Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 110 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (48)
“స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, ఒకరినొకరు అవమానకరంగా దూషించుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ముఖం కోపంతో ఎర్రబారింది, అతని మెడనరాలు ఉబ్బిపోయాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి మినష్’షైతాన్” (నేను షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను) అని పలికినట్లయితే అతడు ఉన్న స్థితి (కోప స్థితి) తొలిగి పోతుంది”. అక్కడ ఉన్నవారు అతనితో (కోపంతో ముఖము ఎర్రబారిన వ్యక్తితో) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోమన్నారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
నరకపు వాసులలో నేను చూడని రెండు రకాలు ఉన్నారు, వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆవు తోకలవంటి కొరడాలు కలిగిన జాతి, వాటితో వారు ప్రజలను కొడుతున్నారు; తాము స్వయంగా చెడు వైపునకు మొగ్గు చూపుతూ, చెడు వైపునకు ఆహ్వానిస్తూ దుస్తులు ధరించి కూడా నగ్నంగా కనిపించే స్త్రీలు; వారి తలలు (కొప్పులు) ఒంటెల మూపురాల మాదిరి ఎత్తుగా ఉండి ఒక వైపునకు వంగి ఉంటాయి. వారు స్వర్గములో ప్రవేశించలేరు, స్వర్గపు పరిమళం కూడా చూడలేరు – వాస్తవానికి స్వర్గపు పరిమళం చాలా చాలా దూరం నుండి వస్తూ ఉంటుంది.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ అజ్’జి వల్ కసల్; వల్ జుబ్ని వల్ బుఖ్’ల్; వల్ హరమి వల్ అజాబిల్ ఖబ్ర్; అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా; వ జక్కిహా అన్’త ఖైరు మన్ జక్కాహా; అన్’త వలియ్యుహా వ మౌలాహా; అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ ఇల్మిన్ లా యన్’ఫఉ; వమిన్ ఖల్బిన్ లా యఖ్’షఉ; వమిన్ నఫ్సిన్ లా తష్’బఉ; వమిన్ ద’వతిన్ లా యుస్తజాబ లహా” { ఓ అల్లాహ్! నేను నీ నుండి అసమర్థత, సోమరితనం, పిరికితనం, లోభితనం, దుర్బలత్వం మరియు సమాధి శిక్షల నుండి శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! నాకు నీ పట్ల భయభక్తులను ప్రసాదించు మరియు నా ఆత్మను శుద్ధి చేయు, దానిని శుద్ధి చేయడంలో నీవే అత్యుత్తముడివి. నీవే దాని రక్షకుడివి మరియు సంరక్షకుడివి. ఓ అల్లాహ్! ప్రయోజనకరం కాని జ్ఞానము నుండి, భయపడని హృదయము నుండి, సంతృప్తి చెందని ఆత్మ నుండి మరియు సమాధానం లభించని దుఆ (ప్రార్థన) నుండి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను.}
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో. కనుక ఎవరి 'హిజ్రత్' కేవలం అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని కొరకు చేయబడుతుందో, ఆ హిజ్రత్ కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆయన సందేశహరుని కొరకు చేసినదిగా భావించబడుతుంది. ఎవరి హిజ్రత్ ఈ ప్రపంచపు సౌఖ్యాలను, సదుపాయాలను పొందడానికి లేదా ఏ స్త్రీనైనా వివాహం చేసుకోవడానికి చేయబడుతుందో, అతని హిజ్రత్ దాని కొరకు చేసిన హిజ్రత్ గానే భావించబడుతుంది, దేని కొరకైతే అతడు సంకల్పించినాడో." (హిజ్రత్ - తన స్వస్థలాన్ని లేక స్వదేశాన్ని వదిలి పూర్తిగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళిపోవుట). బుఖారీ గ్రంథములో ఈ పదాలున్నాయి: ""నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో".
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"నిశ్చయంగా, అల్లాహ్ పరమ పరిశుద్ధుడు, మరియు పరిశుద్ధమైన దానిని తప్ప మరేమీ అంగీకరించడు. మరియు అల్లాహ్ విశ్వాసులకు, ప్రవక్తలకు ఆజ్ఞాపించిన దానినే మీకూ ఆజ్ఞాపించాడు."; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ ప్రవక్తలారా! పరిశుద్ధమైన వాటిని భుజించండి మరియు మంచి పనులు చేయండి.} (అల్-ముమినూన్: 51); మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వాటి నుండే భుజించండి.} (అల్-బఖరహ్: 172); ఆ తర్వాత ప్రవక్త ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు: అతను సుదీర్ఘ ప్రయాణం చేయడం వలన అతని వెంట్రుకలు చిందరవందరగా, దుమ్ము పట్టి ఉన్నాయి. అతను తన చేతులను ఆకాశం వైపు చాచి: 'ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!' అని వేడుకుంటున్నాడు. అయితే, అతని ఆహారం నిషేధించబడినది (హరామ్), అతని పానీయం నిషేధించబడినది, అతని దుస్తులు నిషేధించబడినవి, మరియు అతను నిషేధించబడిన వాటితోనే పోషించబడ్డాడు. అలాంటి వ్యక్తి దుఆ (ప్రార్థన) ఎలా స్వీకరించబడుతుంది?"
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె ఇంటి నుండి తెల్లవారుఝామున (ఫజర్ నమాజ్ తర్వాత) బయటికి వెళ్లారు. ఆమె తన నమాజు స్థలంలోనే కూర్చుండి పోయారు (అల్లాహ్ యొక్క ధ్యానం చేసుకుంటూ ఉండి పోయారు). తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుహా నమాజు సమయంలో తిరిగి వచ్చారు. ఆమె ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: "నేను నిన్ను వదిలి వెళ్లినప్పటి నుంచీ నువ్వు ఇంకా ఇదే స్థితిలో ఉన్నావా?" ఆమె చెప్పింది: "అవును." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: "నేను నిన్ను వదిలి వెళ్లిన తర్వాత నేను నాలుగు పదాలను మూడుసార్లు స్మరించినాను. నువ్వు ఈ రోజు చేసిన దిక్ర్‌తో పోలిస్తే, అవి తూకంలో బరువుగా ఉంటాయి: అవి 'సుబహానల్లాహి వ బిహమ్'దిహి, అదద ఖల్కిహి, వ రిదా నఫ్సిహి, వ జీనత అర్షిహి, వ మిదాద కలిమాతిహి' (అర్థం: అల్లాహ్ పరమ పవిత్రుడు మరియు సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి - ఆయన సృష్టిరాశుల సంఖ్య మేరకు, ఆయన సంతృప్తి మేరకు, ఆయన అర్ష్ సింహాసనం యొక్క బరువు మేరకు, లెక్కించనలవికాని ఆయన వచనాల మేరకు)."
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: