Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 31 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“కొంతమంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. వారిలో ఒక్కరితో తప్ప, తొమ్మిది మందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ‘విధేయతా ప్రమాణం’ (బైఅత్) చేయించుకున్నారు. అపుడు వారు ఇలా అన్నారు: “ఓరసూలుల్లాహ్! తొమ్మిది మందితో ప్రమాణం చేయించుకున్నారు, అతడిని వదలివేసారు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనిఒంటిపై తాయత్తు ఉన్నది” అన్నారు. అతడు తన చేతిని చొక్కా లోనికి పోనిచ్చి, దానిని త్రెంచివేసాడు. తరువాత అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకున్నారు. తరువాత ఇలా అన్నారు: “ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటారో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”
హసన్ హదీథు. ఆహ్మద్ నమోదు చేసినారు:
التصنيف الشرعيتوحيد الألوهية، الشركموضوعات الحديثأهمية التوحيد، الشرك بالله وأقسامهمحاور التعريف بالإسلامبطلان الشرك وصوره
“అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”.
హసన్ హదీథు. అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
التصنيف الشرعيفضل الدعاءموضوعات الحديثالدعاء
“విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”
హసన్ హదీథు. అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
التصنيف الشرعيتزكية النفوس، الإيمان بالقضاء والقدر
“(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహుమ్మఘ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వఆఫినీ, వహ్’దినీ, వర్జుఖ్’నీ” (ఓ అల్లాహ్ నాకు క్షమాభిక్ష ప్రసాదించు, నాపై కరుణ చూపు, నాకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించు, నాకు మార్గదర్శకాన్ని ప్రసాదించు మరియు నాకు ఉపాధిని ప్రసాదించు) అని పలికేవారు.”
హసన్ హదీథుగా ధ్రువీకరించబడింది. అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
التصنيف الشرعيصفة الصلاة، أذكار الصلاةموضوعات الحديثالدعاء، سنن الصلاة، صفة الصلاة
"నన్ను పంపబడిన ముఖ్య ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలను (మంచి స్వభావాలను) పరిపూర్ణం చేయడమే."
హసన్ హదీథు. అల్ బుఖారీ 'అదబుల్ ముఫ్రద్'లో, అహ్మద్ మరియు బైహఖీ నమోదు చేసినారు:
التصنيف الشرعيالأخلاق الحميدة
“శాపగ్రస్తుడు ఎవరంటే, ఎవరైతే తన భార్యతో ఆమె ఆసనము ద్వారా (మలద్వారము) సంభోగము చేసేవాడు.”
హసన్ హదీథు. అబూ దావూద్, అన్నసాయీ అల్ కుబ్రాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:
నిశ్చయంగా, మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అవతరింపజేశాడు: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే అవిశ్వాసులు.} [అల్-మాయిదా 5:44] మరియు {వారే దుర్మార్గులు} [అల్-మాయిదా 5:45] మరియు {వారే పాపాత్ములు} [అల్-మాయిదా 5:47]. అతను (ఉల్లేఖకుడు) ఇలా అన్నాడు: ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: అల్లాహ్ ఈ ఆయతులను యూదులలోని రెండు వర్గాల గురించి అవతరింపజేశాడు. జాహిలియ్యా కాలంలో (అజ్ఞానకాలంలో) వారిలో ఒక వర్గం మరొక వర్గంపై ఆధిపత్యం చెలాయించేది. చివరికి వారు ఈ విధంగా అంగీకరించి రాజీపడ్డారు: బలమైన వర్గం వారు బలహీన వర్గానికి చెందిన వారిని చంపితే, దాని నష్టపరిహారం (దియత్) యాభై వస్ఖ్‌లు, మరియు బలహీన వర్గం వారు బలమైన వర్గానికి చెందిన వారిని చంపితే, దాని నష్టపరిహారం (దియత్) వంద వస్ఖ్‌లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చే వరకు వారు దీనినే పాటిస్తూ వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకతో ఆ రెండు వర్గాలు బలహీనపడ్డాయి. ఆ రోజుల్లో అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా వారిపై పూర్తి ఆధిపత్యం సాధించలేదు మరియు వారితో సంధి దశలో ఉన్నారు. అప్పుడు బలహీన వర్గం వారు, బలమైన వర్గానికి చెందిన ఒకరిని చంపారు. అప్పుడు బలమైన వర్గం వారు, బలహీన వర్గానికి ఇలా సందేశం పంపారు: "మాకు వంద వస్ఖ్‌లు పంపండి." దానికి బలహీన వర్గం వారు ఇలా అన్నారు: "ఒకే మతం, ఒకే వంశం, ఒకే నగరం కలిగిన రెండు తెగల మధ్య ఒకరి నష్టపరిహారం మరొకరి నష్టపరిహారంలో సగం ఉండటం ఎక్కడైనా ఉందా? మేము మీకు ఇది ఇచ్చింది కేవలం మీ అన్యాయం మరియు మీ భయం వల్లనే. కానీ ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినందున, మేము మీకు అది ఇవ్వము." దీంతో వారి మధ్య యుద్ధం ప్రజ్వరిల్లేంత పనైంది. ఆ తర్వాత, వారు తమ మధ్య అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మధ్యవర్తిగా నియమించుకోవడానికి అంగీకరించారు. అప్పుడు బలమైన వర్గం వారు ఆలోచించి ఇలా అనుకున్నారు: "అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారు మీకు ఇచ్చే దానికంటే రెట్టింపు మీకు వారి నుండి ఇప్పించరు. వారు (బలహీన వర్గం) నిజమే చెప్పారు. మనం వారిపై చేసిన అన్యాయం మరియు ఆధిపత్యం కారణంగానే వారు మనకు ఇది ఇచ్చారు. కాబట్టి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి ఒకరిని రహస్యంగా పంపండి: ఆయన మీకు కావలసింది ఇస్తే, ఆయనను మీ మధ్యవర్తిగా అంగీకరించండి. ఒకవేళ ఇవ్వకపోతే, జాగ్రత్తపడి ఆయనను మధ్యవర్తిగా అంగీకరించవద్దు." అందువల్ల, వారు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అభిప్రాయం తెలుసుకోవడానికి కపట విశ్వాసులలోని కొందరిని ఆయన వద్దకు రహస్యంగా పంపారు. వారు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు, అల్లాహ్ తన ప్రవక్తకు వారి వ్యవహారం మరియు వారి ఉద్దేశ్యాల గురించి తెలియజేశాడు. అప్పుడు మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఆయతులను అవతరింపజేశాడు: {ఓ ప్రవక్తా! అవిశ్వాసం వైపు పరుగెత్తేవారు, అంటే 'మేము విశ్వసించాము' అని నోటితో పలికే వారు నిన్ను దుఃఖపరచకూడదు} [అల్-మాయిదా 5:41] నుండి {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే పాపాత్ములు} [అల్-మాయిదా 5:47] అనే వచనం వరకు. ఆ తర్వాత ఆయన (ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు) ఆ రెండు వర్గాల గురించి ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా! ఈ ఆయతులు వారి గురించే అవతరించాయి మరియు మహోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని ఉద్దేశించే పలికాడు.
హసన్ హదీథు. ఆహ్మద్ నమోదు చేసినారు:
التصنيف الشرعيأسباب النزول