عربي - Arabic English Qafár af - Afar Afrikaans - Afrikanns Akan Shqip - Albanian አማርኛ - Amharic Հայերեն - Armenian অসমীয়া - Assamese Azərbaycanca - Azerbaijani Bamanankan - Bambara Bassa Bemba বাংলা - Bengali Bosanski - Bosnian Български - Bulgarian မြန်မာဘာသာ - Burmese Bisaya - Cebuano Cham Нохчий - Chechen chiCheŵa - Chewa 中文 - Chinese Адыгэбзэ - Circassian Hrvatski - Croatian Česky - Czech Dagbani Dansk - Danish فارسی دری - Dari Dendi ދިވެހި ބަސް - Dhivehi Nederlands - Dutch إستوني - Estonian Suomi - Finnish Français - French Fulfulde - Fula ქართული - Georgian Deutsch - German Ελληνικά - Greek ગુજરાતી - Gujrati Kreyòl ayisyen - Haitian Creole Hausa हिन्दी - Hindi Magyar - Hungarian Igbo Indonesia - Indonesian Italiano - Italian 日本語 - Japanese Jóola - Jola ಕನ್ನಡ - Kannada Қазақша - Kazakh ភាសាខ្មែរ - Khmer Kikuyu Ikinyarwanda - Kinyarwanda Ikirundi - Kirundi 한국어 - Korean كوردی سۆرانی - kurdish كوردي kurmancî - Kurmanji Kyrgyz ລາວ - Lao latviešu - Latvian Lingala lietuvių - Lithuanian Luganda Македонски - Macedonian Maguindanaon Malagasy - Malagasy Bahasa Melayu - Malay മലയാളം - Malayalam Mandinka मराठी - Marathi Mõõré - Moore नेपाली - Nepali أنكو - NKo Norwegian ଓଡ଼ିଆ - Odia oromoo - Oromo پښتو - Pashto فارسی - Persian Polski - Polish Portuguese ਪੰਜਾਬੀ - Punjabi Română - Romanian Русский - Russian Српски - Serbian Shona සිංහල - Sinhala Slovenščina - Slovenian Soomaaliga - Somali Soninke Sesotho - Sotho Español - Spanish Kiswahili - Swahili Svenska - Swedish Tagalog Тоҷикӣ - Tajik தமிழ் - Tamil తెలుగు - Telugu ไทย - Thai ትግረኛ - Tigrinya Türkçe - Turkish Ukrainian اردو - Urdu ئۇيغۇرچە - Uyghur Ўзбек - Uzbek Việt Nam - Vietnamese Wolof Yao Yorùbá - Yoruba Zarma زولو - Zulu
837 హదీసులు
ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం
వర్గాలు
వర్గాలు (21)
హదీసు స్థాయి
ఉల్లేఖించిన గ్రంథం
మిగిలిన మూలాలను చూపించు
ఉల్లేఖకుడు
అన్ని ఉల్లేఖకులను చూపించు (49)
కొంతమంది మగవారు సహ్’ల్ బిన్ స’ఆద్ అస్’సఈదీ రజియల్లాహు అన్హు వద్దకు వచ్చారు. వారు "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన వేదిక (మింబర్) దేనితో తయారు చేసి ఉంటారు" అనే విషయంలో వాదులాడుకోసాగినారు. వారు అతడిని దాని గురించి అడిగినారు. అతడు ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, అది దేనితో తయారు చేయబడినదో నాకు తెలుసు, అది ఇక్కడికి తీసుకు రాబడి ఇక్కడ స్థాపించబడిన మొదటి రోజునే నేను దానిని చూసాను, (స్థాపించబడిన తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై మొదటిసారి కూర్చోవడం కూడా చూసాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరిని ఫలానా స్త్రీ ఇంటికి పంపారు. సహ్’ల్ ఆ స్త్రీ పేరును కూడా చెప్పారు. ఆమెతో “మీ వద్ద ఉన్న వడ్రంగి సేవకుడిని "నేను (మస్జిదులో) ప్రజలను సంబోధించి ప్రసంగించ వలసి వచ్చినపుడు కూర్చోవడానికి గానూ ఎత్తైన ఒక వేదికను తయారు చేయమని" పురమాయించండి” అని చెప్పమని పంపినారు. ఆమె అతనిని (వడ్రంగి సేవకునికి) ఆ పని కొరకు పురమాయించింది. అతడు ఆ వేదికను, అల్-ఘాబా నుండి ‘తమరిస్క్’ వృక్షపు కలపను తెప్పించి దానిని తయారు చేసినాడు. ఆ మెంబర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపబడింది. వారు దానిని అదుగో ఇక్కడే స్థాపించమని అదేశించినారు. తరువాత (దాని మెట్లు ఎక్కి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపైకి వెళ్ళడాన్ని, దానిపై ఆయన నమాజు ఆచరించడాన్ని చూసాను. దానిపై ఉండగా ఆయన (“అల్లాహు అక్బర్” అని) తక్బీర్ పలికి నమాజును ప్రారంభించి, దానిపై ఉండగానే రుకూ చేసినారు. తరువాత వారు అడుగులు వెనుకకు వేస్తూ వేదిక మెట్లుదిగి, మెట్ల ప్రక్కన సజ్దా చేసినారు. (రెండు సజ్దాలు చేసిన) తరువాత వారు తిరిగి మెట్లు ఎక్కి వేదికపైకి వెళ్ళినారు. (ఆ విధంగా) వారు నమాజును పూర్తిచేసి ముగించిన తరువాత ప్రజల వైపునకు తిరిగి “ఓ ప్రజలారా! కేవలం నేను నమాజును ఏ విధంగా ఆచరినానో మీరు చూడాలని, ఆ విధంగా మీరు అనుసరించాలని, నమాజును ఏ విధంగా ఆచరించాలో మీరు నేర్చుకోవాలని మాత్రమే ఇలా చేసినాను” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఒక వ్యక్తి ఒంటరిగా ఆచరించే నమాజు కంటే సామూహికంగా చేసే నమాజు (జమాఅత్ తో ఆచరించే నమాజు) యొక్క ప్రతిఫలం ఇరవై ఐదు రెట్లు గొప్పది. రాత్రి సమయపు దేవదూతలు మరియు పగటి సమయపు దేవదూతలు ఫజ్ర్ నమాజు సమయంలో సమావేశమవుతారు.' "అబూ హురైరా ఇంకా ఇలా అన్నారు, "కావాలంటే మీరు పవిత్ర గ్రంథాన్ని పఠించండి, “ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా” (నిష్చయంగా తెల్లవారుజామున ఖురాన్ పారాయణం (ఫజ్ర్ ప్రార్థన) ఎల్లప్పుడూ వీక్షించబడుతుంది." (సూరహ్ అల్ ఇస్రా 17:78).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు అన్ని సందర్భాలలో ఇస్తిఖారా నమాజ్ చేయుటను ఖుర్ఆన్లోని సూరాలు నేర్పినట్టుగా నేర్పించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పేవారు: "మీలో ఎవరికైనా ఏదైనా పని చేయాలనే ఉద్దేశం ఉంటే, తప్పనిసరి ఫర్ద్ నమాజ్ కాకుండా రెండు రకాతుల (ఇస్తిఖారహ్) నమాజ్ చేయాలి. తర్వాత ఇలా దువా చేయాలి:
اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ، فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ، وَتَعْلَمُ وَلَا أَعْلَمُ، وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ، اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي، وَمَعَاشِي، وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ، وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي» أَوْ قَالَ: «فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ، فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ، وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ، ثُمَّ أَرْضِنِي» قَالَ: «وَيُسَمِّي حَاجَتَه».
("అల్లాహుమ్మ ఇన్నీ అస్'తఖీరుక బి ఇల్మిక, వ అస్తఖ్'దిరుక బి ఖుద్'రతిక, వ అస్అలుక మిల్ ఫద్'లికల్ అజీమ్, ఫఇన్నక తఖ్'దిరు వలా అఖ్'దిరు, వ తఅ్'లము వలా అఅ్'లము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదాల్ అమ్'ర - (ఇక్కడ మీ విషయం ప్రస్తావించాలి) - ఖైరున్ లి ఫిద్దునియా వమఆషీ వ ఆఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు - ఆజిలిహి వ ఆజిలిహి - ఫఖ్'దుర్'హు లీ వ యస్సిర్'హు లీ థుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅ్'లము అన్న హాదల్ అమ్'ర షర్రు లీ ఫిద్దునియా వ మఆ్'షీ వ ఆ్'ఖిబతి అమ్'రి - లేదా ఇలా అన్నారు ఆజిలిహి వ ఆజిలిహి - ఫస్'రిఫ్'హు అ'న్నీ వస్'రిఫ్'నీ అ'న్'హు వఖ్'దుర్ లిల్ ఖైర హంథు కాన థుమ్మ అర్'దినీ బిహి)
అర్థం: "అల్లాహ్, నేను నీ జ్ఞానంతో నీ సలహా అడుగుతున్నాను. నీ శక్తితో నేను నీ వద్ద బలాన్ని కోరుతున్నాను. నీ గొప్ప దయను నేను అడుగుతున్నాను. ఏదైనా నువ్వే చేయగలవు, నేనేమీ చేయలేను. నీకే సర్వం తెలుసు, నాకేమీ తెలియదు. నువ్వే గోచర, అగోచరాలన్నింటి జ్ఞానం గలవాడివి. ఓ అల్లాహ్! ఈ విషయం (తన అవసరాన్ని ఇక్కడ చెప్పాలి) నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) మంచిదని నీ జ్ఞానంలో ఉంటే, అది నా కొరకు నిర్ణయించు, సులభతరం చేయు, దానిలో నాకు శుభాలు ప్రసాదించు. ఇది నా ధర్మం, నా జీవితం, నా పనుల ఫలితానికి (లేదా నా తక్షణ, భవిష్యత్ విషయాలకు) చెడుగా ఉంటే, దానిని నన్ను దూరం చేయు, నన్ను దాని నుండి దూరం చేయు, అది ఎక్కడ ఉన్నా నా కొరకు మంచి దానినే నిర్ణయించు, నన్ను దానితో సంతృప్తిగా ఉంచు." ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: "తన అవసరాన్ని (ఏ విషయం కోసం ఇస్తిఖారా చేస్తున్నాడో) స్పష్టంగా పేరు పెట్టి చెప్పాలి."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నే’మతు, వ లహుల్ ఫధ్’లు, వ లహుథ్థనాఉల్ హసను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన, వలౌ కరిహల్ కాఫిరూన్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయనకు ఎవ్వరూ సాటి (సమానులు) లేరు, విశ్వసామ్రాజ్యము ఆయనదే, మరియు సకల ప్రశంసలూ ఆయనకే; ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు. అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు, అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము, సకల సంపద, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే; అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి, మరియు అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము). అబ్దుల్లాహ్ ఇబ్న్ అజ్జుబైర్ ఇలా అన్నారు: “ సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన ప్రతిసారీ అల్లాహ్ స్వర్గంలో అతనికి ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు