Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 27 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి. జిబ్రీల్ (అలైహిస్సలాం) రమదాన్ మాసములో ప్రతి రాత్రి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఖుర్’ఆన్ పునశ్చరణ చేయుట కొరకు. అపుడు దాతృత్వములో, ఉదారతలో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వేగవంతమైన గాలి కంటే కూడా ఎక్కువ వేగంగా ఉండేవారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించమని; రెండు రకాతులు సలాత్ అద్’దుహా ఆచరించమని; రాత్రి నిద్ర పోవడానికి ముందు విత్ర్ సలాహ్ ఆచరించమని.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఒక ప్రయాణంలో ఉండగా చాలామంది ఒకచోట కూడి ఒక వ్యక్తికి నీడను కల్పిస్తున్నారు,అది చూచి ప్రవక్త అది ఏమిటి ?అని అడిగారు అక్కడ ఉన్నవారు ‘అతడు ఉపవాసి’ అని చెప్పారు, ప్రవక్త సమాధానమిస్తూ; ప్రయాణంలో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు అని చెప్పారు, ముస్లిం హదీథు నమోదు ప్రకారం ‘అల్లాహ్ మీ కొరకు అనుగ్రహించిన అనుమతిని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’ అని ఉంది.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సహరీ (ఉపవాసం ప్రారంభించే ముందు చేసే) భోజనం చేసినాము. తర్వాత ఆయన నమాజ్‌ కొరకు లేచినారు. అపుడు నేను ఇలా అడిగాను: అదాన్ (నమాజు కొరకు పిలిచే పిలుపు) మరియు సహరీ మధ్య ఎంత సమయం ఉండింది? దానికి ఆయన ఇలా అన్నారు: సుమారు 50 ఆయతుల అంత (అంటే 50 ఖుర్‌ఆన్ వచనాలు పఠించే సమయమంత అని అర్థము).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు