Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 74 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నే’మతు, వ లహుల్ ఫధ్’లు, వ లహుథ్థనాఉల్ హసను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన, వలౌ కరిహల్ కాఫిరూన్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయనకు ఎవ్వరూ సాటి (సమానులు) లేరు, విశ్వసామ్రాజ్యము ఆయనదే, మరియు సకల ప్రశంసలూ ఆయనకే; ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు. అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు, అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము, సకల సంపద, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే; అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి, మరియు అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము). అబ్దుల్లాహ్ ఇబ్న్ అజ్జుబైర్ ఇలా అన్నారు: “ సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన ప్రతిసారీ అల్లాహ్ స్వర్గంలో అతనికి ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:
“శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవరూ మీ భుజాలపై ఏ ఆచ్ఛాదనా లేకుండా ఒకే వస్త్రములో సలాహ్ (నమాజు) ఆచరించకండి”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ ముగించిన తరువాత, సూర్యుడు బాగా ఉదయించే వరకు ఆయన నమాజు చేసిన చోటనే కూర్చునేవారు, ఆయన ఫజ్ర్ (ఉదయం) నమాజు చేసిన చోట నుండి సూర్యుడు ఉదయించే వరకు లేచేవారు కాదు. సూర్యుడు ఉదయించిన తర్వాతనే లేచేవారు. సహాబాలు (జాహిలియ్యా) అజ్నా కాలం నాటి విషయాలను మాట్లాడుకుంటూ, నవ్వుకునేవారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చిరునవ్వు నవ్వేవారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: