنين أم عبد الله عائشة1 أم سلمة أم المؤمنين1 ‌أنس بن مالك1 جرير بن عبد الله1 جندب1 حارثة بن وهب الخزاعي1 حكيم بن حزام1 رسول الله صلى الله عليه وسلم أنه قال1 زيد بن خالد الجهني1 زينب بنت جحش1 سفيان بن عبد الله الثقفي1 صفوان بن محرز قال1 طارق بن أشيم الأشجعي1 طاوس أنه قال1 طلحة بن عبيد الله1 عائشة وعبد الله بن عباس1 عبادة1 عبد الرحمن بن سمرة1 ‌عبد الله بن عمرو بن العاص1 عبد الله بن مسعود قال1 عثمان بن أبي العاص1 عدي بن حاتم1 علي1 عمر1 عمران بن حصين1 ‌قتادة رحمه الله قال1 معاذ بن جبل1 معاوية1
(ఒక ప్రయాణములో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్”. దానికి ఆయన “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి “ఓ ముఆధ్!” అన్నారు. ఆయన తిరిగి “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మూడవసారి కూడా అదే విధంగా జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు.” అది విని ముఆధ్ “ఓ రసూలుల్లాహ్! ఈ వార్తను నేను మిగతా వారందరికీ వినిపించనా, వారు సంతోషిస్తారు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వద్దు, అలా చేస్తే వారు ఈ ఒక్క దానిపైనే ఆధారపడతారు (అంటే మిగతా సత్కార్యాలు చేయడం పట్ల ఆసక్తి చూపకుండా)” అన్నారు. ముఆధ్ రజియల్లాహు అన్హు తన మరణశయ్యపై ఉండి ఈ హదీసును ఉల్లేఖించినారు – జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయకుండా దాచుకున్న పాపమునకు తాను లోను కారాదనే భయంతో.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“కొంతమంది ప్రజలు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ‘భవిష్యత్తు గురించి చెప్పేవారికి’ (జ్యోతిష్యులకు) సంబంధించి ప్రశ్నించినారు. వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వారిని గురించి (చెప్పడానికి) ఏమీ లేదు”. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి వారు చెప్పే విషయాలు ఒక్కోసారి నిజమవుతాయి కదా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నజ్ద్ ప్రాంతపు ప్రజల నుండి చెదిరిన జుట్టుతో ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. అతను ఉచ్ఛ స్వరంతో మాట్లాడడం మేము వినగలుగుతున్నాము, కాని అతను ఏమి చెబుతున్నాడో అర్థం కాలేదు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చే సరికి, అతను ఇస్లాం గురించి అడుగుతున్నాడని స్పష్టమైంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా చెప్పారు: “దినము మరియు రాత్రిలో (విధిగా ఆచరించవలసిన) ఐదు సలాహ్’లు (నమాజులు) ఉన్నాయి”; దానికి అతడు “ఇవి గాక ఇంకేమైనా (నమాజులు) నాపై ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప. అలాగే (విధిగా ఆచరించవలసిన) రమదాన్ మాసపు ఉపవాసాలున్నాయి” అన్నారు. అతడు “ఇవిగాక నాపై ఇంకేమైనా (ఉపవాసాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి జకాత్ గురించి తెలిపినారు. దానికి అతడు “ఇది గాక నాపై ఇంకేమైనా (దానాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలనుకుంటే తప్ప” అన్నారు. దానితో అతడు ఇలా అంటూ వెనుదిరిగినాడు “అల్లాహ్ సాక్షిగా, దీనిపై ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, దీని నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను”. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతను సత్యవంతుడైతే అతను విజయం సాధిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"నేను ప్రళయ దినాన ప్రజలకు నాయకుడని. ఈ విషయం ఎందుకో మీకు తెలుసా? అల్లాహ్ మొదటి తరం నుండి చివరి తరం వరకు ఉనికిలో వచ్చిన ప్రజలందరినీ ఒకే చోట సమీకరిస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రకటనకర్త (ఇస్రాఫీల్) స్వరాన్ని వింటారు, ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు అతి సమీపంలోకి వచ్చేస్తాడు. ప్రజలు ఎంతో బాధతో(ఆ వేడిని) తట్టుకోలేని స్థితిలో భయకంపితులై ఉంటారు. అపుడు ప్రజలు ఇలా అంటారు: 'మీరు చూడటం లేదా? ఎంత భయంకరమైన స్థితి వచ్చింది! మన కోసం మన ప్రభువు వద్ద ఎవరైనా శిఫారసు చేసేవారు ఉన్నారా?' అప్పుడు వారు ఒకరినొకరు సలహా అడుగుతారు, ఎవరో 'ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' అంటారు. వారు ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లి, ఇలా అంటారు: 'మీరు మానవుల పితామహులు. అల్లాహ్ స్వయంగా తన చేతులతో మిమ్మల్ని సృష్టించాడు, తనే స్వయంగా మీలో ఆత్మను ఊదాడు, దేవదూతలు మీకు సాష్టాంగ ప్రణామం చేశారు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' దానికి ఆదం అలైహిస్సలాం ఇలా అంటారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. ఆయన నాకు ఒక చెట్టు నుండి తినకూడదని ఆజ్ఞాపించాడు, కానీ నేను అవిధేయతకు పాల్బడినాను. అయ్యో నా ప్రాణం! అయ్యో నా ప్రాణం! మీరు వేరొకరి వద్దకు వెళ్లండి - నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' ... (ఇలాగే నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా అలైహిముస్సలాం వద్దకు వెళ్లి అందరూ తమ తప్పులను స్మరించుకుని తమను తాము రక్షించుకోవాలని అంటారు)...చివరికి వారు నా వద్దకు (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి, ఇలా అంటారు: 'ఓ ముహమ్మద్! మీరు అల్లాహ్ యొక్క రసూల్, ప్రవక్తలలో చిట్టచివరివారు. అల్లాహ్ మీ మునుపటి, తర్వాతి పాపాలను క్షమించాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి!' నేను అల్లాహ్ సింహాసనం క్రింద సజ్దా చేస్తాను. అప్పుడు అల్లాహ్ తన మహిమలు, స్తుతులను నాకు అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు. అపుడు ఆయన ఇలా అంటాడు: 'ఓ ముహమ్మద్! తల ఎత్తు, అడుగు - ఇవ్వబడుతుంది, శిఫారసు చేయి - ఆమోదించబడుతుంది!' అపుడు నేను ఇలా అంటాను: 'ఓ నా ప్రభువా! నా సమాజం. ఓ నా ప్రభువా! నా సమాజం,' దానికి అల్లాహ్ ఇలా అంటాడు: 'నీ సమాజంలోని వారిలో తమపై ఏ లెక్కా లేని వారిని స్వర్గం కుడి ద్వారం ద్వారా ప్రవేశపెట్టు!' ఆ స్వర్గం ద్వారాల మధ్య దూరం మక్కా-హిమ్యర్ (లేదా మక్కా-బుస్రా) మధ్య దూరం అంత ఉంటుంది."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడతాడు, మరియు మూడు విషయాలను అసహ్యించుకుంటాడు మీకొరకు ఇష్టపడేవి: మీరు ఆయనను మాత్రమే ఆరాధించుట; దేనినీ మరియు ఎవరినీ మీరు ఆయనకు సమానులుగా నిలబెట్టకుండుట; మరియు మీరు ఆయన త్రాటిని బలంగా పట్టుకుని కలిసికట్టుగా ఉండుట, మరియు విడిపోకుండా ఉండుట; ఆయన మీ కొరకు అసహ్యించుకునే విషయాలు: వ్యర్ధ సంభాషణ (పోసుకోలు మాటలు); అడుక్కొనుట, లేదా అతిగా ప్రశ్నించుట; మరియు సంపదను వ్యర్ధముగా ఖర్చు చేయుట.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“సమాధులపై కూర్చోకండి మరియు సమాధులకు అభిముఖముగా (సమాధి తన ఎదురుగా ఉండేలా) నమాజు ఆచరించకండి.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్-అషజ్జి – అషజ్జి అబ్దిల్ ఖైస్ రదియల్లాహు అన్హుతో ఇలా పలికారు: “నిశ్చయంగా నీలో అల్లాహ్ ఇష్టపడే రెండు లక్షణాలు ఉన్నాయి – అవి ప్రాజ్ఞత (దూరదృష్ఠి), వివేకం మరియు సహనము”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“నిశ్చయంగా, అల్లాహ్‌ను మరియు అతని ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి నేను ఈ జెండా ఇస్తాను మరియు అల్లాహ్ అతని చేతుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు”. ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నాయకత్వం కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు, ఆ రోజు తప్ప”. ఆయన ఇంకా ఇలా అన్నారు: "(ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్నే పిలుస్తారు అనే ఆశతో) నేను దాని కోసం పిలువబడతాను అనే ఆశతో, వారి దృష్టిలో పడేలా నేను అటూ ఇటూ తిరుగసాగాను.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను పిలిపించి, ఆ జెండాను ఆయన చేతికి ఇచ్చి, ఇలా అన్నారు: “(ఓ అలీ!) ముందుకు సాగు, అల్లాహ్ నీకు విజయాన్ని ప్రసాదించే వరకు వెనుకకు చూడకు”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “అలీ ముందుకు కదిలాడు, కొద్ది దూరంలో ఆగి, వెనుకకు తిరగకుండా, గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్! నేను ఏ విషయంపై ఆ ప్రజలతో పోరాడాలి?”; దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప వెరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యమిచ్చే వరకు వారితో పోరాడు. వారు ఒకవేళ అలా చేసినట్లయితే వారి రక్తము మరియు సంపదలు నీ కొరకు ఉల్లంఘించరానివి (హరాం) అవుతాయి - షరియత్ ప్రకారం అలా చేయవలసి వస్తే తప్ప; మరియు వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: