Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 6 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
ఒకసారి ఆయన అతా ఇబ్న్ అబీ రబాహ్ తో ఇలా అన్నారు: "స్వర్గవాసులలోని ఒక స్త్రీని నేను నీకు చూపించనా?" దానికి అతా “తప్పనిసరిగా చూపిండి" అని అన్నారు: . అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు అతనితో ఇలా అన్నారు: “ఆ నలుపు రంగు స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నది: “నేను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాను. దాని కారణంగా (స్పృహ తప్పి పడిపోయినపుడు) నా శరీరం (పై బట్టలు తొలగిపోయి) అనాచ్చాదితం అవుతున్నది. నా కొరకు అల్లాహ్’ ను ప్రార్థించండి”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నువ్వు కావాలనుకుంటే (ఈ వ్యాధి పట్ల) సహనం వహించు, నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు; లేదా, నువ్వు కోరుకుంటే, నిన్ను స్వస్థపరచమని నేను అల్లాహ్‌ను వేడుకుంటాను.”. దానికి ఆమె ఇలా అన్నది: “అయితే నేను సహనం వహిస్తాను. అయితే మూర్ఛ స్థితిలో నేను అనాచ్ఛాదితం అవుతున్నాను. నేను అలా అనాచ్ఛాదితం కాకుండా ఉండేలా చూడమని అల్లాహ్’కు దుఆ చేయండి.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె కొరకు ఆ విధంగా దుఆ చేసినారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
‘ఉక్ల్’ లేదా ‘ఉరైనహ్’ ప్రాంతము నుండి కొంత మంది (మదీనా) వచ్చినారు. మదీనా వాతావరణం వారికి అనుకూలించనందు వలన వారు అనారోగ్యానికి గురయ్యారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి (అక్కడ ఉన్నన్ని దినాలు) పాలు ఇచ్చే ఒంటెలను ఇవ్వమని మరియు (వారి అనారోగ్యానికి మందుగా) వాటి మూత్రం మరియు పాలు త్రాగమని ఆదేశించినారు. వారు అక్కడి నుండి (ఒంటెలను ఉంచిన ప్రదేశానికి) వెళ్లిపోయారు. అక్కడ వారు కోలుకున్న తర్వాత, వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఒంటెల కాపరిని చంపి ఒంటెలను దోచుకుని వెళ్ళారు. ఆ వార్త తెల్లవారుజామున తెలిసింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని వెంబడించి పట్టుకు రావడానికి ప్రజలను పంపారు. సూర్యుడు ఉదయించినప్పుడు, వారిని తిరిగి తీసుకువచ్చారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చేతులు మరియు కాళ్ళు నరికివేయాలని, మరియు వారి కళ్ళపై వాతలు పెట్టాలని ఆదేశించారు. తరువాత వారు అల్-హర్రా అనే ప్రదేశములో విసిరివేయబడినారు. అక్కడ వారు నీటి కోసం అడుక్కున్నారు కానీ వారికి నీరు ఇవ్వబడలేదు. అబూ కిలాబా ఇలా అన్నారు: “వారు దొంగతనం చేశారు, చంపారు, విశ్వాసం స్వీకరించిన తర్వాత అవిశ్వాసులుగా మారినారు మరియు అల్లాహ్ మరియు ఆయన దూతపై యుద్ధం చేశారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగినారు: “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు అనారోగ్యం పాలైనారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అని బదులిచ్చినారు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా పలికినారు: “బిస్మిల్లాహి అర్’ఖీక, మిన్ కుల్లి షైఇన్ యు’జీక, మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ అవ్ ఐనిన్ హాసిదిన్, అల్లాహు యష్ఫీక, బిస్మిల్లాహి అర్’ఖీక” (అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను; మీకు హాని కలిగించే ప్రతి దాని నుండి, ప్రతి ఆత్మ యొక్క చెడు నుండి లేదా అసూయపడేవారి కంటి నుండి అల్లాహ్ మిమ్మల్ని స్వస్థపరచుగాక. అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను)”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“నీ శరీరంలో ఏభాగములోనైతే నొప్పి పెడుతున్నదో దానిపై నీ చెతిని ఉంచు, తరువాత “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామముతో) అని మూడుసార్లు పఠించు; తరువాత ఏడుసార్లు “అఊదుబిల్లాహి, వ ఖుద్రతిహి మిన్ షర్రిమా అజిదు వ ఉహాదిర్” అని పఠించు” (నేను అనుభవిస్తున్న మరియు భయపడుచున్న చెడు మరియు కీడు నుండి నేను అల్లాహ్ ద్వారా మరియు ఆయన శక్తి ద్వారా శరణు వేడుకుంటున్నాను) అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోగిని సందర్శించినప్పుడు, ఆయన ఇలా దువా చేసేవారు: "అద్-హిబిల్-బాస, రబ్బన్నాస్, వష్ఫి, అంత అష్షాఫీ, లా షిఫాఅ’ ఇల్లా షిఫాఉక, షిఫా’అన్ లా యుగాదిరు సఖమా." (ప్రజల ప్రభువా! బాధను తొలగించు. నీవే ఆరోగ్యదాతవు. నీ ఆరోగ్యమే నిజమైన ఆరోగ్యం. నీ ఆరోగ్యం తప్ప మరొకటి లేదు. అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు — అది ఎలాంటి వ్యాధినీ మిగల్చకుండా పూర్తిగా నయం చేసే ఆరోగ్యాన్ని ప్రసాదించు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను రేపు ఈ జెండాను, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదిస్తాడో, అతనికి ఇస్తాను. అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.” ఆయన (సహ్ల్ బిన్ సఅద్) ఇంకా ఇలా అన్నారు: “తమలో ఎవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జెండాను ఇవ్వబోతున్నారో” అని ప్రజలందరూ ఆ రాత్రంతా ఉత్సుకతతో అలాగే గడిపారు. ఉదయం అవుతూనే ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు, ప్రతి ఒక్కరూ ఆ జెండాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతికే ఇస్తారు అనే ఆశతో. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఎక్కడ?” అని అడిగారు. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! ఆయన కంటిలో ఏదో సమస్యతో బాధపడుతున్నాడు” అన్నారు. దానికి ఆయన “అయితే అతడిని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపండి” అన్నారు. అప్పుడు ఆయనను తీసుకువచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో ఉమ్మివేసి ఆయన కోసం ప్రార్థించారు. దానితో ఆయన అంతకు ముందు అసలు ఎప్పుడూ నొప్పి లేదు అన్నట్లుగా కోలుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారు మనలాగా (విశ్వాసులుగా) మారేంతవరకు పోరాడాలా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరు వారి ప్రాంగణానికి చేరుకునే వరకు స్థిరంగా వెళ్ళండి, ఆపై వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి మరియు అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి వారిపై ఏ ఏ విషయాలు విధి చేయబడినాయో వారికి తెలియజేయండి. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు