Skip to content
النور /

ఆయత్ 3

24 : 3
النور ఆయతులు 64
సూరా · النور
తెలుగు · Muhammad
24 : 3

ٱلزَّانِي لَا يَنكِحُ إِلَّا زَانِيَةً أَوۡ مُشۡرِكَةٗ وَٱلزَّانِيَةُ لَا يَنكِحُهَآ إِلَّا زَانٍ أَوۡ مُشۡرِكٞۚ وَحُرِّمَ ذَٰلِكَ عَلَى ٱلۡمُؤۡمِنِينَ

ఒక వ్యభిచారి, ఒక వ్యభిచారిణిని లేక బహుదైవారాధకురాలయిన (ముష్రిక్) స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు; మరియు ఒక వ్యభిచారిణిని, ఒక వ్యభిచారుడో లేక ఒక బహుదైవారాధకుడో మాత్రమే వివాహమాడుతాడు. మరియు ఇలాంటి విషయం విశ్వాసుల కొరకు నిషేధించబడింది.

Explanation & meanings · 1
  1. కొందరు 'స'హాబీ (ర'ది. 'అన్హుమ్)లు చరిత్రహీనులైన స్త్రీలతో వివాహమాడటానికి అనుమతి అడిగినప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడిందని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇక్కడ నికా'హ్: అంటే సాధారణ వివాహం కాదు, లైంగిక సంబంధం. ఒక వ్యభిచారియే ఒక వ్యభిచారిణితో లైంగిక సంబంధం ఉంచుకుంటాడు అని కొందరు అభిప్రాయపడ్డారు. మరొక వ్యాఖ్యానం ఏమిటంటే: ప్రతివాడు తనవంటి వారినే తన సహవాసులుగా ఎన్నుకుంటాడు. ఇది ఇమామ్ అష్-షౌకాని వ్యాఖ్యానం.