Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 98 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము'హ మ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్‌కమాత్‌) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్‌) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు: ''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “(ఆ ఆయతును పఠించిన) తరువాత ఆయన ఇలా అన్నారు: “ కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్‌) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలోని పేదలు, బలహీనుల (ఆశీర్వాదాలు మరియు దు’ఆల) ద్వారా తప్ప మీకు (అల్లాహ్ యొక్క) సహాయం మరియు జీవనోపాధి లభించిందా?”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని మెదడును, కుండలోని పదార్థము తుకతుక ఉడికినట్లు, మరిగేలా చేస్తాయి. అతడు తన కంటే ఘోరమైన శిక్ష మరెవ్వరూ అనుభవిస్తూ ఉండరని అనుకుంటాడు; నిజానికి అతడు అందరి కంటే తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాడు అయినప్పటికీ.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని స్థానములో నేను ఉంటే ఎంత బాగుండును!” అని పలికే వరకు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి. చిన్న చిన్న పాపాల ఉదాహరణ — కొంతమంది ఒక లోయలో దిగారు. వారిలో ఒకతను ఒక చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇంకొకతను మరో చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇలా అందరూ కలిపి కట్టేలను పోగుచేసి తమ రొట్టెలను కాల్చుకున్నారు (అంటే, పెద్ద మంటను వెలిగించారు). అలాగే, చిన్న చిన్న పాపాలు కూడా ఒకచోట పోగవుతుంటే, అవి అతన్ని నాశనం చేస్తాయి."
ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు:
“ఒక వృద్ధుని హృదయం రెండు విషయాలలో యవ్వనంగా ఉంటుంది, ప్రపంచం పట్ల అతని ప్రేమ (అంటే దాని సంపద, వినోదం మరియు విలాసాలు) మరియు అతని నిరంతర ఆశ."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“ఒకవేళ ఆదము సంతానానికి రెండు లోయల నిండా సంపద ఉన్నా, అతను మూడవ లోయను కోరుకుంటాడు. ఆదము సంతానం యొక్క కడుపును ధూళి (మట్టి) తప్ప మరేమీ నింపదు, మరియు అల్లాహ్ పశ్చాత్తాపపడేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి.” అది విని మాలో ఒకరు “ఓ రసూలుల్లాహ్! (అవిశ్వాసులను శిక్షించడానికి) ఈ అగ్ని సరిపోతుంది కదా!” అని అడిగారు. దానికి ఆయన “ఈ అగ్ని కంటే నరకాగ్ని ఇంకా అరవై తొమ్మిది భాగాలు ఎక్కువ ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు