Skip to content
يُونس /

ఆయత్ 98

10 : 98
يُونس ఆయతులు 109
సూరా · يُونس
తెలుగు · Muhammad
10 : 98

فَلَوۡلَا كَانَتۡ قَرۡيَةٌ ءَامَنَتۡ فَنَفَعَهَآ إِيمَٰنُهَآ إِلَّا قَوۡمَ يُونُسَ لَمَّآ ءَامَنُواْ كَشَفۡنَا عَنۡهُمۡ عَذَابَ ٱلۡخِزۡيِ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَمَتَّعۡنَٰهُمۡ إِلَىٰ حِينٖ

యూనుస్ జాతివారు తప్ప! ఇతర ఏ పురవాసులకు కూడా, (శిక్షను చూసిన తరువాత) విశ్వసించగా, వారి విశ్వాసం వారికి లాభదాయకం కాలేక పోయింది! (యూనుస్ జాతి) వారు విశ్వసించిన పిదప మేము వారి నుండి ఇహలోక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాము. మరియు వారిని కొంతకాలం వరకు వారికి (ఇహలోక జీవితాన్ని) అనుభవించే అవకాశాన్ని ఇచ్చాము.

Explanation & meanings · 1
  1. యూనుస్ ('అ.స.) 'నైనవా' (Nineveh) వాసులకు ధర్మప్రచారం చేశారు. కాని వారతనిని తిరస్కరించారు. దానికి అతను కోపపడి ఉద్రేకంతో వారిని శపించి వెళ్ళిపోయారు. వారి పైకి శిక్ష రావడం చూసి ప్రజలందరూ ఒక మైదానంలో చేరుకొని అల్లాహ్ (సు.తా.) ను మన్నించమని ప్రార్థించారు. వారి క్షమాపణను అంగీకరించి అల్లాహ్ (సు.తా.) వారి శిక్షను తొలగించాడు. ఆ తరువాత వారు అల్లాహ్ (సు.తా.)కు విధేయు(ముస్లిం)లయ్యారు. ఈ విధంగా శిక్షను చూసిన తరువాత క్షమాపణ అంగీకరించబడిన వారు కేవలం యూనుస్ ('అ.స.) జాతి ప్రజలు మాత్రమే. ఇంకా చూడండి, 21:87-88, 37:139-148, (ఫ'త్హ అల్ -'ఖదీర్).