عربي - Arabic English Qafár af - Afar Afrikaans - Afrikanns Akan Shqip - Albanian አማርኛ - Amharic Հայերեն - Armenian অসমীয়া - Assamese Azərbaycanca - Azerbaijani Bamanankan - Bambara Bassa Bemba বাংলা - Bengali Bosanski - Bosnian Български - Bulgarian မြန်မာဘာသာ - Burmese Bisaya - Cebuano Cham Нохчий - Chechen chiCheŵa - Chewa 中文 - Chinese Адыгэбзэ - Circassian Hrvatski - Croatian Česky - Czech Dagbani Dansk - Danish فارسی دری - Dari Dendi ދިވެހި ބަސް - Dhivehi Nederlands - Dutch إستوني - Estonian Suomi - Finnish Français - French Fulfulde - Fula ქართული - Georgian Deutsch - German Ελληνικά - Greek ગુજરાતી - Gujrati Kreyòl ayisyen - Haitian Creole Hausa हिन्दी - Hindi Magyar - Hungarian Igbo Indonesia - Indonesian Italiano - Italian 日本語 - Japanese Jóola - Jola ಕನ್ನಡ - Kannada Қазақша - Kazakh ភាសាខ្មែរ - Khmer Kikuyu Ikinyarwanda - Kinyarwanda Ikirundi - Kirundi 한국어 - Korean كوردی سۆرانی - kurdish كوردي kurmancî - Kurmanji Kyrgyz ລາວ - Lao latviešu - Latvian Lingala lietuvių - Lithuanian Luganda Македонски - Macedonian Maguindanaon Malagasy - Malagasy Bahasa Melayu - Malay മലയാളം - Malayalam Mandinka मराठी - Marathi Mõõré - Moore नेपाली - Nepali أنكو - NKo Norwegian ଓଡ଼ିଆ - Odia oromoo - Oromo پښتو - Pashto فارسی - Persian Polski - Polish Portuguese ਪੰਜਾਬੀ - Punjabi Română - Romanian Русский - Russian Српски - Serbian Shona සිංහල - Sinhala Slovenščina - Slovenian Soomaaliga - Somali Soninke Sesotho - Sotho Español - Spanish Kiswahili - Swahili Svenska - Swedish Tagalog Тоҷикӣ - Tajik தமிழ் - Tamil తెలుగు - Telugu ไทย - Thai ትግረኛ - Tigrinya Türkçe - Turkish Ukrainian اردو - Urdu ئۇيغۇرچە - Uyghur Ўзбек - Uzbek Việt Nam - Vietnamese Wolof Yao Yorùbá - Yoruba Zarma زولو - Zulu
837 హదీసులు
ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం
వర్గాలు
హదీసు స్థాయి
ఉల్లేఖించిన గ్రంథం
ఉల్లేఖకుడు
“ఒక రోజు మా మధ్యన (కూర్చుని) ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడినారు. నిలబడి హితబోధ చేసినారు. ఆ హితబోధ మా హృదయాలను భయంతో కంపించేలా చేసింది, మా కళ్ళనుండి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. మాలో ఒకరు ఇలా అన్నారు: “మీరు చేసిన హితబోధ, శాశ్వతంగా విడిచి వెళ్ళబోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది. మా కొరకు ఏదైనా ప్రమాణాన్ని ఉపదేశించండి”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి; మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకుని ఉండండి. (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే.”
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“నిశ్చయంగా, అల్లాహ్‌ను మరియు అతని ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి నేను ఈ జెండా ఇస్తాను మరియు అల్లాహ్ అతని చేతుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు”. ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నాయకత్వం కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు, ఆ రోజు తప్ప”. ఆయన ఇంకా ఇలా అన్నారు: "(ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్నే పిలుస్తారు అనే ఆశతో) నేను దాని కోసం పిలువబడతాను అనే ఆశతో, వారి దృష్టిలో పడేలా నేను అటూ ఇటూ తిరుగసాగాను.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను పిలిపించి, ఆ జెండాను ఆయన చేతికి ఇచ్చి, ఇలా అన్నారు: “(ఓ అలీ!) ముందుకు సాగు, అల్లాహ్ నీకు విజయాన్ని ప్రసాదించే వరకు వెనుకకు చూడకు”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “అలీ ముందుకు కదిలాడు, కొద్ది దూరంలో ఆగి, వెనుకకు తిరగకుండా, గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్! నేను ఏ విషయంపై ఆ ప్రజలతో పోరాడాలి?”; దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప వెరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యమిచ్చే వరకు వారితో పోరాడు. వారు ఒకవేళ అలా చేసినట్లయితే వారి రక్తము మరియు సంపదలు నీ కొరకు ఉల్లంఘించరానివి (హరాం) అవుతాయి - షరియత్ ప్రకారం అలా చేయవలసి వస్తే తప్ప; మరియు వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"నేను మీకు అల్లాహ్ పట్ల భయభక్తులను కలిగి ఉండమని, మరియు ఒక బానిస మీపై నాయకుడిగా నియమించబడినప్పటికీ, అతడి మాట వినమని మరియు విధేయత చూపమని ఉపదేశిస్తున్నాను. నిశ్చయంగా, నా తర్వాత మీలో ఎవరైతే జీవిస్తారో, వారు అనేక విభేదాలను చూస్తారు. కాబట్టి, నా సంప్రదాయాన్ని (సున్నత్) మరియు సన్మార్గం పొందిన, సరైన మార్గంలో నడిచిన ఖలీఫాల సంప్రదాయాన్ని మీరు తప్పనిసరిగా అనుసరించండి. వాటిని మీరు కొర పళ్ళతో గట్టిగా పట్టుకోండి. మరియు (ఇస్లాం ధర్మంలో) నూతన కల్పితాల (బిద్అత్) పట్ల మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; ఎందుకంటే, (ఇస్లాం ధర్మంలో) ప్రతి నూతన కల్పితము (బిద్అత్) ఒక మార్గభ్రష్టత."
