Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 4 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది.” (తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:) “(నమాజులో) దాసుడు “అల్-హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను కీర్తించినాడు”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు”; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “నా దాసుడు నన్ను మహిమ పరిచినాడు”; ఆయన ఇంకా ఇలా అంటాడు: “నా దాసుడు తన వ్యవహారాలన్నింటినీ నాకు అప్పగించినాడు”; దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, ఆయన “ఇది నాకు, నా దాసునికి మధ్య నున్న విషయం, నా దాసుడు తాను అర్థించిన దానిని పొందుతాడు” అంటాడు, దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “ఇది నా దాసుని కొరకు; నాదాసునికి అతడు అర్థించినది ప్రసాదించబడుతుంది.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను పారిపోతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు. అయితే, అది ఎటువంటి సమయమంటే – ‘పూర్వం విశ్వసించకుండా, ఆరోజున విశ్వసించిన వ్యక్తికీ లేదా విశ్వసించి కూడా ఏ పుణ్యాన్నీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు’ (సూరహ్ అల్ అన్’ఆమ్ 6:158). ప్రళయ ఘడియ స్థాపించ బడినపుడు, (అది ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే), (కూర్చోవడానికి) తమ మధ్య ఒక వస్త్రాన్ని పరుచుకుంటున్న ఇద్దరు వ్యక్తులు దానిని పూర్తిగా పరచలేరు, మరియు దానిని మడత పెట్టనూ లేరు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, త్రాగడానికి చేతిలో ఒంటె పాల గ్లాసును పట్టుకుని ఉన్న వ్యక్తి దానిని త్రాగలేడు, తన పశువులు నీరు త్రాగడానికి గుంటను త్రవ్వుతున్న వ్యక్తి దానిని పూర్తి చేయలేడు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, మీలో ఒకరి చేతిలో ఉన్న అన్నం ముద్ద నోటి వరకూ కూడా చేరదు (అంత హఠాత్తుగా వచ్చి పడుతుంది అని అర్థం).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఆకాశాలలో, భూమిపై ఉన్న సమస్తమూ అల్లాహ్ దే. మీరు మీ మనస్సులలో ఉన్న విషయాలను వెల్లడి చేసినా లేక దాచినా, వాటి గురించి అల్లాహ్ మీతో లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై సర్వశక్తిమంతుడు" [అల్ బఖరహ్ 2:284] అన్న ఖుర్ఆన్ వచనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు అది భారంగా తోచింది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి తమ మోకాళ్ళపై కూర్చొని, “ఓ రసూలుల్లాహ్! మాలో నిర్వర్తించగల శక్తి ఉన్న ఆచరణలే మాపై మోపబడ్డాయి: నమాజ్, ఉపవాసాలు, జిహాద్ మరియు దానధర్మాలు. కాని ఇప్పుడు మీపై ఈ ఆయతు అవతరించింది. దీనిని భరించే శక్తి మాలో లేదు” అని విన్నవించుకున్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «మీకు పూర్వం గ్రంథప్రజలు (యూదులు, క్రైస్తవులు) "మేము విన్నాము కాని అంగీకరించట్లేదు" అన్నట్లుగా మీరు కూడా అలాగే జవాబు చెబుదామని అనుకుంటున్నారా ఏమిటి? కాదు, మీరు ఇలా చెప్పండి: 'మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము'». వారు అన్నారు: "మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము". ప్రజలు ఆ వచనాలను పలుకగా, వారి నాలుకలు వాటితో పలచబడిన తరువాత, అల్లాహ్ దాని వెనుకే ఈ ఆయతును అవతరింపజేశాడు: {ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను అనుసరించే వారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారు: మేము ఆయన ప్రవక్తలలో ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాం. శిరసా వహించాం. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవైపునకే మరలి వస్తాము} [అల్ బఖరహ్ 2:285]. వారు అలా చేయగానే, అల్లాహ్ దానిని రద్దుపరచి, ఈ ఆయతును అవతరింపజేశాడు: {ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తిసామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్నీ, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్నీ ప్రతి వ్యక్తీ అనుభవిస్తాడు. ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టుకోకు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {ప్రభూ! మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు!} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {ప్రభూ! ఏ బరువును మోసే శక్తి మాలో లేదో, దానిని మాపై మోపకు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మమ్మల్ని క్షమించు. మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా నీవు మాకు సహాయపడు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: