29 : 14
وَلَقَدۡ أَرۡسَلۡنَا نُوحًا إِلَىٰ قَوۡمِهِۦ فَلَبِثَ فِيهِمۡ أَلۡفَ سَنَةٍ إِلَّا خَمۡسِينَ عَامٗا فَأَخَذَهُمُ ٱلطُّوفَانُ وَهُمۡ ظَٰلِمُونَ
మరియు వాస్తవానికి, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారి మధ్య యాభై తక్కువ వేయి సంవత్సరాల వరకు (వారిని అల్లాహ్ ధర్మం వైపుకు ఆహ్వానిస్తూ) నివసించాడు; చివరకు వారు దుర్మార్గాన్ని విడనాడనందుకు, వారిని తుఫాను పట్టుకున్నది.
Explanation & meanings · 1
- నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48 ఇక్కడ ఉద్దేశమేమిటంటే: ఒక ప్రవక్త ('అ.స.) కూడా తాను ప్రేమించేవారిని సన్మార్గానికి తేలేడు. ఇంకా చూడండి, 28:56 నూ'హ్ ('అ.స.) వారికి 950 సంవత్సరాలు ఇస్లాం ధర్మప్రచారం చేశారు. మార్గదర్శకత్వమంతా అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వమే. చూడండి, 3:73.