9 : 13
أَلَا تُقَٰتِلُونَ قَوۡمٗا نَّكَثُوٓاْ أَيۡمَٰنَهُمۡ وَهَمُّواْ بِإِخۡرَاجِ ٱلرَّسُولِ وَهُم بَدَءُوكُمۡ أَوَّلَ مَرَّةٍۚ أَتَخۡشَوۡنَهُمۡۚ فَٱللَّهُ أَحَقُّ أَن تَخۡشَوۡهُ إِن كُنتُم مُّؤۡمِنِينَ
ఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కా నుండి) వెడల గొట్టాలని నిర్ణయించారో! మరియు మొదట వారే, మీతో తగవు ఆరంభించారో, అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమీ? మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే, కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం.
Explanation & meanings · 1
- బహుశా ఇక్కడ ఖురైషులు తమ ఒడంబడికకు విరుద్ధంగా బనీ-'ఖు'జా'అ వారిని చంపటానికి, బనీ-బక్ర్ వారికి తోడ్పడిన విషయం పేర్కొనబడింది. బనీ-'ఖు'జా'అ - ముస్లింల హలీఫ్ లు, మరియు బనీ-బక్ర్ - ఖురైషుల హలీఫ్ లు. దైవప్రవక్త ('స'అస) మరియు మక్కా ముష్రిక్ ఖురైషుల మధ్య: 'పది సంవత్సరాల వరకు - వారి మధ్య మరియు వారి హలీఫ్ లతో కూడా - యుద్ధం చేయకూడదు మరియు వారితో పోరాడే వారికి సహాయం కూడా చేయరాదు.' అనే, ఒడంబడిక ఉండెను. ఇది 6వ హిజ్రీలో హుదైబియాలో జరిగిన ఒడంబడిక.