Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 58 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమం తప్పకుండా ఫజ్ర్ యొక్క రెండు రకాతుల సున్నతు నమాజు కంటే ఎక్కువగా ఏ సున్నతు నమాజును పాటించలేదు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيالسنن الرواتب
“ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ రజియల్లాహు అన్హు ఇలా నాకు చెబుతూ నా చేత ము’ఆవియహ్ రజియల్లాహు అన్హు కు ఇలా ఒక లేఖ వ్రాయించినారు “ప్రతి ఫర్జ్ సలాహ్ (నమాజు) తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్; అల్లాహుమ్మ లా మాని’అ, లిమా అ’అతైత, వలా ము’తియ లిమా మన’త, వలా యన్’ఫఉ జల్’జద్ది మిన్కల్ జద్దు” (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, విశ్వ సామ్రాజ్యము ఆయనకు చెందినదే, సకల స్తోత్రములూ ఆయనకు చెందినవే, ఆయన సర్వసమస్తము పై ఆధిపత్యము, అధికారము కలవాడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించదలిచిన దానిని ఎవరూ ఆపలేరు, నీవు ఆపివేసిన దానిని ఎవరూ ప్రసాదించలేరు. ఐశ్వర్యవంతునికి అతనిసంపద, నీకు వ్యతిరేకంగా దేనికీ పనికిరాదు.)”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيأذكار الصلاةموضوعات الحديثالذِّكْر، الأذكار الشرعية، الإيمان بالقدر خيره وشره
“ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి” మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيفضل صلاة الجماعة وأحكامها
“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيقيام الليل، العشر الأواخر من رمضانموضوعات الحديثسعة فضل الله عز وجل، العشر الأواخر وليلة القدر، قيام الليل
“నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వేయి రెట్లు ఉత్తమమైనది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيأحكام المسجد الحرام والمسجد النبوي، أحكام المساجدموضوعات الحديثأحكام المسجد الحرام، أحكام المسجد النبوي
“ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి, మా వద్దకు వచ్చినారు. మేము ఆయనతో “ఓ రసూలల్లాహ్! నిశ్చయంగా మీకు సలాం ఎలా చేయాలో మీరు మాకు నేర్పినారు. అయితే మీపై శాంతి, శుభాలకొరకు ఏమని పలకాలి?” అని అన్నాము. దానికి ఆయన “మీరు ఇలా పలకండి – ‘అల్లాహుమ్మ, సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లయిత అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్; అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్, వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్మజీద్’ (ఓ అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శాంతిని కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శాంతిని కురిపించినావో, నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు; ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో. నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيآداب العالم والمتعلم، الأدعية المأثورة، أذكار الصلاةموضوعات الحديثحقوق النبي ﷺ، صفة الصلاة
"ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيفوائد ذكر الله عز وجل، تزكية النفوس، أحكام المساجد
“మేము మస్జిదులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై సవారై వచ్చినాడు. అతడు మస్జిదు (ప్రాంగణము)లో తన ఒంటెను కూర్చొనేలా చేసి, దాని ముందరి కాళ్ళు కట్టివేసి, (మా వద్దకు వచ్చి) “మీలో ముహమ్మద్ ఎవరు?” అని ప్రశ్నించాడు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము “ఇదిగో తెల్లని మేని ఛాయతో, చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నది ఆయనే” అన్నాము. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశ్యించి “ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా!” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “చెప్పు, నీకు సమాధానం చెప్పడానికి నేనిక్కడే ఉన్నాను” అన్నారు. అపుడు అతడు “నిన్నొక విషయం అడుగుతాను. కఠినంగా ప్రశ్నిస్తాను. కనుక “కోపగించుకోకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నువ్వు ఏం అడగాలను కుంటున్నావో అడుగు” అన్నారు. అతడు “నీ ప్రభువు సాక్షిగా, మరియు నీకంటే ముందు గడిచిపోయిన వారి ప్రభువు సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను – అల్లాహ్ నిన్ను సర్వ మానవాళి కొరకు (తన) సందేశహరునిగా పంపించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను “దినము రాత్రిలో (రాత్రింబవళ్ళలో) ఐదు సార్లు సలాహ్ (నమాజు) ఆచరించాలని నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. ఆ మనిషి తిరిగి “అల్లాహ్ సాక్షిగా నిన్ను అడుగుతున్నాను, సంవత్సరం మొత్తములో (ఫలానా) ఈ నెలలో ఉపవాసాలు పాటించాలని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను, మాలోని సంపన్నుల నుండి దానము తీసుకుని, దానిని మాలోని పేదవారికి పంచమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు “నీవు ఏ సందేశముతో పంపబడినావో, నేను దానిని పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ‘జిమామ్ ఇబ్న్ సాలబా’, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيالدعوة إلى الله، وجوب الصلاة وفضلها وحكم تاركها، وجوب الزكاة وحكم تاركها، وجوب الصيام وحكم تاركه، الإيمان بالله عز وجل، الإيمان بنبينا محمد صلى الله عليه وسلم، الإسلامموضوعات الحديثالزكاة ومكانتها، الصوم الواجب، الدعوة إلى الله، التواضع، حقوق النبي ﷺ، مكانة الصلاة وفضلهامحاور التعريف بالإسلامالتعريف بالنبي محمد صلى الله عليه وسلم، أركان الإسلام