Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 16 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
«నిశ్చయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు మరియు నిద్రపోవడం ఆయనకు తగదు, ఆయన త్రాసులను వంచుతాడు మరియు త్రాసులను పైకి ఎత్తుతాడు, పగటి ఆచరణకు ముందు రాత్రి ఆచరణ, మరియు రాత్రి ఆచరణకు ముందు పగటి ఆచరణ ఆయన ముందు సమర్పించబడుతుంది, తేజస్సు ఆయన అడ్డు తెర - మరో ఉల్లేఖనం ప్రకారం: అగ్ని- ఆయన దానిని తెరిస్తే ఆయన ముఖ కాంతి ఆయన దృష్టికి అందేంతవరకు ఆయన సృష్టిని కాల్చేస్తుంది».
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ఇద్దరు ముస్లింలు కలుసుకుని పరస్పరం కరచాలనం చేసిన తరువాత, వారు విడిపోయి (తమ తమ దారిలో) వెళ్ళే లోగా వారి పాపాలు క్షమించబడతాయి.
ప్రామాణికమైన హదీథుగా ధృవీకరించబడింది. అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ప్రతి మంచి పని పుణ్యకార్యమే”.
ప్రామాణికమైన హదీథు జాబిర్ (ర) ఉల్లేఖన అల్ బుఖారీలో మరియు హుజైఫా (ర) ఉల్లేఖన ముస్లింలో నమోదు:
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు". ఇబ్న్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను ఇంకా ప్రశ్నించి ఉంటే ఇంకా చెప్పి ఉండేవారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
కలహాలు, అశాంతి సమయాలలో ఆరాధన చేయడం అంటే నాకు హిజ్రత్ (ధర్మం కోసం వలస) చేసినట్లుగా ఉంటుంది.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“చెదిరిన జుట్టుతో, శరీరం మీద దుమ్ముతో తలుపుల దగ్గర నిలబడిన చాలామంది ప్రక్కకు నెట్టివేయబడతారు; అయితే అతడు అల్లాహ్ పేరు మీద ఏదైనా ప్రమాణం చేస్తే, అతడు దానిని నెరవేరుస్తాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొడిగించ బడాలని ఆశిస్తాడో, అతడు తన బంధువులతో సంబంధాలను నిలిపి ఉంచుకోవాలి (వాటిని సజావుగా కొనసాగించాలి)”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు