48 : 15
سَيَقُولُ ٱلۡمُخَلَّفُونَ إِذَا ٱنطَلَقۡتُمۡ إِلَىٰ مَغَانِمَ لِتَأۡخُذُوهَا ذَرُونَا نَتَّبِعۡكُمۡۖ يُرِيدُونَ أَن يُبَدِّلُواْ كَلَٰمَ ٱللَّهِۚ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمۡ قَالَ ٱللَّهُ مِن قَبۡلُۖ فَسَيَقُولُونَ بَلۡ تَحۡسُدُونَنَاۚ بَلۡ كَانُواْ لَا يَفۡقَهُونَ إِلَّا قَلِيلٗا
ఇక మీరు మీ విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు, వెనుక ఉండి పోయిన వారు ఇలా అంటారు: "మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి." వారు అల్లాహ్ ఉత్తరువును మార్చగోరుతున్నారు. వారితో అను: "మీరు మా వెంట రాజాలరు; మీ గురించి అల్లాహ్ ముందే ఈ విధంగా చెప్పాడు." అప్పుడు వారు ఇలా అంటారు: "అది కాదు! మీరు మా మీద అసూయ పడుతున్నారు." అలా కాదు! వారు వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ.
Explanation & meanings · 2
- ఇక్కడ 'ఖైబర్ యుద్ధ ప్రస్తావన ఉంది. అది 7వ హిజ్రీలో జరిగింది. 'హుదైబియా ఒప్పందం తరువాత సూరహ్ అల్-ఫ'త్హ్ అవతరింపజేయబడింది. అది విని 6వ హిజ్రీలో సాకులు చెప్పి మక్కాకు 'ఉమ్మా కొరకు రానివారు - విజయధనపు ఆశతో - 'ఖైబర్ యుద్ధంలో పాల్గొనటానికి అనుమతి అడుగుతారు. అప్పుడు దైవప్రవక్త ('స'అస), కేవలం 6వ హిజ్రీలో 'ఉమ్రా కొరకు మక్కాకు పోయినవారు మాత్రమే 'ఖైబర్ కు పోవాలని. సెలవిస్తారు.
- చూడండి, 8:1.