Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 74 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు క్షమాభిక్ష కోరుకునేవారు. తరువాత ఇలా పలికేవారు “అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్” (ఓ అల్లాహ్! నీవు సంపూర్ణ శాంతివి, శాంతి, ప్రశాంతత అన్నీ నీ నుంచే; శుభాలన్నీ నీ కొరకే, ప్రతి శుభమూ నీ నుంచే; మహోన్నత, పరమ పవిత్రత, ఠీవి, వైభవము, తేజస్సు గలవాడా; మరియు కీర్తి, గౌరవం, ఘనత గలవాడా). అల్-వలీద్ ఇలా అన్నారు: “నేను అల్-ఔజాయీ ని ‘అల్ ఇస్తిగ్’ఫార్’ అంటే ఎలా అడగాలి?” అని ప్రశ్నించాను. దానికి ఆయన “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్” అని పలుకు” అన్నారు.” (అస్తగ్ఫిరుల్లాహ్: నేను అల్లాహ్ నుండి క్షమాభిక్ష కోరుతున్నాను)
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రతి ఫర్జ్ నమాజులోనూ, ప్రతి సున్నత్ మరియు నఫీల్ నమాజులోనూ, రమజాన్ నెలలో అయినా, లేక ఇతర నెలలలో అయినా “అల్లాహు అక్బర్” అని పలికేవారు. ఆయన (నమాజు కొరకు) లేచి నిలబడినపుడు “అల్లాహు అక్బర్” అని పలికేవారు, రుకూ చేయునపుడు “అలాహు అక్బర్” అని పలికేవారు. రుకూ నుండి లేచునపుడు “సమియల్లాహు లిమన్ హమిదహ్” అని, సజ్దాహ్ లోనికి వెళ్ళుటకు ముందు “రబ్బనా లకల్ హంద్” అని పలికేవారు. తరువాత సజ్దాహ్ చేయుట కొరకు వంగునపుడు “అల్లాహు అక్బర్” అని పలికి సజ్దాహ్ చేసేవారు. తరువాత సజ్దాహ్ నుండి తల పైకి లేపునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికేవారు. తిరిగి సజ్దాహ్ చేయునపుడు తక్బీర్ పలికి సజ్దాహ్ చేసేవారు. తరువాత సజ్దాహ్ నుండి తలపైకి లేపునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికేవారు; తరువాత కూర్చుని ఉన్న స్థితి నుండి పైకి లేచునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) అని రెండు సందర్భాలలోనూ పలికేవారు. సలాహ్ (నమాజు) ముగించే వరకూ ప్రతి రకాతులోనూ ఆయన ఈ విధంగా ఆచరించేవారు. అపుడు (నమాజు ముగించిన తరువాత) వెళ్ళునపుడు ఆయన ఇలా అనేవారు “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో ఆయన సాక్షిగా – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు మీ అందరిలో నిశ్చయంగా నేను అత్యంత దగ్గరిగా ఉన్నాను. ఈ ప్రపంచం నుండి వెడలిపోయేటంత వరకు ఆయన నమాజు ఈ విధంగానే ఉండినది”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నిశ్చయంగా షైతాన్ నాకూ, నా సలాహ్’కు (నమాజుకు), మరియు (నమాజులో) నా ఖుర్’ఆన్ పఠనానికి మధ్య వస్తున్నాడు, నా ఏకాగ్రతను భంగపరుస్తున్నాడు.” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వాడి ‘ఖింజబ్’ అని పిలువబడే షైతాను. నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, వెంటనే (అ’ఊజు బిల్లాహ్ అని) అల్లాహ్ యొక్క శరణు కోరుకో, మరియు నీ ఎడమ వైపునకు మూడు సార్లు (ప్రతీకాత్మకంగా) ఉమ్మివేయి.” నేను అలాగే చేసాను. అల్లాహ్ వాడిని నా నుండి దూరం చేసినాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మీరు నమాజు ఆచరించునపుడు మీ వరుసలను సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీలో ఒకరు నాయకత్వం వహించి (ఇమామత్ వహించి) మిగతా వారికి నమాజు చదివించాలి. అతడు “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికితేనే మీరు కూడా ‘తక్బీర్’ పలుకండి. ఎపుడైతే అతడు “గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్” (సూరహ్ అల్ ఫాతిహా: 7వ ఆయతు) అని పఠిస్తాడో, మీరు ‘ఆమీన్’ అనండి, అల్లాహ్ మీ ప్రార్థనకు స్పందిస్తాడు. ఇమాం తక్బీర్ పలికితేనే, మీరు కూడా తక్బీర్ పలుకండి, ఎందుకంటే అతడు మీ కంటే ముందుగా రుకూ చేస్తాడు, మరియు రుకూ నుండి మీ కంటే ముందుగా పైకి లేస్తాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఇది దానికి సమానం అవుతుంది (మీరు అలా చేయడం ఇమాం చేసిన దానికి సమానం అవుతుంది). ఇమాం “సమి’అల్లాహు లిమన్ హమిదహ్” (అల్లాహ్ తనను కీర్తించిన వానిని వింటాడు (తనను కీర్తించిన వాని దుఆను వింటాడు) అని పలికితే, మీరు “అల్లాహుమ్మా, రబ్బనా లకల్ హంద్” (ఓ అల్లాహ్, మా ప్రభూ, పొగడ్తలు, కీర్తనలు అన్నీ నీ కొరకే) అని పలకండి – అల్లాహ్ మిమ్మల్ని (మీ దుఆలను) వింటాడు. ఎందుకంటే అల్లాహ్ తన సందేశహరుని నాలుక ద్వారా పలికించాడు – అల్లాహ్ తనను కీర్తించిన వానిని (అతని దుఆలను) వింటాడు అని. అతడు (ఇమాం) తక్బీర్ పలికి ‘సజ్దాహ్’ చేస్తే మీరు కూడా తక్బీర్ పలికి సజ్దహ్ చేయండి. అతడు మీకంటే ముందే సజ్దహ్ చేస్తాడు మరియు మీ కంటే ముందే సజ్దహ్ నుండి పైకి లేస్తాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(మీరు) అలా చేయడం, దానికి (అతడు చేసిన దానికి) సమానం అవుతుంది. అతడు ‘తషహ్హుద్’ కొరకు కూర్చొంటే, మీ అందరిలో ప్రతి ఒక్కరి నోట ముందుగా రావాల్సిన మాటలు ఇవే అయి ఉండాలి: “అత్తహియ్యాతు, అత్తయ్యిబాతు, అస్సలవాతు లిల్లాహి, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి, వ బరకాతుహు, అస్సలాము అలైనా, వ అలా ఇబాదిల్లాహి అస్సాలిహీన్, అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“తీర్పు దినము నాడు ప్రజల మధ్య ‘ముఅజ్జిన్’లు (మస్జిదులలో అజాన్ పలికేవారు) పొడవైన మెడలు కలిగి ఉంటారు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: