Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 174 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (56)
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్బియ ఇలా ఉండేది: "లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక, లబ్బైక లా షరీక లక లబ్బైక, ఇన్నల్ హమ్ద వన్ని'మత లక వల్ ముల్క్, లా షరీక లక్." ("హాజరయ్యాను, ఓ అల్లాహ్! నేను హాజరయ్యాను, నీకు భాగస్వామి లేడు, నేను హాజరయ్యాను. నిశ్చయంగా సకల ప్రశంసలు కృతజ్ఞతలు, అనుగ్రహాలు, సార్వభౌమాధికారం అన్నీ నీకే శోభిస్తాయి; నీకు భాగస్వామి లేడు)." ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇంకా ఇలా జోడించేవారు: "లబ్బైక లబ్బైక, వ స'దైక, వల్ ఖైరు బియదైక్. లబ్బైక వ రఘ్బా ఇలైక వల్ అమల్." ("నేను నీ పిలుపుకు హాజరయ్యాను, నేను హాజరయ్యాను. నన్ను సంతోషపెట్టమని కోరుతున్నాను. సర్వమైన మంచి నీ చేతుల్లోనే ఉంది. నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను. ఆశలు, కృషి అన్నీ నీ వైపే."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيأحكام الإحرام
ఒకసారి అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు మదీనా వీధులలోని ఒక వీధిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడం జరిగింది. అపుడు అబూ హురైరహ్ ‘జనాబహ్’ స్థితిలో (అపరిశుద్ద స్థితి: తప్పనిసరిగా తలస్నానం చేసి పరిశుద్ధ పరుచుకోవలసిన స్థితిలో) ఉన్నారు. ఆయన (అక్కడి నుండి మెల్లగా) జారుకుని స్నానం చేసి రావడానికి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను లేకపోవడాన్ని గమనించి, తిరిగి వచ్చినప్పుడు ఇలా అన్నారు: “ఎక్కడికి వెళ్ళిపోయావు ఓ అబూ హురైరహ్?” దానికి ఆయన ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అపరిశుద్ద స్థితిలో ఉండగా మీతో కలిసినాను. నేను గుస్ల్ చేసి (తలస్నానం చేసి) పరిశుద్ధుడిని కానంత వరకు, ఆ స్థితిలో మీ ప్రక్కన ఉండడం నాకు ఇష్టం లేకపోయింది”; అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సుబ్’హానల్లాహ్! ఒక ముస్లిం ఎన్నటికీ అపరిశుద్ధుడు కాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيإزالة النجاسات، الغسل
"పాలు త్రాగడం (రదా'అ) వలన కూడా, జన్మ సంబంధం వల్ల నిషిద్ధమైన సంబంధాలు నిషిద్ధంగా మారతాయి."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيالرضاع، الأربعون النووية
“మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيصفة الوضوء
“వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి.” దానికి వారు (ఆయన సహచరులు) ఇలా అడిగారు “అవి ఏమిటి ఓ ప్రవక్తా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; చట్టబధ్ధమైన కారణం ఉంటే తప్ప “ప్రాణము తీయరాదు” అని అల్లాహ్ నిషేధించిన ప్రాణము తీయుట; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيالربا، الأخلاق الذميمة، ذم المعاصي، الشركموضوعات الحديثالربا، قتل النفس، الزنا، قذف المحصنات، أكل مال اليتيم، قذف المحصنات، السحرمحاور التعريف بالإسلامبطلان الشرك وصوره
“ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు. {وَأَقِمِ الصَّلاةَ لِذِكْرِي} [طه: 14] (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14):”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيوجوب الصلاة وفضلها وحكم تاركها، أخطاء المصلين، صلاة أهل الأعذارموضوعات الحديثتأخير الصلاة عن وقتها، مكانة الصلاة وفضلها، صلاة أهل الأعذار
‘ఉక్ల్’ లేదా ‘ఉరైనహ్’ ప్రాంతము నుండి కొంత మంది (మదీనా) వచ్చినారు. మదీనా వాతావరణం వారికి అనుకూలించనందు వలన వారు అనారోగ్యానికి గురయ్యారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి (అక్కడ ఉన్నన్ని దినాలు) పాలు ఇచ్చే ఒంటెలను ఇవ్వమని మరియు (వారి అనారోగ్యానికి మందుగా) వాటి మూత్రం మరియు పాలు త్రాగమని ఆదేశించినారు. వారు అక్కడి నుండి (ఒంటెలను ఉంచిన ప్రదేశానికి) వెళ్లిపోయారు. అక్కడ వారు కోలుకున్న తర్వాత, వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఒంటెల కాపరిని చంపి ఒంటెలను దోచుకుని వెళ్ళారు. ఆ వార్త తెల్లవారుజామున తెలిసింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని వెంబడించి పట్టుకు రావడానికి ప్రజలను పంపారు. సూర్యుడు ఉదయించినప్పుడు, వారిని తిరిగి తీసుకువచ్చారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చేతులు మరియు కాళ్ళు నరికివేయాలని, మరియు వారి కళ్ళపై వాతలు పెట్టాలని ఆదేశించారు. తరువాత వారు అల్-హర్రా అనే ప్రదేశములో విసిరివేయబడినారు. అక్కడ వారు నీటి కోసం అడుక్కున్నారు కానీ వారికి నీరు ఇవ్వబడలేదు. అబూ కిలాబా ఇలా అన్నారు: “వారు దొంగతనం చేశారు, చంపారు, విశ్వాసం స్వీకరించిన తర్వాత అవిశ్వాసులుగా మారినారు మరియు అల్లాహ్ మరియు ఆయన దూతపై యుద్ధం చేశారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيالطب النبوي، حد قطاع الطريق، حد الردة
“(అల్లాహ్ ఆజ్ఞ లేకుండా వ్యాపించే) అంటువ్యాధి అనేది లేదు; పక్షులలో అపశకునం లాంటిది ఏమీ లేదు; గుడ్లగూబలోనూ అపశకునం ఏమీ లేదు; మరియు సఫర్ మాసములోనూ అపశకునం ఏమీ లేదు. అయితే, కుష్ఠువ్యాధిగ్రస్తుని నుండి దూరంగా ఉండండి, ఏవిధంగానైతే సింహం నుండి మీరు దూరంగా ఉంటారో.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
التصنيف الشرعيالطب النبوي، أحكام الطب والتداوي، أعمال القلوب، شهر صفر، توحيد الربوبية، توحيد الألوهية، الشركموضوعات الحديثأهمية التوحيد، الشرك بالله وأقسامه، الإيمان بالقدر خيره وشره، التوكلمحاور التعريف بالإسلامبطلان الشرك وصوره، موافقة الإسلام للعقل