34 : 54
وَحِيلَ بَيۡنَهُمۡ وَبَيۡنَ مَا يَشۡتَهُونَ كَمَا فُعِلَ بِأَشۡيَاعِهِم مِّن قَبۡلُۚ إِنَّهُمۡ كَانُواْ فِي شَكّٖ مُّرِيبِۭ
మరియు వారికి పూర్వం గడిచిన వారి విధంగానే, వారి మధ్య మరియు వారి కోరికల మధ్య అడ్డు వేయబడుతుంది. నిశ్చయంగా, వారు సంశయంలో పడవేసే గొప్ప సందేహంలో పడి ఉండేవారు.
Explanation & meanings · 1
- శిక్షను చూసిన తరువాత విశ్వసించగోరితే, ఆ విశ్వాసం అంగీకరించబడదు. ఖతాదా (రజి.అ.) కథనం: "సందేహాల మరియు సంశయాల నుండి దూరంగా ఉండండి. ఎవడైతే సందేహావస్థలో మరణిస్తాడో! అదే స్థితిలో పునరుత్థరింపబడతాడు. మరియు ఎవడైతే విశ్వాసంతో మరణిస్తాడో ఆ రోజు విశ్వాసంతోనే లేపబడతాడు!" (ఇబ్నె-కసీ'ర్)