13 : 32
وَلَقَدِ ٱسۡتُهۡزِئَ بِرُسُلٖ مِّن قَبۡلِكَ فَأَمۡلَيۡتُ لِلَّذِينَ كَفَرُواْ ثُمَّ أَخَذۡتُهُمۡۖ فَكَيۡفَ كَانَ عِقَابِ
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించ బడ్డారు, కావున (మొదట) నేను సత్యతిరస్కారులకు వ్యవధి నిచ్చాను తరువాత వారిని పట్టుకున్నాను. (చూశారా!) నా ప్రతీకారం (శిక్ష) ఎలా ఉండిందో!
Explanation & meanings · 1
- 'హదీస్'లో కూడా ఉంది: 'అల్లాహ్ (సు.తా.) దుర్మార్గులకు వ్యవధినిస్తూ పోతాడు, చివరకు వారిని శిక్షించటానికి పట్టుకున్నప్పుడు ఏ మాత్రమూ వదలడు.' దైవప్రవక్త ('స'అస), ఇది వినిపించిన తరువాత, ఆయత్ 11:102 ను చదివి వినిపించారు. ('స'హీ'హ్ బు'ఖారీ, 'స. ముస్లిం).