Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 8 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక రోజు మా మధ్యన (కూర్చుని) ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడినారు. నిలబడి హితబోధ చేసినారు. ఆ హితబోధ మా హృదయాలను భయంతో కంపించేలా చేసింది, మా కళ్ళనుండి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. మాలో ఒకరు ఇలా అన్నారు: “మీరు చేసిన హితబోధ, శాశ్వతంగా విడిచి వెళ్ళబోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది. మా కొరకు ఏదైనా ప్రమాణాన్ని ఉపదేశించండి”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి; మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకుని ఉండండి. (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే.”
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్ని దానిని కంఠస్థం చేసుకునేందుకు వ్రాసి ఉంచుకునే వాడిని. దానికి ఖురైషీయులు ఇలా అంటూ నన్ను వారించేవారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్నీ రాస్తున్నావా? ఆయన మానవమాత్రుడు, ఆయన కోపంలోనూ మాట్లాడుతారు, అలాగే సంతోషంలోనూ మాట్లాడుతారు.” దానితో నేను రాయడం ఆపివేసినాను. (జరిగిన విషయాన్ని) తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రస్తావించినాను. అపుడు వారు తన చేతి వేలితో తన నోటిని చూపుతూ ఇలా అన్నారు: “రాసిపెట్టుకుంటూ ఉండు (ఓ అబ్దుల్లాహ్)! ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) సత్యము తప్ప మరేమీ బయటకు రాదు.”
ప్రామాణికమైన హదీథు అబూదావూద్ నమోదు చేసినారు:
“జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది. అందులో హలాల్ గా ప్రకటించ బడినదంతా మేము హలాల్ గా భావిస్తాము మరియు అందులో హరాంగా ప్రకటించ బడినదంతా మేము హరాం గా భావిస్తాము”. (ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు) “జాగ్రత్త! అల్లాహ్ యొక్క సందేశహరుడు దేనినైతే హరాంగా ప్రకటించినాడో, అది అల్లాహ్ హరాంగా ప్రకటించిన దానితో సమానం”.
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ మరియు ఇబ్నెమాజహ్ నమోదు చేసినారు:
“నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం తన ముఖద్దిమాలో నమోదు చేసినారు:
"నేను మీకు అల్లాహ్ పట్ల భయభక్తులను కలిగి ఉండమని, మరియు ఒక బానిస మీపై నాయకుడిగా నియమించబడినప్పటికీ, అతడి మాట వినమని మరియు విధేయత చూపమని ఉపదేశిస్తున్నాను. నిశ్చయంగా, నా తర్వాత మీలో ఎవరైతే జీవిస్తారో, వారు అనేక విభేదాలను చూస్తారు. కాబట్టి, నా సంప్రదాయాన్ని (సున్నత్) మరియు సన్మార్గం పొందిన, సరైన మార్గంలో నడిచిన ఖలీఫాల సంప్రదాయాన్ని మీరు తప్పనిసరిగా అనుసరించండి. వాటిని మీరు కొర పళ్ళతో గట్టిగా పట్టుకోండి. మరియు (ఇస్లాం ధర్మంలో) నూతన కల్పితాల (బిద్అత్) పట్ల మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; ఎందుకంటే, (ఇస్లాం ధర్మంలో) ప్రతి నూతన కల్పితము (బిద్అత్) ఒక మార్గభ్రష్టత."
ప్రామాణికమైన హదీథు అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
“నా ఉమ్మత్ యొక్క చివరి కాలములో (ఉమ్మత్’లోని) కొందరు మీరు గానీ, మీ తాతముత్తాతలు గానీ ఎన్నడూ వినని హదీథులను మీకు చెబుతారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మరియు వారి పట్ల జాగ్రత్త వహించండి."
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుకున్నట్లే".
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: