Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 130 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (58)
“నేను మీతో ప్రస్తావించని దాని గురించి అనవసరంగా నన్ను అడగవద్దు. నిశ్చయంగా, మీకు పూర్వం ఉన్న వారిని నాశనం చేసింది చాలా ప్రశ్నలు అడగడమే మరియు తమ ప్రవక్తలతో విభేదించడమే. కాబట్టి, నేను మిమ్మల్ని దేనినుంచైనా నిషేధించినట్లయితే, దాని నుండి దూరంగా ఉండండి; మరియు నేను మీకు ఏదైనా చేయమని ఆజ్ఞాపిస్తే, మీ శక్తి మేరకు చేయగలిగినంత చేయండి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيالقواعد الفقهية والأصولية، الأحكام التكليفية والوضعية، أهمية السنة ومكانتها، الأنبياء والرسل السابقين عليهم السلامموضوعات الحديثالتكلف، حقوق النبي ﷺ، متابعة الرسول ﷺ
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే), వీటిల్లో ఏ ఒక్క దానిలోనూ ఏమీ ఎక్కువ చేయకపోయినా (ఎక్కువ ఏమీ ఆచరించకపోయినా) నేను స్వర్గం లోనికి ప్రవేశించగలనా?” దానికి ఆయన “అవును, ప్రవేశించగలవు” అన్నారు. దానికి అతడు “అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే ఏ ఒక్క విషయమూ ఎక్కువ చేయను (ఎక్కువ ఆచరించను)” అన్నాడు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
التصنيف الشرعيوجوب الصلاة وفضلها وحكم تاركها، وجوب الصيام وحكم تاركه، الإسلامموضوعات الحديثالصوم الواجب، تعظيم شعائر الله وحرماته، سعة فضل الله عز وجل، التقوى، مكانة الصلاة وفضلهامحاور التعريف بالإسلامأركان الإسلام
ముఆద్ ఇబ్నె జబల్ రజియల్లాహు అన్హు ను యమన్ కు పంపునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా అన్నారు: “నిశ్చయంగా నీవు ఇప్పుడు గ్రంథావహులైన జాతి (ప్రజల) వద్దకు వెళుతున్నావు. వారి వద్దకు చేరినపుడు “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని సాక్ష్యం పలుకమని వారిని ఆహ్వానించు. మరి వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా వారిపై ప్రతి రోజూ ఐదు పూటల నమాజు ఆచరించుటను అల్లాహ్ విధిగా చేసినాడు’ అని. వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా అల్లాహ్ వారిపై ‘సదాఖా చెల్లించుటను (జకాత్ చెల్లించుటను) విధిగా చేసినాడు’ అని, ‘అది వారిలోని ధనవంతుల నుండి తీసుకోబడుతుంది మరియు వారిలోని పేదవారికి ఇవ్వబడుతుంది’ అని. వారు అందులో కూడా నిన్ను అనుసరించినట్లయితే (ఓ ముఆద్!) వారి సంపదలలోని విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త (జకాతులో భాగంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయకు). అన్యాయానికి, దౌర్జన్యానికి గురైన వాని దువా పట్ల భయపడు. ఎందుకంటే, నిశ్చయంగా వాని ఆక్రందనకూ, అల్లాహ్ కు మధ్య ఎటువంటి అడ్డూ ఉండదు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيفضل الدعوة إلى الله وأحكامها، وجوب الصلاة وفضلها وحكم تاركها، وجوب الزكاة وحكم تاركها، مصارف الزكاة، دعوة غير المسلمين، الإسلامموضوعات الحديثالدعوة إلى الله، الظلممحاور التعريف بالإسلامأركان الإسلام، الإسلام هو الدين الحق
“మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది; (అల్లాహ్ మార్గములో) బంగారము మరియు వెండి ఖర్చుచేయుట కంటే ఉత్తమమైనది; మరియు మీరు మీ శత్రువులను ఎదుర్కొన్నపుడు వారి మెడలపై మీరు దాడి చేయడం, మరియు వారు మీ మెడలపై దాడి చేయడం కంటే కూడా ఇది మీకు శ్రేష్ఠమైనది”; దానికి వారు “తప్పకుండా తెలియజేయండి ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ఆయన “సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క స్మరణ చేయుట (ఆయనను స్మరించుట, జిక్ర్ చేయుట)” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
التصنيف الشرعيفضل الذكر، فوائد ذكر الله عز وجلموضوعات الحديثالذِّكْر
“ప్రతి సలాహ్’ కొరకు (నమాజు కొరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసేవారు.” నేను అడిగాను “మరి నీవు ఎలా చేస్తూ ఉండేవాడివి?” అని. దానికి ఆయన “మాలో ప్రతి ఒక్కరికీ, భగ్నం కానంత వరకూ, ఒకసారి చేసిన ఉదూనే సరిపోయేది” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
التصنيف الشرعيفضل الوضوء، سنن وآداب الوضوء، نواقض الوضوءموضوعات الحديثأحكام الوضوء
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను “మరి (నీటి హౌజు లోని ఆ నీటిని త్రాగే) కప్పుల మాటేమిటి?” దానికి ఆయన ఇలా అన్నారు: “ముహమ్మద్ యొక్క ప్రాణం ఎవరి చేతిలోనైతె ఉన్నదో ఆయన సాక్షిగా; మబ్బులు లేని నల్లని ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాల కన్నా, ఆ కప్పులు మిక్కిలి అధిక సంఖ్యలో ఉంటాయి. అవి స్వర్గపు పాత్రలు. ఎవరైతే దాని నుండి (ఆ నీటి హౌజు నుండి) నీటిని త్రాగుతాడో, అతడు ఇంకెన్నడూ దాహానికి లోను కాడు. అందులో స్వర్గపు రెండు ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని నుండి నీటిని త్రాగిన వారెవ్వరికీ తిరిగి దాహం వెయ్యదు. ఆ నీటి తొట్టి వెడల్పు దాని పొడవు అంత ఉంటుంది; అమ్మాన్ మరియు ఆయిలహ్’ల మధ్య దూరమంత. దాని నీరు పాలకన్నా తెల్లగా మరియు తేనె కన్నా మధురంగా ఉంటాయి”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
التصنيف الشرعيالخصائص النبوية، الحياة الآخرةموضوعات الحديثالإيمان باليوم الآخر
“మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ ముఖాన్ని గానీ లేక వీపును గానీ చేయకండి; తూర్పు వైపునకు గానీ లేదా పడమర వైపునకు గానీ చేయండి”. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “మేము షామ్ (సిరియా) దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు ఖిబ్లహ్ వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. మేము వాటిపై మా దిశను మార్చుకుని కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారము, తరువాత అల్లాహ్’ను క్షమాపణ కోరుకునేవారము.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيإزالة النجاسات، الاستنجاء وقضاء الحاجةموضوعات الحديثآداب قضاء الحاجة
“ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيالرقائق والمواعظ، فضائل التوحيد، الأخلاق الحميدة، الإيمان بالقضاء والقدرموضوعات الحديثالصبر، سعة فضل الله عز وجل