Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 19 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము'హ మ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్‌కమాత్‌) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్‌) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు: ''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “(ఆ ఆయతును పఠించిన) తరువాత ఆయన ఇలా అన్నారు: “ కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్‌) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఎవరైతే సూరతుల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులను (వచనాలను) కంఠస్థం చేస్తారో, వారు దజ్జాల్ ఫిత్నా నుండి రక్షించబడతారు." మరొక రివాయతులో "సూరతుల్ కహఫ్ యొక్క చివరి పది ఆయతులు." అని ఉంది.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ఒక యూదుడు ఆయనతో (ఉమర్ రదియల్లాహు అన్హుతో) ఇలా అన్నాడు: 'ఓ అమీరుల్ మూమినీన్, మీ గ్రంథంలో ఒక ఆయతు (వచనం) ఉంది, దానిని మీరు పఠిస్తారు. ఒకవేళ అది మా యూదుల సమాజంపై అవతరించి ఉంటే, మేము ఆ రోజును పండుగగా చేసుకుని ఉండేవారం.' దానికి ఉమర్ (రదియల్లాహు అన్హు) అడిగారు: 'ఏ ఆయతు (వచనం)?' దానికి అతను ఇలా అన్నాడు: {ఈ రోజు నేను మీ కోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు ఇస్లాంను ధర్మంగా ఇష్టపడ్డాను} [అల్-మాయిదా 5:3]. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: 'నిశ్చయంగా ఆ రోజు మరియు అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన ప్రదేశం మాకు తెలుసు. అది శుక్రవారం రోజున అరఫాతు మైదానంలో ఆయన నిలబడి ఉన్నప్పుడు అవతరించింది.'
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది.” (తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:) “(నమాజులో) దాసుడు “అల్-హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను కీర్తించినాడు”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు”; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “నా దాసుడు నన్ను మహిమ పరిచినాడు”; ఆయన ఇంకా ఇలా అంటాడు: “నా దాసుడు తన వ్యవహారాలన్నింటినీ నాకు అప్పగించినాడు”; దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, ఆయన “ఇది నాకు, నా దాసునికి మధ్య నున్న విషయం, నా దాసుడు తాను అర్థించిన దానిని పొందుతాడు” అంటాడు, దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “ఇది నా దాసుని కొరకు; నాదాసునికి అతడు అర్థించినది ప్రసాదించబడుతుంది.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నపుడు పైన ‘కిర్రు’ మనే శబ్దం విన్నారు. ఆయన తన తలపైకి ఎత్తి చూసి, ఇలా అన్నారు: “ఇది స్వర్గములోని ఒక ద్వారము; అది ఈ రోజు తెరుచుకున్నది, ఈ రోజు తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ ఆ ద్వారము తెరువబడలేదు”; ఆ ద్వారము నుండి ఒక దైవదూత దిగి వచ్చినాడు. ఆయన (జిబ్రీల్) ఇలా అన్నారు: “ఆయన దైవదూత, ఆ దైవదూత ఈ రోజే భూమిపై దిగివచ్చినాడు, ఈ దినము తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ అతడు భూమి మీదకు రాలేదు. అతడు (ఆ దైవదూత) సలాం చేసి ఇలా అన్నాడు: “మీకు ప్రసాదించబడుతున్న రెండు కాంతి పుంజముల శుభవార్తను స్వీకరించండి; మీకు ముందు ఏ సందేశహరునికీ ఇవి ఇవ్వబడలేదు: ‘ఫాతిహతుల్ కితాబ్’ (సూరహ్ ఫాతిహా), మరియు సూరహ్ అల్ బఖరహ్ యొక్క చివరి ఆయతులు. దాని నుండి మీరు ఒక్క అక్షరం పఠించినా అది (దాని ప్రతిఫలం) మీకు ఇవ్వబడుతుంది.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను పారిపోతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఆనాటి బహుదైవారాధకులలో ఎన్నో హత్యలు, మరెన్నో మానభంగాలకు పాల్బడిన, ఒక సమూహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా పలికినారు: “నిశ్చయంగా నీవు ఏమి చెబుతున్నావో అదీ, మరియు దేని వైపునకు ఆహ్వానిస్తున్నావో ఆ విషయమూ ఉత్తమమైనవి. మరి నిశ్చయంగా మేము చేసిన దానికి పరిహారము ఏమైనా ఉన్నదని నీవు మాకు తెలుప గలవా?” అపుడు (ఈ ఆయతు) అవతరించినది: “మరియు ఎవరైతే, అల్లాహ్‌తోపాటు ఇతర దైవాలను ఆరాధించరో, మరియు అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో, మరియు వ్యభిచారానికి పాల్పడరో. మరియు ఈ విధంగా చేసేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. (సూరహ్ అల్ ఫుర్ఖాన్ 25:68). మరియు ఈ ఆయతు అవతరించినది: "ఇలా ప్రకటించు: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన, కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత." (సూరహ్ అజ్-జుమర్ 39:53)
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు. అయితే, అది ఎటువంటి సమయమంటే – ‘పూర్వం విశ్వసించకుండా, ఆరోజున విశ్వసించిన వ్యక్తికీ లేదా విశ్వసించి కూడా ఏ పుణ్యాన్నీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు’ (సూరహ్ అల్ అన్’ఆమ్ 6:158). ప్రళయ ఘడియ స్థాపించ బడినపుడు, (అది ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే), (కూర్చోవడానికి) తమ మధ్య ఒక వస్త్రాన్ని పరుచుకుంటున్న ఇద్దరు వ్యక్తులు దానిని పూర్తిగా పరచలేరు, మరియు దానిని మడత పెట్టనూ లేరు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, త్రాగడానికి చేతిలో ఒంటె పాల గ్లాసును పట్టుకుని ఉన్న వ్యక్తి దానిని త్రాగలేడు, తన పశువులు నీరు త్రాగడానికి గుంటను త్రవ్వుతున్న వ్యక్తి దానిని పూర్తి చేయలేడు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, మీలో ఒకరి చేతిలో ఉన్న అన్నం ముద్ద నోటి వరకూ కూడా చేరదు (అంత హఠాత్తుగా వచ్చి పడుతుంది అని అర్థం).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు