26 : 176
كَذَّبَ أَصۡحَٰبُ لۡـَٔيۡكَةِ ٱلۡمُرۡسَلِينَ
వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు.
Explanation & meanings · 1
- చూఅ'య్ కహ్ వాసులు అంటే, అడవివాసులు. మద్ యన్ కు కొంత దూరంలో ఉన్న అడవి ప్రాంతం అ'య్ కహ్ అనబడుతుందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఇలా ఉంది: అ'య్ కహ్ అంటే ఒక పెద్ద చెట్టు అది మద్ యన్ కు కొంత దూరంలో ఉండింది. దాని వాసులు ఆ చెట్టును ఆరాధించే వారు. షు'ఐబ్ ('అ.స.) మద్ యన్ వాసులు. కావున అతను మద్ యన్ వాసుల సోదరుడు అని పేర్కొనబడ్డారు. చూడండి, 7:85. వారు ఈ రెండు ప్రాంతాలలో ధర్మప్రచారం చేశారు. (ఇబ్నె-కసీ'ర్).