Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 7 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒకవేళ ఆదము సంతానానికి రెండు లోయల నిండా సంపద ఉన్నా, అతను మూడవ లోయను కోరుకుంటాడు. ఆదము సంతానం యొక్క కడుపును ధూళి (మట్టి) తప్ప మరేమీ నింపదు, మరియు అల్లాహ్ పశ్చాత్తాపపడేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దాని కొరకు నీవు ఏమి తయారు చేసుకున్నావు?” అని ప్రశ్నించారు. దానికి అతడు “ఏమీ లేదు, కేవలం అల్లాహ్ పై, ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం పై (హృదయం నిండా) ప్రేమ తప్ప” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, వారితో పాటే ఉంటావు” అన్నారు. అనస్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూబకర్ మరియు ఉమర్‌లను ప్రేమిస్తున్నాను. మరియు నేను వారిలా సత్కార్యాలు ఆచరించలేక పోయినా, వారి పట్ల నాకున్న ప్రేమ కారణంగా (ప్రళయదినాన) నేను వారితో ఉండాలని ఆశిస్తున్నాను, .”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఓ అల్లాహ్, పరలోక జీవితం తప్ప నిజమైన జీవితం మరొకటి లేదు, కనుక (ఓ అల్లాహ్!) అన్సార్లను (సహాయకులు) మరియు ముహాజిరులను (వలస వచ్చినవారిని) క్షమించు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నిశ్చయంగా, స్వర్గంలో ఒక బజారు ఉంది. వారు (విశ్వాసులు) ప్రతి శుక్రవారం ఆ బజారుకు వస్తారు. అపుడు ఉత్తరం వైపు నుండి గాలి వీస్తూ మందమారుతాన్ని, వారి ముఖాల మీద, బట్టల మీద చల్లుతూ, వారి మనోహరతను, సౌందర్యాన్ని పెంచుతుంది. ఆ తరువాత వారు తమ కుటుంబాల వద్దకు పెరిగిన ఆకర్షణతో, శోభతో మరింత సౌందర్యవంతులుగా తిరిగి వస్తారు. వారి కుటుంబ సభ్యులు ఆరితో ఇలా అంటారు: అల్లాహ్ సాక్షి, మా తర్వాత మీరు ఆకర్షణను మరియు సౌందర్యాన్ని పెంచుకున్నారు. అల్లాహ్ సాక్షి, మా తరువాత మీరు సౌందర్యములోను, శోభ మరియు ఆకర్షణలోనూ నిశ్చయంగా అభివృద్ధి చెందారు."
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచుగా ఇలా దుఆ చేస్తూ ఉండేవారు “యా ముఖల్లిబల్ ఖులూబ్, సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్” (ఓ హృదయాలను త్రిప్పివేసేవాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై దృఢంగా ఉండేలా చేయి). నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! మేము మిమ్మల్ని విశ్వసించినాము, మరియు మీరు ఏ సందేశమునైతే తెచ్చినారో దానిని విశ్వసించినాము. మీరు మా గురించి భయపడుతున్నారా?” దానికి ఆయన “అవును, (ఎందుకంటే) హృదయాలు అల్లాహ్ చేతి రెండు వేళ్ళమధ్య ఉంటాయి. ఆయన వాటిని తన చిత్తము వచ్చిన వైపునకు మరల్చుతాడు” అన్నారు.”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“స్వర్గం మరియు నరకం నాకు ప్రస్తుత పరచబడ్డాయి; ఈ రోజు (నేను చూసిన) శుభాన్ని మరియు కీడును నేను ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసినది (ఏమిటో) ఒకవేళ మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వేవారు మరియు ఎక్కువగా ఏడ్చేవారు”. అతడు (ఉల్లేఖకుడు) ఇలా అన్నాడు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు దీనికంటే భారమైన దినము మరొకటి లేదు. వారు తమ తలలు కప్పుకున్నారు మరియు వారి నుండి ఏడుపు శబ్దం వినిపించింది. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి నిలబడి ఇలా అన్నారు: “అల్లాహ్ మా ప్రభువుగా, ఇస్లాం మా ‘దీన్’గా (ధర్మముగా - జీవన నియమావళిగా) మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ‘ప్రవక్త’గా మేము చాలా సంతృప్తి చెందాము”; ఆ సమయంలో ఒక వ్యక్తి లేచి నిలబడి ఇలా అన్నాడు: ‘నా తండ్రి ఎవరు?’ అప్పుడు ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఫలానా అతడు మీ తండ్రి”; అప్పుడు ఈ ఆయతు అవతరించింది: {“యా అయ్యుహల్లజీన ఆమనూ, లా తస్’అలూ అన్ అష్యాఅ ఇన్ తుబ్’ద లకుం తసూకుమ్....”} [విశ్వాసులారా! ఒకవేళ ఆ విషయాలు మీకు తెలుపబడితే మీకు ఇబ్బంది కలిగించే విషయాలను గురించి అడగకండి...] (సూరహ్ అల్’మాయిదహ్ 5:101)”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు