آداب السفر وأحكامه
ప్రయాణించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు మరియు దాని ఆదేశాలు స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
ప్రయాణించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు మరియు దాని ఆదేశాలు స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
అమ్మా బాద్:
ఇది ప్రయాణ పద్దతులు మరియు దాని ఆదేశాల గురించి సంక్షిప్తంగా రూపొందించిన ఒక సందేశం. ఇందులో, ప్రయాణికునికి అవసరమైన ప్రధాన విషయాలను వివరంగా వివరించేందుకు మేము ఆసక్తిగా ఉన్నాము.
మరియు మేము అల్లాహ్ ను దానిని మహోన్నతుడైన ఆయన మన్నత కొరకు ప్రత్యేకించమని మరియు ముస్లింలందరికీ ప్రయోజనం చేకూర్చమని మేము అర్ధిస్తున్నాము.
"ఇస్లామీయ విషయాలను వివిధ భాషలలో అందించే సంస్ధ లోని జ్ఞాన కమిటీ"
మొదటిది: ప్రయాణించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు
హజ్ లేదా ఇతర ఆరాధనల కోసం ప్రయాణించే వారు కింది విషయాలలో శ్రద్ధ వహించాలి:
1. అల్లాహ్ సుబ్ హానహూ తఆలాను సమయంపై, ప్రయాణ సాధనంపై, సహచరుడిపై, మార్గంపై (మార్గాలు చాలా ఉంటే) ఇస్తిఖారా చేయాలి. ఇందులో అనుభవం మరియు నీతిమంతులైన వారిని సంప్రదించాలి. అయితే హజ్ మరియు ఉమ్రా అనేవి నిస్సందేహంగా మంచివే. ఇస్తిఖారా విధానం ఏమిటంటే: రెండు రకాతులు నమాజు చదివి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన దుఆతో ప్రార్థించాలి.
2. హజ్ మరియు ఉమ్రా చేసే వ్యక్తి, తన హజ్ మరియు ఉమ్రాను అల్లాహ్ తఆలాకు మాత్రమే అంకితం చేయాలి, ఆయన సామీప్యం పొందే ఉద్దేశం ఉండాలి. ప్రపంచ సంపదను పొందడం, గర్వం, పదవులు పొందడం, ప్రదర్శన చేయడం లేదా కీర్తి కోసం చేయడం నుండి జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవన్నీ ఆ మేల్కార్యాన్ని నిష్ఫలమయ్యేలా చేసి, అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం కాకుండా చేస్తాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: (ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడనే! నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేయబడింది. నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు. [కహఫ్: 110] మరియు హదీసు ఖుద్సీలో ఇలా ఉంది: మీరు చేస్తున్న భాగస్వాముల (షిర్కు) నుండి నేను నిరుపేక్షాపరున్నీ, ఒక కార్యం చేసి దాంట్లో ఎవరైన నాకు భాగస్వామ్యపరిచినట్లైతే 'నేను అతన్నిమరియు అతను చేస్తున్న షిర్కును(భాగస్వామ్యులను)'వదిలేస్తాను [1]. [1] దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (2985)
3. హజ్ మరియు ఉమ్రా చేసే వ్యక్తి, అలాగే ప్రయాణించే ముందు, ఉమ్రా మరియు హజ్ సంబంధిత విధులు, నిషేదితాలు మరియు ప్రయాణ నిబంధనలను అధ్యాయనం చేయాలి. తద్వారా, అనవసరంగా ఏవైనా తప్పులు చేయకుండా, ఏవైనా తప్పనిసరి విధులను వదులుకోకుండా జాగ్రత్త పడగలుగుతాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధర్మం విషయంలో అవగాహనను ప్రసాదిస్తాడు. [2] [2] దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (3116) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (100).
4. హజ్ లేదా ఉమ్రా చేయువాడు తన హజ్ మరియు ఉమ్రా కోసం హలాల్ సంపాదన నుంచే ఖర్చు చేయాలి. ఎందుకంటే అల్లాహ్ పవిత్రుడు; ఆయన పవిత్రమైనదే స్వీకరిస్తాడు. అదనంగా, హరామ్ సంపాదన కారణంగా దుఆ స్వీకరించబడదు.
5. అన్ని పాపాలు మరియు దోషాల నుండి తౌబా చేయాలి. ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే, అది తిరిగి ఇచ్చి వారిని దాని నుండి విముక్తి కలిగించాలి. అది గౌరవానికి సంబంధించిందైనా, ఆస్తి సంపత్తికి సంబంధించిందైనా లేదా మరేదైనా అయినా.
6. ప్రయాణికుడు తన వసియ్యత్ (ఉత్తరాధికారపు సూచనలు) మరియు తనకు ఉన్న హక్కులు, బాధ్యతలను లిఖితపూర్వకంగా తయారు చేసుకోవడం ముస్తహబ్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఏ ముస్లిం కు కూడా హక్కులేదు అతని వద్ద వసియ్యత్ చేసే వస్తువు మూడు రాత్రులకు మించి ఉండరాదు ఉంటే అతనివద్ద వ్రాసిపెట్టి ఉండాలి [3] దానికి సాక్షులను ఉంచాలి, తనపై ఉన్న అప్పులను తీర్చాలి, మరియు తన వద్ద ఉన్న అప్పగింత (అమానతులను) వాటి యజమానులకు తిరిగి ఇచ్చేయాలి లేదా అవి తన వద్ద ఉండేందుకు వారి అనుమతి పొందాలి. [3] దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (2738) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (1627).
7. ప్రయాణీకుడు మంచి వ్యక్తిని తోడుగా ఎంచుకోవడానికి కృషి చేయాలి, ముఖ్యంగా షరీయతు జ్ఞానం కలిగినవారి నుంచి ఉండేలా చూసుకోవాలి; ఎందుకంటే ఇది అతని విజయానికి మరియు ప్రయాణంలో, హజ్జ్, ఉమ్రాలో తప్పులకు గురి కాకుండ ఉండటానికి కారణమవుతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”[4] దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నువ్వు విశ్వాసిని మాత్రమే స్నేహితుడిగా చేసుకో, మరియు నీ ఆహారం భక్తిపరుడే తినాలి."[5] [4] దీన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు. హదీసు సంఖ్య (4833). [5] దీనిని అబూదావూద్ హదీసు సంఖ్య (4832) మరియు తిర్మిజీ హదీసు సంఖ్య (2395) ఉల్లేఖించారు
8. ప్రయాణీకుడు తన కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారు, స్నేహితులను వీడుకోలు చెప్పడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఎవరైనా ప్రయాణం చేసేందుకు సిద్ధమైతే, తన వెనుక వదిలి వెళుతున్న వారికి ఇలా చెప్పాలి: నేను నీకు అల్లాహ్ కు అప్పగించుచున్నాను, ఆయనకు అప్పగించినది ఏదీ వృధాగా పోదు» (అస్తౌదిఉకుము ల్లాహ ల్లజీ లా యుజీఉ వదాఇహు)[6] ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన సహచరులలో ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వారికి వీడ్కోలు పలుకుతూ ఇలా అనేవారు: నేను నీ ధర్మాన్ని,నీ అప్పగింతను,నీ ఆఖరి కర్మనూ అల్లాహ్ కు అప్పగించుచున్నాను. [7] ఎవరైనా ప్రయాణానికి వెళ్లేటప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను సలహా ఇవ్వమని అభ్యర్థిస్తే, ఆయన ఇలా చెప్పేవారు: అల్లాహ్ నీకు భయ భక్తుల భండారాన్ని ప్రసాదించు గాక, నీ పాపములను క్షమించుగాక, నీవు ఎక్కడ ఉన్నా నీ కొరకు పుణ్యకార్యములను సులుభతరం చేయుగాక! [8]. ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ప్రయాణం చేయాలని ఉద్దేశించి, “ఓ అల్లాహ్ ప్రవక్తా! నాకు ఒక సలహా ఇవ్వండి” అని అడిగాడు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ’ నీవు అల్లాహ్-భీతి ని విధిగా కలిగియుండమని, ఎత్తైన ప్రతీప్రదేశంలో అల్లాహు అక్బర్ ను స్మరించమని’ నీకు సలహా ఇస్తున్నాను. ’ఆ వ్యక్తి మరలిపోయాక ప్రవక్త’ అల్లాహుమ్మజ్వి లహుల్ అర్జ’ వ హవ్విన్ అలైహిస్సఫర’(ఓ అల్లాహ్ ఇతని కోసం ప్రయాణదురాన్ని చుట్టేసి తగ్గించు, అతని ప్రయాణాన్ని తేలికపరుచు) అని దుఆ చేశారు. [9] దీనిని తబ్రానీ హదీసు సంఖ్య (823) ఉల్లేఖించారు. [7] దీనిని అహ్మద్ తన ముస్నద్ లో హదీసుసంఖ్య (4524) ఉల్లేఖించారు. [8] దీనిని తిర్మిజీ హదీసు సంఖ్య ఉల్లేఖించారు (3444). [9] దీనిని అహ్మద్ తన ముస్నద్ లో హదీసుసంఖ్య (9724) ఉల్లేఖించారు.
9. ప్రయాణంలో గంటలు, వాయిద్యపరికరాలు (మిజామీర్) మరియు కుక్కను వెంట తీసుకెళ్లరాదు. అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మరియు (తమ జంతువుల మెడలో) గంట కలిగిన ఉన్న ప్రయాణీకుల సమూహాన్ని దైవదూతలు అనుసరించరు» [10]. [10] దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (2113)
10. తనకు ఒకటి కంటే ఎక్కువ భార్యలు ఉంటే, ప్రయాణానికి ముందు వారిలో ఎవరు తనతో వెళ్లాలో నిర్ణయించేందుకు ఖురా వేయాలి. ఖురాలో ఎవరి పేరు వస్తే, ఆ భార్యను వెంట తీసుకెళ్లాలి. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం: ఆమె ఇలా పలికారు: «మహనీయ దైవప్రవక్త ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తమ భార్యల మద్య చీటీలు వేసేవారు ఎవరి పేరు వస్తే వారిని తమతోపాటు తీసుకువెళ్ళేవారు» [11]. [11] దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (2593) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (2770).
11. తనకు అవకాశం ఉంటే, గురువారం ఉదయం ప్రయాణానికి బయల్దేరడం మంచిది. ఎందుకంటే ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క చర్యకు విధానంగా ఉంది. కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా పలికారు: «దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైన ప్రయాణమునకు బయలుదేరినప్పుడు గురువారం తప్ప ఇతర దినములలో చాలా అరుదుగా బయలుదేరేవారు.» [12]. [12] దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (2949)
12. తను ప్రయాణం కోసం గానీ, వేరే అవసరానికి గానీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు, ఇంటి నుండి బయలుదేరే దుఆ చెప్పడం ముస్తహబ్ (అభిలషణీయం). కాబట్టి అతను బయటకు బయలుదేరినప్పుడు ఇలా చెప్పాలి: బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహి, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహుమ్మా ఇన్నీ అ'ఉదు బిక అన్ అదిల్ల అవ్ ఉదల్ల; అవ్ అజిల్ల, అవ్ ఉజల్ల, అవ్ అజ్'లిమ అవ్ ఉజ్'లమ; అవ్ అజ్'హల అవ్ ఉజ'హల అలయ్య" (అల్లాహ్ పేరుతో, నేను అల్లాహ్ పైనే ఆధారపడతాను మరియు అల్లాహ్ లో తప్ప మరో దానిలో ఏ శక్తీ లేదా బలమూ లేదు. ఓ అల్లాహ్! నేను తప్పుదారి పట్టడం నుండి లేదా నన్ను ఎవరైనా తప్పుదారి పట్టించడం నుండి, నేను ఎవరినైనా అవమానించడం నుండి లేదా నన్ను ఎవరైనా అవమానించడం నుండి నేను ఎవరిపైనైనా దౌర్జన్యం చేయడం నుండి లేదా నాపై ఎవరైనా దౌర్జన్యం చేయడం నుండి, నేను అజ్ఞానంతో వ్యవహరించడం నుండి మరియు నాపై ఎవరైనా అజ్ఞానంతో వ్యవహరించడం నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.) [13]. [13] దీన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు. హదీసు సంఖ్య (5094).
13. అతను తన పశువుపై గాని, లేదా తన కారులో గాని, లేదా విమానంలో గాని, లేదా ఇతర ప్రయాణ వాహనాలలో గాని ఎక్కినప్పుడు, ప్రయాణ దుఆ చదవడం ముస్తహబ్. కాబట్టి అతను ఇలా పలకాలి: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, సుబహానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లముంఖలిబూన్. [జుఖ్రుఫ్: 14] అల్లాహుమ్మ ఇన్నా నస్'అలుక ఫీ సఫరినా హాదా అల్'బిర్ర వత్తఖ్'వా వ మినల్ అమలి మా తర్'దా, అల్లాహుమ్మ హవ్నిన్ అలైనా సఫరనా హాదా, వ త్విఅన్నా బుఅదహ్, అల్లాహుమ్మ అంత స్సాహిబు ఫీ స్సఫర్, వ ల్ఖలీఫతు ఫీల్ అహల్, అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ వాసాయిస్'సఫర్, వ క'ఆబతిల్ మంజర్, వ సూఇల్ ముంఖలలబ్ ఫిల్ మాలి వల్ అహల్. [14] "వఅసాయిస్-సఫర్" అంటే: ప్రయాణపు కఠినత. (మూలం: "అల్ ఇఫ్సాహు అన్మాానీస్-సహాహ్" 4/284) [15] "సూఉల్-హైఅతి వల్-ఇన్‌కిసార్మనల్-హుజ్న్" అంటే: చాలా చెడ్డ రూపం మరియు దుఃఖంతో మానసికంగా విచారంగా ఉండటం. (మూలం: "అల్ ఇఫ్సాహ్ అన్మాానీ అస్-సహాహ్" 4/284) [16] "(అల్-మున్కలిబ్)" అంటే: తిరిగి వెళ్ళడం లేదా పయనమై తిరిగి రావడం. (మూలం: "అల్ ఇఫ్సాహ్ అన్మాానీ అస్-సహాహ్" 4/284) [17] దీనిని అహ్మద్ తన ముస్నద్ లో హదీసుసంఖ్య (6374) ఉల్లేఖించారు.
14. " ప్రయాణికుడు తనకు తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయకూడదు". ఎందుకంటే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «ఒంటరిగా ప్రయాణం చేయటం వల్ల కలిగే నష్టమేమిటో నాకు తెలిసినట్టుగా ప్రజలకు తెలిస్తే వారిలో ఏ రౌతూ రాత్రిపూట ఒంటరిగా ప్రయాణానికి సిద్ధపడడు» [18]. [18] దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (2998)
15. ప్రయాణికులు తమలో ఒకరిని నాయకుడిగా నియమించుకోవాలి; ఎందుకంటే అది వారిని ఐక్యంగా ఉంచుతుంది, వారిలో ఏకాభిప్రాయాన్ని పెంపొందిస్తుంది, మరియు వారి లక్ష్యాన్ని సాధించడంలో బలాన్ని ఇస్తుంది. దైవప్రవక్త ﷺ సెలవిచ్చారు: «ముగ్గురు ప్రయాణానికని బయల్దేరినప్పుడు అందులో ఒకరిని వారు (నాయకునిగా) అమీర్ గా నిర్దారించుకోవాలి » [19]. [19] దీన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు. హదీసు సంఖ్య (2608).
16. అల్లాహ్ విధించిన కర్తవ్యాలను నెరవేర్చడానికి, నిషిద్ధమైన వాటి నుండి దూరంగా ఉండటానికి మరియు శ్రేష్ఠమైన నైతిక గుణాలను అలవర్చుకోవడానికి ప్రయాణికుడు శ్రద్ధ వహించాలి. సహాయానికి అవసరమైనవారికి తోడుగా ఉండాలి, జ్ఞానాన్ని కోరుకునేవారికి పంచాలి, మరియు తన సంపదను తన ప్రయోజనాలు మరియు సహోదరుల ప్రయోజనాలకు, అవసరాలకు ఉదారంగా ఖర్చు చేయాలి.
17. అతడు ఖర్చులను మరియు ప్రయాణ అవసరాలను విస్తారంగా సిద్ధం చేసుకోవాలి, ఎందుకంటే ప్రయాణంలో అవసరాలు తలెత్తవచ్చు మరియు పరిస్థితులు మారిపోవచ్చు.
18. అతడు ప్రతి విషయంలోనూ ప్రసన్నమైన ముఖంతో, సంతోషమైన మనస్తత్వంతో ఉండాలి మరియు తన సహచరులకు ఆనందాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి, తద్వారా అతడు ప్రేమించదగినవాడిగా మరియు అందరికీ ఆప్తుడిగా ఉంటాడు.
19. తన సహప్రయాణికుల నుండి ఏదైనా కఠినతనం, లేదా తన అభిప్రాయానికి విరుద్ధంగా వారు ప్రవర్తించినా, అతను సహనంతో ఉండాలి. వారిని ఉత్తమమైన రీతిలో సమాధానమివ్వాలి. దాంతో అతను వారి మధ్య గౌరవనీయుడిగా ఉంటాడు, వారి హృదయాలలో మహత్తర స్థానం పొందుతాడు.
20. ప్రయాణికులు ఒక చోట దిగినప్పుడు, కొందరు మరికొందరితో కలిసేలా ఉండటం మంచి విశేషమైనది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో కొందరు ఒక చోట దిగినప్పుడు, వారు లోయలు మరియు పర్వత మార్గాలలో చెదరిపోయేవారు. అప్పడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «నిశ్చయంగా మీరు ఈ విధంగా కొండదిబ్బల్లో మరియు లోయల్లో వేర్వేరుగా వ్యాపించడమనేది షైతాన్ నుండి సంభవిస్తుంది» [20]، అందువల్ల, వారు తరువాత పరస్పరం సమీపంగా ఉండేవారు, చివరకు ఒక వస్త్రాన్ని వారి మీద పరచినట్లయితే, అది వారిని పూర్తిగా కప్పగలిగేది. [20] దీనిని అహ్మద్ తన ముస్నద్ లో హదీసుసంఖ్య (17736) ఉల్లేఖించారు.
21. ప్రయాణంలో లేదా వేరే ఎక్కడైనా ఒక చోట దిగినప్పుడు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి రూఢీ అయిన ఈ దుఆ చేయడం మంచిది: అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్షర్రి మా ఖలఖ్ (సృష్టించబడిన సమస్త చెడుల నుండి నేను అల్లాహ్ యొక్క సంపూర్ణ వాక్కుల ద్వారా శరణు కోరుచున్నాను.)[21] ఎవరైనా ఈ దుఆ చేసినట్లైతే, ఆ స్థలం నుంచి వెళ్లే వరకు అతనికి ఏ వస్తువు హాని కలిగించదు. [21] దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (2708).
22. ఎత్తైన ప్రాంతాలకు చేరినప్పుడు తక్బీర్(అల్లారు అక్బర్) పలకటం మరియు దిగువ ప్రాంతాలు, లోతుగల ప్రదేశాలు చేరినప్పుడు తస్బీహ్(సుబహానల్లాహ్) పలకటం అతని కొరకు ఇష్టప్రాయమైనది. జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: మేము ఎత్తుకెక్కేటప్పుడు (తక్బీర్) అల్లాహు అక్బర్, దిగేటప్పుడు (తస్బీహ్) సుబ్హానల్లాహ్ స్మరించేవారము. [22] మరియు వారు తక్బీర్‌లో స్వరం బిగ్గరగా పలికేవారు కాదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «ఓ ప్రజలారా !మీ ప్రాణాలపై దయచూపండి,మీరు చెవుడు మరియు లేని ప్రభువును పిలవడం లేదు నిశ్చయంగా ఆయన మీతో పాటు ఉన్నాడు, ఆయన వినేవాడు మరియు మీకు చాలా సమీపంలో ఉన్నాడు» [23]. [22] దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (2994). [23] దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (2993)
23. అతనికి రాత్రి సమయంలో, ముఖ్యంగా రాత్రి ప్రారంభంలో ప్రయాణం చేయడం ఇష్టప్రాయమైనది; ఎందుకంటే ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: «మీరు రాత్రి ప్రయాణాన్ని విధి పర్చుకోండి,ఎందుకంటే రాత్రి సమయం లో భూమి చుట్టేయబడుతుంది» [24]. [24] దీన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు. హదీసు సంఖ్య (2571).
24. అతనికి ప్రయాణంలో ఎక్కువగా దుఆ చేయడం ఇష్టప్రాయమైనది; ఎందుకంటే ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: «ముగ్గురి దుఆలు ఖచ్చితంగా ఆమోదించబడతాయి అందులో ఎలాంటి సందేహము లేదు:-ఒకటి అన్యాయానికి గురైన పీడితుడు చేసే దుఆ ప్రయాణికుడి దుఆ మరియు సంతానం కొరకు తండ్రి చేసే దుఆ» [25]. [25] దీనిని అహ్మద్ తన ముస్నద్ లో హదీసుసంఖ్య (10771) ఉల్లేఖించారు.
***
రెండవది: ప్రయాణంలో పవిత్రత (తహారత్)
ప్రయాణికుడు తన పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత వహించాలి, కాబట్టి చిన్న అపవిత్రత నుంచి వుజూ చేసుకోవాలి మరియు జనాబతు నుంచి గుస్ల్ చేయాలి.
అతను నీరు పొందలేకపోతే లేదా తనకు ఉన్న తక్కువ నీరు తాను తినేందుకు మరియు త్రాగేందుకు అవసరమైతే, అప్పుడు అతను తయమ్ముమ్ చేసుకోవాలి.
తయమ్ముమ్ చేసే విధానం: అతను తన చేతులను నేలపై కొట్టి, వాటితో తన ముఖాన్ని మరియు చేతులును తుడుచుకోవాలి.
తయమ్ముమ్ తో పొందిన పవిత్రత తాత్కాలికమైనదే. కాబట్టి నీరు లభించిన వెంటనే అది రద్దవుతుంది మరియు నీటిని ఉపయోగించడం తప్పనిసరి అవుతుంది. మీరు జనాబతు కోసం తయమ్ముమ్ చేసుకున్న తరువాత నీరు లభిస్తే, గుస్ల్ చేయడం అవసరం. అదే విధంగా, మల విసర్జన తర్వాత తయమ్ముమ్ చేసుకుని నీరు లభిస్తే, అతనిపై వుజూ చేయడం తప్పనిసరి. మరియు హదీసులో ఇలా ఉంది : ఒక ముస్లిం కొరకు శుద్దమైన మట్టి వజూనిమిత్తం సరిపోతుంది, ఒకవేళ పది సంవత్సరాలు నీరు లభించకపోయిన సరే! అయితే, అతను నీరు పొందిన వెంటనే అల్లాహ్‌కు భయపడాలి శరీరాన్ని శుబ్రపరుచుకోవాలి" [26]. [26] దీనిని తిర్మిదీ తన ముస్నద్ లో హదీసుసంఖ్య (10068) ఉల్లేఖించారు.
మేజోడుల పై మసహ్ చేయడం ఖుర్ఆన్, సున్నహ్ మరియు అహ్లుస్సున్నహ్ ఐక్యాభిప్రాయం ద్వారా ప్రామాణికమైనది.
మేజోడులపై మరియు అర్ధములో వాటికి సమానమైన వాటిపై మసహ్ చేయడానికి కొన్ని షరతులు విధించబడ్డాయి:
1. మేజోడులు లేదా సాక్సులు అనుమతించబడినవి మరియు పవిత్రమైనవి కావాలి.
2- అతను వాటిని పవిత్రమైన (తహారత్,వుజూ) స్థితిలో తొడగాలి.
3. అవి తప్పనిసరిగా వుజూలో కడుక్కోవలసిన భాగాన్ని పూర్తిగా కప్పి ఉంచాలి.
4. మసహ్ చేయడం చిన్న అపవిత్రత (అల్ప హదస్) కోసం మాత్రమే అనుమతించబడుతుంది; జనాబతు లేదా గుస్లు చేయడం అవసరమైన అపవిత్రత స్థితిలో మసహ్ చేయడం అనుమతించబడదు.
5. మసహ్ చేయడం షరీఅహ్‌లో నిర్దేశించిన కాలవ్యవధిలోనే ఉండాలి, ఇది స్థిర నివాసికి ఒక రోజు మరియు ఒక రాత్రి, ప్రయాణికుడికి మూడు రోజులు మరియు వాటి రాత్రులు. మరియు ఈ వ్యవధి, సరైన మతపరమైన అభిప్రాయం ప్రకారం, అపవిత్రత ఏర్పడిన తర్వాత మొదటిసారి మసహ్ చేసిన సమయంనుంచి ప్రారంభమవుతుంది. నివాసికి ఇది ఇరవై నాలుగు గంటల తర్వాత ముగుస్తుంది, ప్రయాణికుడికి ఇది డెబ్బై రెండు గంటల తర్వాత ముగుస్తుంది.
మరియు వాటిపై మసహ్ చేయటం ఈ మూడు విషయములలో నుంచి ఏ ఒక్కటి ఉన్నా చెల్లదు:
1. జనాబతు వంటి గుస్ల్ తప్పనిసరి చేసే అపవిత్రత సంభవిస్తే, మసహ్ రద్దవుతుంది మరియు గుస్ల్ చేయక తప్పదు.
2. మసహ్ చేసిన తరువాత వాటిని తీసివేస్తే, మసహ్ రద్దవుతుంది.
3. షరీఅహ్‌లో నిర్దేశించిన కాలవ్యవధి పూర్తయ్యాక, మసహ్ రద్దవుతుంది.
***
మూడవది: ప్రయాణంలో ఖస్ర్ (కుదింపు) నమాజుకు సంబంధించిన ఆదేశాలు :
ప్రయాణంలో నమాజును పూర్తిగా చేయడం కన్న ఖస్ర్ చేయడం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అయితే, ప్రయాణికుడు నాలుగు రకా‘తుల నమాజును పూర్తిగా (నాలుగు రకా‘తులు) చేస్తే, అతని నమాజు సరిగానే అవుతుంది, కానీ అతను ఉత్తమమైన విధానాన్ని విబేధించాడు.
ప్రయాణికుడు తన గ్రామం లేదా పట్టణంలోని అన్ని ఇళ్లను దాటి వెళ్లినప్పుడు నమాజును ఖస్ర్ చేయాలి. ఇదే ప్రముఖ ఉలమా సమూహపు విధానం.
నమాజు సమయం ప్రవేశించిన తర్వాత ప్రయాణం ప్రారంభించినట్లయితే, అతడు ఆ నమాజును కస్ర్ చేయవచ్చు. ఎందుకంటే, అతను సమయములోనే దాని సమయం ముగిసే ముందే ప్రయాణం చేశాడు.
ఇక, మధ్యాహ్న (జుహ్ర్) మరియు సాయంత్ర (అసర్) నమాజులను, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులను కలిపి చదవడం (జమఙ) ప్రయాణికుడికి అవసరమైనప్పుడు సున్నతుగా ఉంటుంది. ప్రయాణం నిరంతరం కొనసాగినప్పుడు లేదా అవసరమైన పరిస్థితుల్లో, అతడు తనకు అనువుగా ఉండే విధంగా ముందుగానే లేదా ఆలస్యంగా కలిపి చదవ వచ్చు.
ఒకవేళ ప్రయాణికుడికి నమాజులను కలిపి చదవాల్సిన అవసరం లేకపోతే, అతడు కలిపి చదవకూడదు. ఉదాహరణకు, ఒక స్థలంలో అతడు స్థిరంగా ఉండి, రెండవ నమాజు సమయం వచ్చే వరకు ప్రయాణించాలనుకోకపోతే, కలిపి చదవకపోవడం మంచిది. ఎందుకంటే, దీనికి అవసరం ఉండదు. హజ్జతుల్ వదా సందర్భంలో మినాలో ప్రవాసం చేసినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులను కలిపి చదవలేదు, ఎందుకంటే దాని అవసరం లేదు.ొొొ
ప్రయాణికుడు స్థిర నివాసి ఆచరించే స్వచ్ఛంద నమాజులను (నఫిల్) ఆచరిస్తాడు, అతడు దుహా నమాజు, తహజ్జుద్ (రాత్రి నమాజు), విత్ర్ మరియు ఇతర నఫిల్ నమాజులను చదవవచ్చు. అయితే, జుహ్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులకు సంబంధించిన నిర్ధిష్టమైన సున్నత్ రకాతులను (రాతిబా) చదవకూడదు. వాటిని చదవకపోటమే సున్నత్ అవుతుంది.
ప్రయాణ సమయంలో వాహనంపై (విమానము, కారు, నౌక మరియు ఇతర ప్రయాణ సౌకర్యాలు) నఫిల్ నమాజు చదవడం చెల్లుబాటు అవుతుంది. అయితే, ఫర్జ్ నమాజును మాత్రం కచ్చితంగా వాహనం నుంచి దిగి ఆచరించాలి, అయితే దాని శక్తి లేకపోతే మాత్రమే వాహనంలోనే నమాజు చదవడం అనుమతించబడుతుంది.
ప్రయాణికుడు స్థిరనివాసి ఇమామ్ వెనుక నమాజు చదివినట్లయితే, అతని నమాజు చెల్లుబాటు అవుతుంది. అప్పుడు ప్రయాణికుడు తన ఇమామ్ నమాజు పూర్తిగా చేయుటలాగే పూర్తిగా చేయాలి, అది మొత్తం నమాజు అయినా, ఒక రకాతు మాత్రమే అయినా, మరింత తక్కువ అయినా. అంతే కాకుండా, చివరి తషహ్హుద్‌లో (సలాం చెప్పడానికి ముందు) చేరినప్పటికీ, అతను పూర్తిగా నమాజు చేయాలి. ఇది ఇస్లామీయ పండితుల సరైన అభిప్రాయం.
***
నాలుగోది: హజ్ మరియు ఉమ్రా లేదా ప్రయాణం నుండి తిరిగి రావడమునకు సంబంధించిన మర్యాదలు
ప్రయాణాన్ని అనవసరంగా పొడిగించకుండా త్వరగా ప్రయాణము నుండి మరలటానికి ప్రయత్నించాలి; అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : «ప్రయాణం శిక్షలోని ఒక భాగం’అది మిమ్మల్ని అన్నపానీయాలనుండి నిద్రాహారాల నుండి ఆపుతుంది,ఎవరైతే తమ ప్రయాణం లోని పనులను పూర్తి చేసుకుంటాడో వెంటనే అతను ఇంటికి బయల్దేరడానికి ప్రయత్నించాలి’త్వరపడాలి» [27]. [27] దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (1804) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (1927).
తన నగరానికి తిరిగి వెళ్లే నిర్ణయం చేసుకున్నప్పుడు, తన ప్రయాణ వాహనంపై ఎక్కినప్పుడు ప్రయాణ దువాను చదవాలి. అలాగే దీనికి అదనంగా ఈ దుఆ చదవాలి: ఆయిబూన తాయిబూన ఆబిదూన లిరబ్బినా హామిదూన" (మేము వాపసు తిరిగి వచ్చేవారం, పశ్చాత్తాప పడేవారం, ఆరాధించేవారం, మా ప్రభువునే మేము స్తుతించేవారము). [28]. [28] దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీసు సంఖ్య (1797) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (1342).
తన ప్రయాణం నుండి తిరిగి వస్తున్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసినట్లుగా, భూమిలో ఉన్న ఎత్తైన ప్రదేశాలకు చేరినప్పుడు మూడు సార్లు "అల్లాహు అక్బర్" అని తక్బీర్ చెప్పడం మంచిది. ఆపై ఇలా చెప్పాలి: లా ఇలాహా ఇల్లల్లాహు వహదహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్ ఆయిబూన, తాయిబూన, ఆబిదూన, సాజిదూన, లిరబ్బినా హామిదూన, సదఖల్లాహు వఅదహు, వనసర అబ్దహు, వహజమల్ అహ్జాబ వహ్దహు" (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్త్రోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. మేము వాపసు తిరిగి వచ్చేవారము, పశ్చాత్తాప పడేవారము, ఆయన్నే ఆరాధించే వారము. మేము మా ప్రభువును స్తుతించేవారము. అల్లాహ్ తన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. తన దాసునికి సహాయం చేసాడు. ఆయన ఒక్కడే శత్రు వర్గాలను చిత్తుగా ఓడించాడు.)[29]. [29] దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (4116)
తన ఊరు కనిపించినప్పుడు ఇలా పలకడం మంచిది: ఆయిబూన, తాఇబూన, ఆబిదూన, లిరబ్బినా హామిదూన్ (మేము వాపసు తిరిగి వచ్చేవారం, పశ్చాత్తాప పడేవారం, ఆరాధించేవారం, మా ప్రభువునే మేము స్తుతించేవారము).[30]، ఈ దుఆను పునరావృతం చేస్తూ, స్వగ్రామం లేదా నగరంలో ప్రవేశించడం ఉత్తమమైన ఆచారం. ఎందుకంటే ఇలా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. [30] దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (1797) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (1342).
తన గైర్హాజరీ ఎక్కువ కాలం కొనసాగితే, అవసరం లేకుండా రాత్రిపూట కుటుంబ సభ్యుల వద్దకు అకస్మాత్తుగా చేరుకోకూడదు. అయితే, తాను రాత్రి చేరుకుంటానని వారికి ముందుగా తెలియజేసి సమాచారం ఇచ్చినట్లయితే, అప్పుడది అనుమతించబడుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని నిషేధించారు. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఇలా తెలిపారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారు ఒక వ్యక్తి రాత్రి సమయంలో అకస్మాత్తుగా తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడం నుండి వారించారు[31] దీనిలోని వివేకము మరో రివాయత్‌లో వివరించబడింది: అంతకాలంగా తన భర్త దూరంగా ఉన్న మహిళ తన చెదిరిపోయిన జుట్టును సవరించుకునేలా, మరియు భర్త లేని కారణంగా నిర్లక్ష్యం అయిన మహిళ స్వచ్ఛత కోసం తన గోప్యభాగాలను శుభ్రం చేసుకునేలా."[33]، ఇంకో రివాయత్ లో ఇలా ఉన్నది: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి రాత్రిపూట తన కుటుంబం వద్దకు వారి విశ్వసనీయతను అనుమానిస్తూ లేదా వారి లోపాలను అన్వేషించటం కోరకు వెళ్లటమును నిషేధించారు." [34]. [31] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (715) [32] "షఅసతు": చెదిరిపోయిన జుట్టు కల ఆమె జుట్టుకు నూనె వేయడం మరియు దువ్వడం చాలా కాలంగా నిర్లక్ష్యం చేసిన ఆమె మరియు "ఇస్తిహ్దాద్": రేజర్ ఉపయోగించడం మరియు "ముఘయ్యబా": ఆమె భర్త గైరు హాజరు ఉన్న ఆవిడి ఆత్తహ్రీరు ఫీ షర్హి సహీహ్ ముస్లిం - అల్ అస్బహానీ (సంపుటము 292). [33] దీనిని నసాయీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (9099) [34] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (715)
ప్రయాణం నుండి తిరిగి వచ్చిన వ్యక్తి మొదటగా తన ఇంటి పక్కన ఉన్న మస్జిద్‌కు వెళ్లి అందులో రెండు రకాతులు నమాజు చేయడం మంచిది; ఇది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా ఉంది.
ప్రయాణం ముగించుకొని ఇంటికి చేరుకున్న వ్యక్తి తన కుటుంబంలోని పిల్లలు మరియు పొరుగు పిల్లలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించడం, వారితో మంచిగా వ్యవహరించడం మంచిది. ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) నివేదించిన హదీస్ ప్రకారం, ప్రవక్త మక్కాకు వచ్చినప్పుడు, బనూ అబ్దుల్ ముత్తలిబ్ వంశానికి చెందిన చిన్న పిల్లలు ఆయనను స్వాగతించేందుకు వచ్చారు. ఆయన ఒకరిని ముందు, మరొకరిని వెనుక ఎక్కించుకున్నారు. అబ్దుల్లాహ్ బిన్ జాఫర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రయాణం ముగించుకొని వచ్చినప్పుడు, మేము ఆయనను స్వాగతించేవారం. అప్పుడు నేను మరియు హసన్ లేదా హుసైన్ స్వాగతించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇద్దరిలో ఒకరిని తన ముందుకు, మరొకరిని వెనుకకు ఎక్కించుకొని మదీనాలో ప్రవేశించేవారు. [35]. [35] దీనిని ముస్లిం ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (2428)
బహుమతి ఇవ్వడం ప్రియమైనదిగా భావించబడుతుంది, ఎందుకంటే ఇది హృదయాలను సంతోషపరచడంలో మరియు విద్వేషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే, బహుమతిని స్వీకరించడం మరియు దానికి ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వడం కూడా ప్రియమైనదిగా ఉంటుంది. షరీఅత్ కారణం లేకుండా బహుమతిని తిరస్కరించడం అసహ్యమైనదిగా భావించబడుతుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీరు పరస్పరం బహుమతులు ఇచ్చుకోండి, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. [36]. బహుమతి ముస్లింల మధ్య స్నేహాన్ని కలిగించే కారణాలలో ఒకటి. [36] దీనిని బైహిఖీ సుననుల్ కుబ్రాలో హదీసు సంఖ్య (11946) ఉల్లేఖించారు.
ప్రయాణికుడు తన ఊరికి చేరుకున్నప్పుడు ఆలింగనం చేయడం ప్రియమైనదిగా భావించబడుతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల నుండి దీనికి ప్రామాణికత ఉంది. అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు చేతులు కలిపేవారు, మరియు ప్రయాణం నుండి వచ్చినప్పుడు ఆలింగనం చేసుకునేవారు.[37] [37] దీనిని తబ్రానీ ఔసత్ లో ఉల్లేఖించారు హదీథు సంఖ్య (97).
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.