ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం సగం కాలిపిక్క వరకు ఉండాలి. ఒకవేళ అతడి కాలిపిక్కకు మరియు చీలమండలానికి మధ్య భాగంలో ఉంటే అందులో దోషం ఏమీ లేదు. కానీ చీలమండలానికి దిగువన ఉంటే (నేలపై ఈడుస్తూ ఉంటే), అది నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరు గర్వంతో తన లుంగీని లేదా ప్యాంటును (గర్వంతో నేలపై) ఈడుస్తారో, అల్లాహ్ అతని వైపు చూడడు
అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం సగం కాలిపిక్క వరకు ఉండాలి. ఒకవేళ అతడి కాలిపిక్కకు మరియు చీలమండలానికి మధ్య భాగంలో ఉంటే అందులో దోషం ఏమీ లేదు. కానీ చీలమండలానికి దిగువన ఉంటే (నేలపై ఈడుస్తూ ఉంటే), అది నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరు గర్వంతో తన లుంగీని లేదా ప్యాంటును (గర్వంతో నేలపై) ఈడుస్తారో, అల్లాహ్ అతని వైపు చూడడు.
«إزْرَةُ المُسْلمِ إلى نصفِ السَّاق، وَلَا حَرَجَ -أو لا جُنَاحَ- فيما بينَهُ وبينَ الكعبينِ، وما كان أسفلَ منَ الكعبين فهو في النار، مَن جرَّ إزارَهُ بطرًا لم يَنْظُرِ اللهُ إليه».
ప్రవక్త ముహమ్మద్ ﷺ ఒక ముస్లిం పురుషుడు తాను ధరించే ఇజార్ (అంటే, నడుము క్రింది భాగాన్ని కప్పే వస్త్రం) కు సంబంధించిన మూడు స్థితులను స్పష్టంగా వివరించారు: మొదటిది: ఇజార్‌ను కాలిపిక్కల మధ్య వరకు ధరించడం ఉత్తమం; అయితే అది కాలిమడమల కంటే దిగువకు జారకూడదు. రెండవది: అనుమతించదగినది (అయితే అహంకారంతో కాకూడదు) - అది కాలిమడమ ఎముక వరకు ఉండే పొడువైన ఇజార్. మూడవది: నిషేధించబడిన స్థాయి - అంటే ఇజార్ వస్త్రం కాలిమడమ (చీలమండలం) కంటే దిగువన జారి, నేలను తాకుతూ ఉండటం. ఇటువంటి వ్యక్తి నరక అగ్నికి భయపడాలి. మరియు ఎవరైతే గర్వంతో, దురహంకారంతో ఇలా చేస్తారో, అల్లాహ్ ప్రళయ దినాన అతని వైపు చూడడు.
ఈ నియమాలు మరియు హెచ్చరికలు ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే వర్తిస్తాయి. మహిళలు ఈ నిబంధన నుండి మినహాయింపబడ్డారు, ఎందుకంటే వారి కొరకు తమ మొత్తం శరీరాన్ని కప్పి ఉంచాలనే ఆదేశం నిర్దేశించబడింది.
పురుషులు నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రాన్ని 'ఇజార్' అంటారు, ఉదాహరణకు ప్యాంటు, లుంగీ, థోబు మొదలైనవి. ఇది ఈ హదీథు ద్వారా ఇస్లామీయ షరిఅహ్ ధర్మశాసనంలో చేర్చబడింది.
సునన్ అబీదావూద్ (6/ 191) (4093).
సునన్ ఇబ్న్ మాజహ్ (4/ 583) (3573).
ముస్నద్ అహ్మద్ (17/ 52) (11010).
(1/ 16).
ఇంకా (7)
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (1/ 637).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 95).
كنوز رياض الصالحين.
لمجموعة من الباحثين (10/ 582).
المعجم الوسيط.
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
2 గ్రంథాలుఇంకా (2)
- قاموس الكبائرموسوعة الكبائر - المجموعة الخامسة«إِزْرَةُ الْمُسْلِمِ إِلَى نِصْفِ السَّاقِ وَلَا حَرَجَ فِيمَا بَيْنَهُ وَبَيْنَ الْكَعْبَيْنِ، وَمَا كَانَ أَسْفَلَ مِنَ الْكَعْبَيْنِ فَهُوَ فِي النَّارِ، مَنْ جَرَّ إِزَارَهُ بَطَرًا (أَيْ: تَكَبُّرًا) لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ»
- مجموعة زاد السيرة النبوية (2)1«إزرة المسلم إلى نصف الساق، ولا حرج -أو لا جناح- فيما بينه وبين الكعبين، وما كان أسفل من الكعبين فهو في النار».