ప్రామాణికమైన హదీథు అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
అతడు నల్ల రాయి (కాబాగృహపు ఒక మూలలో ఉన్న హజ్రె అస్వద్) దగ్గరికి వచ్చి, దానిని ముద్దుపెట్టుకుని ఇలా అన్నాడు: "నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం కలిగించలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“తాను చనిపోవడానికి ఐదు రాత్రులకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు. ఒకవేళ నా సహచర సమాజం (ఉమ్మత్) నుండి నేను ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకోవాలని అనుకుంటే, నేను అబూబక్ర్ రజియల్లాహు అన్హును నా ఆప్త మిత్రునిగా చేసుకుని ఉండే వాడిని. తస్మాత్, జాగ్రత్త! మీకు పూర్వం గడిచిన తరాల వారు తమ ప్రవక్తల సమాధులను, మరియు సత్పురుషుల సమాధులను మస్జిదులుగా (సజ్దా చేసే స్థలాలుగా) చేసుకునేవారు. ఖబడ్దార్! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. నేను మిమ్ములను అలా చేయడం నుండి నిషేధిస్తున్నాను”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“అన్సారులను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అన్సారులను విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కపట విశ్వాసి తప్ప వారిని ఎవరూ ద్వేషించరు. వారిని (అన్సారులను) ఎవరైతే ప్రేమిస్తారో, అల్లాహ్ అతడిని ప్రేమిస్తాడు, మరియు ఎవరైతే వారిని ద్వేషిస్తాడో అల్లాహ్ అతడిని ద్వేషిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు ను గురించి (అతడు చాలా కాలంగా కనిపించకపోవడంతో) వాకబు చేసినారు. అక్కడ ఉన్న వారిలో ఒకతను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మీకొరకు అతడిని గురించి తెలుసుకుని వస్తాను” అని పలికి, అతని (సాబిత్ బిన్ ఖైస్) వద్దకు వెళ్ళాడు. సాబిత్ బిన్ ఖైస్ తన ఇంటిలో తలను క్రిందకు వేలాడదీసుకుని (విచారములో మునిగిపోయినట్లుగా) కూర్చుని ఉండుట గమనించి “విషయం ఏమిటి” అని అడిగాడు. దానికి అతడు “కీడు” అన్నాడు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షములో వారి స్వరానికి మించి పై స్థాయిలో మాట్లాడేవాడు. కనుక తన సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, వ్యర్థమై పోయాయి, తానింక నరకవాసులలోని వాడై పోయాడు (అని బాధపడసాగినాడు). ఆ వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళి ‘అతడు ఇలా ఇలా అన్నాడు’ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారమిచ్చినాడు. తర్వాత ఆ వ్యక్తి సాబిత్ వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అమోఘమైన శుభవార్తతో తిరిగి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “అతని వద్దకు వెళ్ళు, వెళ్ళి ‘నీవు నరకవాసులలోని వాడవు కావు, నీవు స్వర్గవాసులలోని వాడవు” అని అతనికి చెప్పు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"మీలో ఉత్తములు నా తరం వారు (సహాబాలు), తర్వాత వారిని అనుసరించే వారు (తాబియీన్), తర్వాత వారిని అనుసరించే వారు (అతబ్బ తాబియీన్)." ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు తరాలను గురించి చెప్పారా లేక మూడు తరాలను గురించి చెప్పారా అనే విషయం నాకు స్పష్టంగా గుర్తు లేదు." ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మీ తర్వాత కొంతమంది ప్రజలు వస్తారు – వారు విశ్వసిస్తారు, కానీ నమ్మదగినవారు కారు; వారు సాక్ష్యం చెబుతారు, కానీ వారిని సాక్షిగా అడగరు; వారు ప్రతిజ్ఞ చేస్తారు, కానీ నెరవేర్చరు; వారి మధ్య మోటుదనం (అధిక బరువు/సుఖ జీవనం) విస్తరించి, లావుగా ఉంటారు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు