Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 110 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (48)
“ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి.” దానికి వారు (ఆయన సహచరులు) ఇలా అడిగారు “అవి ఏమిటి ఓ ప్రవక్తా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; చట్టబధ్ధమైన కారణం ఉంటే తప్ప “ప్రాణము తీయరాదు” అని అల్లాహ్ నిషేధించిన ప్రాణము తీయుట; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ప్రకటన చేసేవాడు ఇలా ప్రకటిస్తాడు: “మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు; ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు; మీరు శాశ్వతంగా జీవితులై ఉంటారు, ఎన్నటికీ చనిపోరు; మీరు శాశ్వతంగా యవ్వనంలో ఉంటారు, ఎన్నటికీ వృద్ధులు కారు; మరియు మీరు ఎల్లప్పుడూ సిరిసంపదలతో, సంపన్న పరిస్థితుల్లో జీవిస్తారు మరియు ఎప్పటికీ నిరుపేదలుగా మారరు; ఇది సర్వోన్నతుడైన, సర్వశ్రేష్ఠుడైన అల్లాహ్ యొక్క వాక్కు: అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: ''మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే! సూరతుల్ ఆరాఫ్ 7:43.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“(అల్లాహ్ ఆజ్ఞ లేకుండా వ్యాపించే) అంటువ్యాధి అనేది లేదు; పక్షులలో అపశకునం లాంటిది ఏమీ లేదు; గుడ్లగూబలోనూ అపశకునం ఏమీ లేదు; మరియు సఫర్ మాసములోనూ అపశకునం ఏమీ లేదు. అయితే, కుష్ఠువ్యాధిగ్రస్తుని నుండి దూరంగా ఉండండి, ఏవిధంగానైతే సింహం నుండి మీరు దూరంగా ఉంటారో.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఎవరు ఇస్లాం‌ను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో, నిశ్చయంగా అతను విజయవంతుడయ్యాడు."
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఒక మంచి సహచరుని సాంగత్యము, మరియు ఒక చెడు సహచరుని సాంగత్యముల యొక్క ఉపమానం కస్తూరి సుగంధాన్ని అమ్మువానికి, మరియు లోహకారుని (కమ్మరివాని) కొలిమి తిత్తులను ఊదు వానిని పోలి ఉన్నది. కస్తూరి సుగంధాన్ని అమ్మువాడు: అతడు నీకు కొద్ది సుగంధాన్ని ఉచితంగా ఇస్తాడు, లేదా నీవు అతడి నుండి కొద్ది సుగంధాన్ని కొనుక్కుంటావు, లేదా (అతని సాంగత్యములో గడిపిన కారణంగా) నీవు సుగంధాన్ని ఆస్వాదిస్తావు. లోహకారుని కొలిమి తిత్తులను ఊదువాడు: (కొలిమి నుండి నిప్పు రవ్వలు ఎగరడం వల్ల) అతడు నీ వస్త్రాలను కాలుస్తాడు, లేదా నీవు అతడి నుండి అప్రియమైన వాసన చూస్తావు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
«నిశ్చయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు మరియు నిద్రపోవడం ఆయనకు తగదు, ఆయన త్రాసులను వంచుతాడు మరియు త్రాసులను పైకి ఎత్తుతాడు, పగటి ఆచరణకు ముందు రాత్రి ఆచరణ, మరియు రాత్రి ఆచరణకు ముందు పగటి ఆచరణ ఆయన ముందు సమర్పించబడుతుంది, తేజస్సు ఆయన అడ్డు తెర - మరో ఉల్లేఖనం ప్రకారం: అగ్ని- ఆయన దానిని తెరిస్తే ఆయన ముఖ కాంతి ఆయన దృష్టికి అందేంతవరకు ఆయన సృష్టిని కాల్చేస్తుంది».
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: