“ఈ మసీదులు ఇలా మూత్ర విసర్జన లేదా మలవిసర్జన కొరకు కాదు, అవి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క స్మరణ కొరకు, సలాహ్ (నమాజు) కొరకు, మరియు ఖుర్ఆన్ పారాయణం కొరకు మాత్రమే
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“మేము మస్జిదులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండగా ఒక ఎడారివాసి వచ్చి మస్జిదులో నిలబడి మూత్రవిసర్జన చేయసాగినాడు. అది చూసి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు “ఆగు, ఆగు” అనసాగారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అతన్ని అడ్డుకోకండి, అతన్ని ఒంటరిగా వదిలేయండి." సహాబాలు అతను మూత్ర విసర్జన చేసే వరకు వారు అతన్ని ఒంటరిగా వదిలేశారు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని పిలిచి ఇలా అన్నారు; లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే అని ఉంటారు: “ఈ మసీదులు ఇలా మూత్ర విసర్జన లేదా మలవిసర్జన కొరకు కాదు, అవి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క స్మరణ కొరకు, సలాహ్ (నమాజు) కొరకు, మరియు ఖుర్ఆన్ పారాయణం కొరకు మాత్రమే”; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఉన్న వారిలో ఒక వ్యక్తిని ఒక బకెట్ నీళ్ళు తెచ్చి అతడు మూత్ర విసర్జన చేసిన ప్రదేశం మీద పోయమని ఆదేశించినారు”.
بَيْنَمَا نَحْنُ فِي الْمَسْجِدِ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذْ جَاءَ أَعْرَابِيٌّ، فَقَامَ يَبُولُ فِي الْمَسْجِدِ، فَقَالَ أَصْحَابُ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: مَهْ مَهْ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا تُزْرِمُوهُ، دَعُوهُ» فَتَرَكُوهُ حَتَّى بَالَ، ثُمَّ إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ دَعَاهُ فَقَالَ لَهُ: «إِنَّ هَذِهِ الْمَسَاجِدَ لَا تَصْلُحُ لِشَيْءٍ مِنْ هَذَا الْبَوْلِ، وَلَا الْقَذَرِ إِنَّمَا هِيَ لِذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ، وَالصَّلَاةِ وَقِرَاءَةِ الْقُرْآنِ» أَوْ كَمَا قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: فَأَمَرَ رَجُلًا مِنَ الْقَوْمِ فَجَاءَ بِدَلْوٍ مِنْ مَاءٍ فَشَنَّهُ عَلَيْهِ.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మస్జిదులో సహబాలతో ఉండగా ఒక బద్దూ (ఎడారివాసి) వచ్చి ఒక మూలన కూర్చుని మూత్రవిసర్జనకు ఉపక్రమించినాడు. సహచరులు అతన్ని మందలిస్తూ: “ఆపు, దూరంగా వెళ్ళు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఆగండి, అతడిని ఒంటరిగా వదిలివేయండి, అతడిని (మూత్రవిసర్జన నుండి) అడ్డుకోకండి”. దానితో సహాబాలు అతడు మూత్రవిసర్జన పూర్తి చేసేంత వరకు అతడిని ఒంటరిగా వదిలి వేసినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని తన దగ్గరకు పిలిచి అతనితో ఇలా అన్నారు: “వాస్తవానికి ఈ మస్జిదులు మలవిసర్జన మరియు మూత్రవిసర్జనల కొరకు అనుకూలమైన ప్రదేశాలు కావు. ఇవి కేవలం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క స్మరణ కొరకు, సలాహ్ (నమాజు) కొరకు మరియు ఖుర్’ఆన్ పఠనం మొదలైన వాటి కొరకు మాత్రమే.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఒకరిని ఒక బక్కెట్టు నీళ్ళు తెచ్చి అతడు మూత్రవిసర్జన చేసిన ప్రదేశం పై పోయమని ఆదేశించినారు.
మస్జిదుల పట్ల గౌరవము, పూజ్య భావము కలిగి ఉండుట, వాటి పవిత్రతకు, గౌరవానికి తగని విషయాల నుండి వాటిని రక్షించుట ప్రతి ముస్లిము యొక్క విధి.
ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “మస్జిదుల గౌరవానికి, పవిత్రతకు భంగం కలిగించే విషయాలనుండి రక్షించుట” అంటే – అందులో మస్జిదులను మలిన పదార్థాలు, చెత్తచెదారము, దుమ్ము,ధూళి, మస్జిదులో ఉమ్మి వేయుట, పెద్ద గొంతుకతో మాట్లాడుట, జగడాలు, వ్యాపార లావాదేవీలు జరుపుట లేదా ఒప్పందాలు, ఒడంబడికలు, ఖరారునామాలు కుదుర్చు కొనుట మొదలైన అటువంటి అన్ని విషయాల నుండి రక్షించుట కూడా ఉన్నవి.”
ఏదైనా విషయాన్ని గురించి జ్ఞానము లేని వారి పట్ల దయతో వ్యవహరించాలి మరియు కఠినత్వం లేదా హాని కలిగించకుండా వారికి అవసరమైనది నేర్పించాలి, అయితే వారి అవిధేయత, వారి ధిక్కార ధోరణి, మొండితనం లేదా తిరస్కారం కారణంగా చూపినది అయి ఉండరాదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కరుణామయుడైన గురువు, సౌమ్యుడు మరియు సహనశీలి అయిన విద్యావేత్త.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఇళ్ళను నమాజు (ప్రార్థన), ఖుర్ఆన్ పఠనం మరియు సర్వశక్తిమంతుడైన దేవుని స్మరణతో నింపాలని ప్రోత్సహించబడుచున్నది.
సహీహ్ అల్ బుఖారీ. (1/ 54) (221).
సహీహ్ ముస్లిం. (1/ 236) (285).
ఇంకా (8)
نزهة المتقين.
لمجموعة من الباحثين (2/ 1159).
كنوز رياض الصالحين.
لمجموعة من الباحثين (20/ 98).
بهجة الناظرين.
لسليم الهلالي (3/ 191).
شرح رياض الصالحين.
لابن عثيمين (6/ 436).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
6 గ్రంథాలుఇంకా (6)
- الصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهمالصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهم«لَا تُزْرِمُوهُ دَعُوهُ» فَتَرَكُوهُ حَتَّى بَالَ، ثُمَّ إِنَّ رَسُولَ اللهِ ﷺ دَعَاهُ فَقَالَ لَهُ: «إِنَّ هَذِهِ الْمَسَاجِدَ لَا تَصْلُحُ لِشَيْءٍ مِنْ هَذَا الْبَوْلِ، وَلَا الْقَذَرِ إِنَّمَا هِيَ لِذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ، وَالصَّ
- الصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهمالصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهمبَيْنَمَا نَحْنُ فِي الْمَسْجِدِ مَعَ رَسُولِ اللهِ ﷺ. إِذْ جَاءَ أَعْرَابِيٌّ فَقَامَ يَبُولُ فِي الْمَسْجِدِ، فَقَالَ أَصْحَابُ رَسُولِ اللهِ ﷺ: مَهْ مَهْ، قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «لَا تُزْرِمُوهُ دَعُوهُ» فَتَرَكُوهُ حَتَّى بَالَ،
- الصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهم«لَا تُزْرِمُوهُ دَعُوهُ» فَتَرَكُوهُ حَتَّى بَالَ، ثُمَّ إِنَّ رَسُولَ اللهِ ﷺ دَعَاهُ فَقَالَ لَهُ: «إِنَّ هَذِهِ الْمَسَاجِدَ لَا تَصْلُحُ لِشَيْءٍ مِنْ هَذَا الْبَوْلِ، وَلَا الْقَذَرِ إِنَّمَا هِيَ لِذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ، وَالصَّ
- الصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهمبَيْنَمَا نَحْنُ فِي الْمَسْجِدِ مَعَ رَسُولِ اللهِ ﷺ. إِذْ جَاءَ أَعْرَابِيٌّ فَقَامَ يَبُولُ فِي الْمَسْجِدِ، فَقَالَ أَصْحَابُ رَسُولِ اللهِ ﷺ: مَهْ مَهْ، قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «لَا تُزْرِمُوهُ دَعُوهُ» فَتَرَكُوهُ حَتَّى بَالَ،
- الله -جل جلاله- أنيس المحبين وملاذ القاصدين«إِنَّ هَذِهِ المَسَاجِدَ لَا تَصْلُحُ لِشَيْءٍ مِنْ هَذَا البَوْلِ، وَلَا القَذَرِ، إِنَّمَا هِيَ لِذِكْرِ اللهِ -عز وجل- ، وَالصَّلَاةِ وَقِرَاءَةِ القُرْآنِ»
- المناهج التعليمية - الصف الثالث مادة الفقه - الصف الثالث«إِنَّ هَذِهِ المَسَاجِدَ لَا تَصْلُحُ لِشَيْءٍ مِنْ هَذَا البَوْلِ وَلَا القَذَرِ»[7].