Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 27 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ధర్మం మరియు పాపం గురించి అడిగాను, వారు ఇలా జవాబిచ్చారు: "ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నీవు దానిని ఇతరులకు బహిర్గతం చేయడాన్ని అసహ్యించుకునేది”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక స్త్రీ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నా దగ్గరకు వచ్చి ఏమైనా దానం చేయమని అడిగింది. నా దగ్గర ఒక ఖర్జూరం తప్ప మరేమీ లేదని ఆమె గ్రహించింది, ఆ ఒక్క ఖర్జూరాన్నే నేను ఆమెకు ఇచ్చాను. ఆమె దానిని రెండు భాగాలు చేసి తన ఇద్దరు కూతుళ్లకు చెరొకటి ఇచ్చింది, (ఆ పిల్లలిద్దరు తిన్న తరువాత) ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినపుడు నేను వారికి ఈ విషయం గురించి తెలియజేసాను. అపుడు వారు ఇలా అన్నారు: “ఎవరైతే తన కూతుళ్లను జాగ్రత్తగా చూసుకుంటారో మరియు వారితో దయగా వ్యవహరిస్తారో, వారు అతనికి నరకాగ్ని నుండి రక్షణగా (తెరగా) ఉంటారు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఒక మనిషి ఉండేవాడు. అతడు ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. అతడు తన సేవకునితో ఇలా అనేవాడు ‘నీవు (అప్పులు వసూలు చేసే టప్పుడు) పేదరికంలో ఉన్నవాని దగ్గరకు వెళితే, అతడి అప్పును ఉపేక్షించు. బహుశా అల్లాహ్ మన పాపాలను ఉపేక్షించవచ్చు (చూసీ చూడనట్లు వదిలివేయవచ్చు). (చనిపోయిన) తరువాత అతడు అల్లాహ్ ను కలిసినపుడు, అల్లాహ్ అతడి పాపాలను ఉపేక్షించి ఉంటాడు".
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నిశ్చయంగా దైవభీతిపరుడిని, భయభక్తులు కలవాడిని, (అనవసరమైన) వాంఛలు, కోరికలు లేని వాడిని, మరియు గుంభనముగా ఉండేవాడిని అల్లాహ్ ప్రేమిస్తాడు”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కారుణ్యం కలిగి ఉండాలని ఆదేశించినాడు. కనుక ఒకవేళ ఏదైనా ప్రాణిని చంపితే (చంప వలసి వస్తే), ఆ ప్రక్రియను యుక్తమైన విధంగా నిర్వహించండి, అలాగే ఏదైన ప్రాణిని అల్లాహ్ పేరున జిబహ్ చేస్తే (చేయవలసి వస్తే), ఆ ప్రక్రియను కూడా యుక్తమైన విధంగా నిర్వహించండి. మీలో ఒకరు (ఎవరు ఆ పనిని నిర్వహిస్తారో వారు) ఆ ప్రాణికి బాధ తెలియనంత పదునుగా ఉండేలా తన కత్తికి పదును పెట్టాలి”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: