Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 4 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
{నజర్’[మొక్కుబడి]కు చెల్లించే పరిహారమే యమీనుకు [ప్రమాణం తప్పినందుకు ] పరిహారంగా చెల్లించబడుతుంది.}
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“(ఏ విషయం కొరకైనా) మొక్కుకోవడాన్ని (మొక్కుబడులను) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు; మరియు ఇలా అన్నారు: “మొక్కుకోవడం ఏ మంచినీ, శుభాన్నీ తీసుకొని రాదు, అది కేవలం పిసినారి నుండి ఎంతో కొంత బయటకు తీసే మార్గము మాత్రమే.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైనా ఒక ముస్లిం యొక్క సంపదను లేదా ఆస్తిని మోసపూరితంగా ఆక్రమించుకునే ఉద్దేశ్యముతో (అబద్ధపు) ప్రమాణం చేస్తాడో, (తీర్పు దినమున) అతనిపై అల్లాహ్ ఆగ్రహంతో ఉన్న స్థితిలో అతడు అల్లాహ్’ను కలుస్తాడు.” అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రదిఅల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “అల్-అష్’అథ్ ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా, ఇది నా గురించే. నాకు ఒక యూదుడితో ఉమ్మడి భూమి ఉంది, ఆ యూదుడు తరువాత నా యాజమాన్యాన్ని నిరాకరించాడు; అప్పుడు నేను రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అతనిమీద ఫిర్యాదు చేసినాను. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీదగ్గర అందుకు రుజువులు ఏవైనా ఉన్నాయా?” అని అడిగారు. నేను “లేవు” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వస యూదునితో “నీవు ప్రమాణం చేయి” అన్నారు. అందుకు నేను: “ఓ రసూలుల్లాహ్! అతడు ప్రమాణం చేసి నా సంపదను కబ్జా చేసుకుంటాడు (అధీన పరుచుకుంటాడు) అన్నాను. అపుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసినాడు: {ఇన్నల్లజీన యష్తరూన బి అహ్’దిల్లాహి, వ ఐమానిహిం థమనన్ ఖలీలా.... } ఆయతు చివరి వరకు; [నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో…..] (సూరహ్ ఆలి ఇమ్రాన్ 3:77)
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
నేను, కొంతమంది అష్’అరీ తెగ వారితో కలిసి, “మాకు సవారీ వాహనాలు (ఉదా: ఒంటెలు, గుర్రాలు మొ.) కావాలి” అని కోరుతూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళినాము. ఆయన “అల్లాహ్ సాక్షిగా! మీరు సవారీ అయి వెళ్ళడానికి నేను ఏమీ ఇవ్వను, మిమ్ములను సవారీ చేయడానికి నావద్ద ఏమీ లేదు” అన్నారు. అల్లాహ్ కోరినంత కాలము మేము ఎదురు చూసాము. అపుడు వారి వద్దకు మూడు ఒంటెలు తీసుకురాబడినాయి. ఆ మూడు ఒంటెలను తీసుకు వెళ్ళమని ఆయన మమ్మల్ని ఆదేశించినారు. మేము వాటిని తీసుకుని వెళ్ళినాము. అపుడు మాలో కొందరు “అల్లాహ్ మనలను అనుగ్రహించడు, మనం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, మనకు సవారీ సమకూర్చమని కోరినాము. కానీ ఆయన అల్లాహ్ పై ప్రమాణం చేసి మరీ మనకు సవారీ ఇవ్వను అని అన్నారు; కానీ తరువాత ఇచ్చినారు” అన్నారు. అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తిరిగి వచ్చి (మా మధ్య) జరిగిన విషయాన్ని వారికి తెలియజేసినాము. దానికి ఆయన ఇలా అన్నారు: “మీకు సవారీలను నేను సమకూర్చలేదు; కానీ అల్లాహ్ సమకూర్చినాడు. అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే మరో విషయం శుభప్రదంగా కనిపిస్తే, నేను ప్రమాణం చేసిన దాని కొరకు పరిహారం చెల్లించి, ఆ శుభప్రదమైన విషయాన్నే ఎన్నుకుంటాను.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు