من خلق الكون؟ ومن خلقني؟ ولماذا؟

من خلق الكون؟ ومن خلقني؟ ولماذا؟

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?

Language: lang_te
Prepared by: మస్జిదె హరామ్ మరియు మస్జిదె నబవి లలో ధార్మిక పరమైన వ్యవహారాల విభాగానికి చెందిన శాస్త్రీయ కమిటీ.
Version: 2.0
Translations 47
Afrikanns Assamese Azerbaijani Bulgarian +43
Attachments 7
PDF
Audio
Video
+3

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?

మస్జిదె హరామ్ మరియు మస్జిదె నబవి లలో ధార్మిక పరమైన వ్యవహారాల విభాగానికి చెందిన శాస్త్రీయ కమిటీ.

ఏమిటి నేను సరైన మార్గంలో ఉన్నానా?

భూమ్యాకాశాలను మరియు అందులోని జ్ఞానపరిధిలోకి రాలేని అధ్బుతమైన జీవులను ఎవరు సృష్టించారు?

ఆకాశం మరియు భూమిలోని ఈ సూక్ష్మమైన, సమగ్రమైన వ్యవస్థను ఎవడు సృష్టించాడు?

మనిషిని ఎవరు పుట్టించారు? మరియు అతనికి వినికిడి చూసే శక్తిని, తెలివిని మరియు విచక్షణను ఇచ్చి, జ్ఞానాన్ని మరియు వాస్తవాలను అర్థం చేసుకోగలిగేలా చేసింది ఎవరు?

నీ శరీరంలోని అవయవాలలో ఈ సూక్ష్మమైన నిర్మాణాన్ని ఎవడు అద్భుతంగా సృష్టించాడు? నిన్ను ఆకారబద్ధంగా రూపొందించి నీకు అందమైన రూపాన్ని ఇచ్చినవాడు ఎవరు?

వివిధరకాలుగా, విభిన్న ఆకారాల్లో ఉన్న జీవులను చూసి యోచన చేయి — ఈ అంతులేని ఆకారాలతో వీటిని అద్భుతంగా సృష్టించినవాడు ఎవరు?

ఈ గొప్ప విశ్వం కాలక్రమేణా దాని చట్టాలతో ఎలా వ్యవస్థీకృతంగా మరియు స్థిరంగా ఉంది?

, పగలు మరియు రాత్రి, రుతువుల మార్పు మొదలైన) వ్యవస్థలను సృష్టించింది ఎవరు?ఈ ప్రపంచాన్ని నియంత్రించే వ్యవస్థలైన — జీవితం మరియు మరణం, జీవుల పునరుత్పత్తి, రాత్రి మరియు పగలు, ఋతువుల మార్పు మొదలైన వాటిని — ఎవరు ఏర్పాటు చేశాడు?

ఈ విశ్వం తానంతట తాను సృష్టించుకుందా? లేక శూన్యం నుండి ఉనికిలోకి వచ్చిందా? లేక ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా? సర్వోన్నతుడు మరియు గొప్పవాడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా? లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు. [అత్ తూర్: 35-36]

మనల్ని మనం సృష్టించుకోకపోతే మరియు మనం శూన్యం నుండి లేదా అకస్మాత్తుగా ఉనికిలోకి రావడం అసాధ్యం అయితే, ఈ ప్రపంచానికి గొప్ప మరియు శక్తివంతమైన సృష్టికర్త ఉన్నారనేది నిజం. ఈ విశ్వం తనని తాను ఉనికిలోకి తీసుకురావడం లేదా అస్తిత్వం నుండి ఉనికిలోకి రావడం లేదా అకస్మాత్తుగా ఉనికిలోకి రావడం అసాధ్యం.

మనిషి తాను చూడలేని విషయాలను, వాటి ఉనికిని ఎందుకు నమ్ముతున్నాడు? (ఉదా: వివేచనా శక్తి, తెలివి, ఆత్మ, భావోద్వేగాలు మరియు ప్రేమ) వీటి ప్రభావాలను చూడడం వల్ల కాదా? కాబట్టి మనిషి ఈ అద్భుతమైన విశ్వం యొక్క సృష్టికర్త ఉనికిని, ఆయన సృష్టించిన జీవులను, ఆయన కార్య నిర్వహణను మరియు ఆయన దయ యొక్క ప్రభావాలను చూసినప్పటికి ఎలా తిరస్కరించగలడు?!

ఎవరూ నిర్మించకుండా ఇల్లు ఉనికిలోకి వచ్చిందని లేదా ఇల్లు శూన్యం నుండి వచ్చిందని చెప్పడాన్ని హేతుబద్ధమైన వ్యక్తి అంగీకరించడు. కాబట్టి ఈ గొప్ప విశ్వం సృష్టికర్త లేకుండానే ఉనికిలోకి వచ్చిందని వాదించేవారిని కొందరు ఎలా నమ్ముతారు? విశ్వం యొక్క ఖచ్చితమైన క్రమం అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చింది అని చెప్పడాన్ని హేతుబద్ధమైన వ్యక్తి ఎలా అంగీకరించగలడు?

ఈ విషయాలన్నీ ఈ ప్రపంచానికి గొప్ప సర్వశక్తిమంతుడైన సృష్టికర్త ఉన్నాడని, దానిని నడుపుతున్నాడని, ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు అనే నిర్ధారణకు దారి తీస్తాయి. ఆయన కాకుండా ఆరాధించబడే వాటి ఆరాధన సరైనది కాదు. ఎందుకంటే ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరు.

ప్రభువు గొప్ప సృష్టికర్త

సృష్టికర్త ప్రభువు ఒక్కడే, ఆయనే యజమాని, నిర్వాహకుడు, ఆహార ప్రధాత, జీవాన్ని ఇచ్చేవాడు మరియు మరణాన్ని కలిగించేవాడు. ఆయనే భూమిని సృష్టించాడు మరియు దానిని తన జీవులకు తగినట్లుగా చేసాడు. ఆయనే ఆకాశాన్ని మరియు అందులో ఉన్న వాటిని సృష్టించాడు సూర్యుడు, చంద్రుడు, రాత్రి మరియు పగలు యొక్క ఖచ్చితమైన క్రమాన్ని స్థాపించాడు, ఇది అతని గొప్పతనాన్ని సూచిస్తుంది.

మరియు ఆయనే గాలిని మనకు అనుకూలంగా చేశాడు, అది లేకుండా మనం జీవించలేము. ఆయనే మన కోసం వర్షాన్ని కురిపిస్తాడు, మన కోసం సముద్రాలను మరియు నదులను అనుకూలం చేశాడు మరియు మన శక్తి లేకుండా మన తల్లి గర్భాలలో పిండాలుగా ఉన్నప్పుడు మనలను పోషించి, కాపాడినవాడు. మరియు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మన సిరల్లో రక్తాన్ని ప్రసరింపచేసేవాడు.

ఈ ప్రభువు సృష్టికర్త మరియు ఆహార ప్రధాత అయిన అల్లాహ్ మహిమాన్వితమైన వాడు మరియు గొప్పవాడు

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! [అల్ ఆరాఫ్: 54]

అల్లాహ్ ఆయనే మనం చూడగలిగినవాటినైనా, చూడలేని వాటినైనా ఈ విశ్వంలోని ప్రతిదానిని సృష్టించిన ప్రభువు మరియు సృష్టికర్త. ఆయన తప్ప మిగతా అన్నీ ఆయన సృష్టుల్లోనే ఒక భాగం. ఆరాధనకు యోగ్యుడు అల్లాహ్ ఒక్కడే. ఆయనతో పాటు ఎవ్వరినీ ఆరాధించకూడదు. సృష్టిలోనూ, రాజ్యాధికారంలోనూ, నిర్వహణలోనూ, ఆరాధనలోనూ ఆయనకు ఏ భాగస్వామిలేడు.

ప్రభువైన అల్లాహ్ తో పాటు ఇతర దేవుళ్లు కూడా ఉన్నారని, ఊహించినట్లయితే, అప్పుడు విశ్వ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ఇద్దరు దేవతలు ఏకకాలంలో విశ్వం యొక్క వ్యవహారాలను నిర్వహించడం సరికాదు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా... [అల్ అంబియా : 22]

సృష్టికర్త అయిన ప్రభువు యొక్క గుణాలు

ప్రభువు, మహిమాన్వితుడు, లెక్కలేనన్ని అందమైన పేర్లను మరియు ఆయన పరిపూర్ణతను సూచించే అనేక గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాడు. ఆయన పేర్లలో ఖాలిక్ (సృష్టికర్త) మరియు "అల్లాహ్" ​​ఉన్నాయి, అంటే ఆరాధనకు అర్హుడు, ఏకైకుడు,భాగస్వాములు లేనివాడు. ఆయన నిత్యజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు, అత్యంత దయగలవాడు, ఆహారప్రధాత, మరియు అత్యంత ఉదారుడు. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. [సూరతుల్ బఖరా: 255]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు. ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. [అల్ ఇఖ్లాస్:1-4]

ఆరాధించబడే ప్రభువు పరిపూర్ణత యొక్క లక్షణాలను కలిగి ఉంటాడు

ఆయన గుణాలలో ఒకటి ఆయనే ఆరాధనకు యోగ్యుడైన, ఆరాధించబడే సత్య దేవుడు. ఆయన తప్ప మిగతావారంతా ఆయన సృష్టించబడినవారు, ఆజ్ఞాపింపబడినవారు, మరియు ఆయన అధికారానికి లోబడియుండే వారు.

ఆయన గుణాలలోఒకటి నిత్యజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఉనికిలో ఉన్న ప్రతి జీవికి జీవం పోసినవాడు, శూన్యం నుండి వాటిని సృష్టించినవాడు. అతను అన్ని జీవులను ఆదుకుంటాడు మరియు ఉపాధిని అందజేస్తాడు మరియు వాటి ఉనికి, నిబంధనలు మరియు వాటి రక్షణను నిర్వహించేది ఆయనే. ప్రభువు సజీవుడు, మరణం లేనివాడు, నశించడం ఆయనకు అసాధ్యం. అతను ఎప్పుడూ నిద్రపోని సర్వస్వభావి. కునుకు గాని, నిద్రగాని ఆయనకు పట్టదు.

అతని గుణాలలో ఒకటి ఏమిటంటే, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు భూమిలో గాని మరియు ఆకాశాలలో గాని గోప్యం గా ఉన్నది ఏది లేదు.

వినడం, చూడటం ఆయన గుణాలలోనివే ఆయన ప్రతిదీ వింటాడు మరియు ప్రతి జీవిని చూస్తాడు. మనస్సులలో మెదిలే ఆలోచనలు మరియు హృదయాలలో దాగి ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు. ఆకాశంలో లేదా భూమిపై ఏదీ ఆయన నుండి దాగిలేదు.

ఆయన గుణాలలో ఒకటి ఆయన సర్వ శక్తిమంతుడు . ఆయనను ఎవరూ బలవంతం చేయలేరు మరియు ఆయన చిత్తాన్ని ఎవరూ ఆపలేరు. ఆయన కోరింది చేస్తాడు, మరియు ఆయన కోరింది ఆపేస్తాడు. ఆయన కోరుకున్న వారిని ముందుకు తెస్తాడు మరియు ఆయన కోరుకున్న వారిని వెనుక వదిలివేస్తాడు. అయన విస్తృత జ్ఞానం కలిగిన వాడు.

ఆయన గుణాలలో ఒకటి ఏమిటంటే, ఆయన సృష్టికర్త, ఆహార ప్రధాత, నిర్వాహకుడు, సృష్టిని సృష్టించి మరియు నిర్వహించేవాడు, మరియు సృష్టి ఆయన ఆదీనంలో ఉంది మరియు ఆయన అధికార నియంత్రణలో ఉంది.

భదితుల మొరలను వినడం, ఆపదలో ఉన్నవారికి ఉపశమనాన్ని అందించడం మరియు వారి దుఃఖాన్ని దూరం చేయడం ఆయన గుణాలలో ఒకటి. ఏ సృష్టి అయినా ఏదైనా సంక్షోభం చుట్టుముట్టబడి కష్టాల్లో కూరుకుపోయినప్పుడు సహాయం కొరకు ఆయనను ఆశ్రయిస్తుంది.

ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు మరియు ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఆయనను తప్ప మరెవరినీ పూజించడం తగదు. ఎందుకంటే వారు అసంపూర్ణులు. వారు అందరూ చనిపోతారు మరియు నాశనం చేయబడతారు.

పవిత్రుడు మరియు గొప్పవాడు అయిన అల్లాహ్ మనకు తన గొప్పతనాన్ని గ్రహించగల మనస్సులను మరియు మంచిని ఇష్టపడే, చెడును అసహ్యించుకునే స్వభావాని ప్రసాదించాడు. సమస్త లోకాల ప్రభువు వైపు తిరిగితే ప్రశాంతతను పొందుతుంది. ఈ స్వభావం ప్రభువు యొక్క పరిపూర్ణతను మరియు లోపాల నుండి అతని స్వచ్ఛతను సూచిస్తుంది.

తెలివిగల వ్యక్తి పరిపూర్ణుడిని కాకుండా ఇతరులను ఆరాధించడం తగదు, కాబట్టి అతను తనలాంటి అసంపూర్ణ జీవిని లేదా తన కంటే తక్కువస్థాయిని ఎలా ఆరాధించగలడు

ఆరాధించబడేవాడు మానవుడు, విగ్రహం, చెట్టు లేదా జంతువు కాలేడు.

ప్రభువు తన ఆకాశాలపై, తన సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు మరియు తన సృష్టి నుండి వేరుగా ఉన్నాడు. ఆయనలో ఏది సృష్టించబడలేదు మరియు ఆయన సృష్టిలో ఏదీ తన స్వీయ భాగం కాదు మరియు ఏ సృష్టిలోనూ ఆయన లేడు. ఆయన ఏ సృష్టి రూపంలోనూ కనిపించడు.

సర్వశక్తిమంతుడైన ప్రభువును పోలింది ఏదీ లేదు. ఆయన అన్నీ వినేవాడు, చూసేవాడు, ఆయనకు సమానమైనవాడు లేడు. ఆయనక తన సృష్టి యొక్క అక్కర లేనివాడు; ఆయన నిద్రించడు మరియు ఆహారం తీసుకోడు. ఆయన గొప్పవాడు భార్య గాని సంతానం గాని కలిగి ఉండడు. సృష్టికర్త యొక్క గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాడు మరియు ఆయన అవసరం లేదా తన లక్షణాలలో లోపం లేనివాడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు. అల్లాహ్ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు. [అల్ హజ్జ్: 73-74 ]

ఇంత గొప్ప సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించాడు? మరియు ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడు?

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు ఈ సృష్టితాలన్నింటినీ ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా వ్యర్ధంగా సృష్టించడం సాధ్యమేనా?మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

ఇంత ఖచ్చితంగా మరియు పరిపూర్ణంగా మనల్ని సృష్టించి, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తాన్ని మన ప్రయోజనం కోసం మన ఆదీనంలో చేసిన వాడు మనల్ని ఉద్దేశ్యం లేకుండా సృష్టించాడా లేక మనం ఇలాంటి అతి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వదిలేయడం సమంజసమేనా: మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? మరణం తర్వాత ఏం జరుగుతుంది? మన సృష్టి యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

తప్పు చేసినవాడికి శిక్ష, మంచి చేసినవాడికి ప్రతిఫలం లేకపోవడం సమంజసమేనా?

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా? [అల్ ముమినూన్: 115]

బదులుగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మన ఉనికి యొక్క ఉద్దేశ్యాన్ని తెలియజేయడానికి, ఆయనను ఎలా ఆరాధించాలో మరియు ఆయన సాన్నిద్యం ఎలా పొందాలో మనకు మార్గనిర్దేశం చేయడానికి, ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడో మరియు మనం ఆయన ప్రసన్నత ఎలా పొందవచ్చో తెలియజేయడానికి దైవప్రవక్తలను పంపాడు. మరణం తర్వాత మన పరిణామం ఏమిటో మనకు తెలియజేశాడు.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తను మాత్రమే ఆరాధనకు అర్హుడని మనకు తెలియజేసేందుకు మరియు ఆయనను ఎలా ఆరాధించాలో నేర్పడానికి, అతని ఆదేశాలను మరియు నిషేధాలను మనకు తెలియజేయడానికి మరియు మన జీవితాలను ఆహ్లాదపరిచే గొప్ప విలువలను బోధించడానికి దైవప్రవక్తలను పంపాడు. ఒకవేళ మనం వాటిని పాటిస్తే మన జీవితం శుభాలు మరియు మేళ్ళు నిండి ఉంటుంది.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నూహ్, ఇబ్రహీం, మూసా మరియు 'ఈసా' వంటి అనేక మంది సందేశహరులను పంపాడు మరియు వారు ఆయనచే పంపబడ్డారని సాక్ష్యమిచ్చే సంకేతాలతో మరియు అద్భుతాలతో వారికి మద్దతునిచ్చాడు. వారిలో చివరివారు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం).

ఈ జీవితం ఒక పరీక్ష అని మరియు నిజమైన జీవితం మరణం తరువాత ఉంటుందని దైవ సందేశహరులు మనకు స్పష్టంగా తెలియచేసారు.

మరియు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించి,ఆయనతోపాటు ఎవరినీ సాటి కల్పించకుండా దైవప్రవక్తలను విశ్వసించే విశ్వాసపరుల కొరకు అక్కడ స్వర్గం ఉన్నదని మరియు అల్లాహ్ తోపాటు వేరే దేవతలను ఆరాధించే లేదా అల్లాహ్ సందేశహరులలో నుంచి ఏ ఒక్క ప్రవక్తను తిరస్కరించినటువంటి అవిశ్వాసపరుల కొరకు అల్లాహ్ సిద్ధపరచిన నరకం అక్కడ ఉందని తెలియపరచారు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఓ ఆదమ్ సంతానమా! మీలో నుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినపుడు, ఎవరైతే దైవభీతి కలిగి వుండి తమను తాము సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! కాని ఎవరైతే మా సూచనలను అసత్యాలని నిరాకరించి, వాటి యెడల దరహంకారం చూపుతారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. [అల్ ఆరాఫ్: 35-36]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు! ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి. మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి). కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు - మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది. మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి కొరకు నిశ్చయంగా క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయనే శుభవార్తను వినిపించు, ప్రతిసారి వారికి తినటానికి ఫలాలు ఒసంగబడినపుడల్లా, వారు: "ఇవి ఇంతకు ముందు మాకు ఇవ్వబడినవే!" అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటీ పోలిక గలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు. [అల్ బఖర: 21-25]

అనేకమంది సందేశహరులు ఎందుకు పంపబడ్డారు?

అల్లాహ్ అన్ని జాతుల వారి వద్దకు తన ప్రవక్తలను పంపించాడు. అల్లాహ్ ప్రవక్తను పంపించకుండా ఏ జాతీ లేదు. ప్రజలను వారు తమ ప్రభువు యొక్క ఆరాధన వైపు పిలవటానికి,వారికి ఆయన ఆదేశములను,వారింపులను వారి వద్దకు చేరవేయటానికి. వారి పిలుపు యొక్క లక్ష్యం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించడం. అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనే ఆజ్ఞకు సంబంధించి ఒక జాతి తమ ప్రవక్త తీసుకువచ్చిన దానిని నిర్లక్ష్యం చేసినా లేదా వక్రీకరించినా, అల్లాహ్ వారి మార్గాన్ని సరిదిద్దడానికి, ఏకదైవారాధన మరియు విధేయత వైపు ప్రజలను తిరిగి తీసుకురావడానికి మరొక ప్రవక్తను పంపుతాడు.

చివరికి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రవక్తల పరంపరను ముహమ్మద్ (ﷺ) తో ముగించాడు, ఆయన తీర్పు దినం వరకు సమస్త మానవాళి కొరకు సంపూర్ణ ధర్మంతో మరియు శాశ్వతమైన సార్వత్రిక షరియాతో వచ్చారు. ఇది మునుపటి చట్టాలను పూర్తి చేస్తుంది మరియు రద్దు చేస్తుంది మరియు మహోన్నతుడైన ప్రభువు తీర్పు దినం వరకు ఈ ధర్మం యొక్క సంరక్షణ మరియు కొనసాగింపుకు హామీ ఇచ్చాడు.

ప్రవక్తలందరినీ విశ్వసించేంత వరకు ఎవరూ నిజమైన విశ్వాసి కాలేరు.

అల్లాహ్ యే ప్రవక్తలను పంపినవాడు, మరియు ఆయన తన సృష్టినంతటిని వారికి కట్టుబడి ఉండాలని ఆదేశించాడు. ఎవరైన వారిలో ఏ ఒక్కరి దైవదౌత్యమును తిరస్కరించినా అందరినీ తిరస్కరించినట్లే. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ద్యోతకాన్ని తిరస్కరించడం కంటే ఘోరమైన పాపం మరొకటి లేదు, ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించడానికి ప్రవక్తలందరిని విశ్వసించడం తప్పనిసరి.

కాబట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తలందరిని విశ్వసించడం మరియు అంతిమదినాన్ని విశ్వసించడం ఈ కాలంలో ప్రతి ఒక్కరిపై తప్పనిసరి. ఇది అంతిమ ప్రవక్త ముహమ్మద్ (ﷺ) ను విశ్వసించడం మరియు అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది శాశ్వతమైన అద్భుతం దివ్య ఖురాన్ ద్వారా దీని మద్దతు వెలువడుతుంది. అల్లాహ్ ఈ భూమి మరియు దానిపై ఉన్న సమస్తం ఉన్నంత వరకు దాని పరిరక్షణకు హామీ ఇచ్చాడు.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దివ్య ఖురాన్‌లో తన ప్రవక్తలలో ఎవరిపైనైనా విశ్వాసాన్ని తిరస్కరించేవాడు అల్లాహ్‌ ను, ఆయన దైవవాణిని తిరస్కరిస్తున్నాడని పేర్కొన్నాడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నిశ్చయంగా, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారూ మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరే వారూ (అంటే అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తలను తిరస్కరించే వారూ) మరియు: "మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము." అని అనే వారూ మరియు (విశ్వాస - అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించ గోరేవారూ - ఇలాంటి వారే - నిస్సందేహంగా సత్యతిరస్కారులు మరియు సత్యతిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.151 [అన్ నిసా:150-151]

కాబట్టి, ముస్లింలమైన మేమే అల్లాహ్ ఆదేశించినట్లుగా ఆయనను, అంతిమ దినాన్ని విశ్వసిస్తాము, ప్రవక్తలందరినీ విశ్వసిస్తాము మరియు మునుపటి గ్రంథాలపై విశ్వాసం కలిగి ఉంటాము. సర్వోన్నతుడు మరియు గొప్పవాడు అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది. [అల్ బఖర: 285]

దివ్యఖుర్ఆన్ అంటే ఏమిటి?

దివ్యఖుర్ఆన్ అనేది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క వాక్కు మరియు ఆయన ప్రవక్తలలో చివరి ప్రవక్త అయిన ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన దైవవాణీ. ఇది ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్య సత్యాన్ని ధృవీకరించే గొప్ప అద్భుతం. దివ్యఖుర్ఆన్ తన ఆదేశాలలో సత్యాన్ని మరియు తన కథనాలలో ప్రామాణికతను కలిగి ఉంది.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తిరస్కారులకు దాని లాంటి ఒక్క సూరా తీసుకురావాలని సవాలు చేసాడు, అయితే వారు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మానవ జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని కలిగి ఉన్న ఖురాన్ వచనం యొక్క గొప్పతనం మరియు సమగ్రత కారణంగా అలా చేయలేకపోయారు. మనిషి తప్పనిసరిగా విశ్వసించే విశ్వాసానికి సంబంధించిన అన్ని వాస్తవాలు ఇందులో ఉన్నాయి.

ఇది ఒక వ్యక్తి తనకు మరియు తన ప్రభువుకు మధ్య, లేదా తనకు మరియు తన ఆత్మకు మధ్య, లేదా తనకు మరియు మిగిలిన సృష్టికి మధ్య అనుసరించాల్సిన ఆదేశాలు మరియు నిషేధాలను కూడా కలిగి ఉంటుంది మరియు వాక్చాతుర్యం మరియు స్పష్టత యొక్క ఉన్నతమైన శైలిలో ఇవన్నీ ప్రదర్శించబడ్డాయి.

అంతేకాకుండా, ఈ పుస్తకం మానవుల రచన కావటం ఆసాధ్యం అని సూచించే అనేక హేతుబద్ధమైన ఆధారాలు మరియు శాస్త్రీయ వాస్తవాలను కలిగి ఉంది, అయితే ఇది నిజంగా మానవజాతి ప్రభువు యొక్క వాక్కు. ఆయన పరిశుద్ధుడు,మహోన్నతుడు.

ఇస్లాం అంటే ఏమిటి?

ఇస్లాం అంటే ఏకేశ్వరోపాసన ద్వారా సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు లొంగిపోవడం, ఆయనకు విధేయత చూపడం, సుముఖత మరియు అంగీకారంతో ఆయన శాసనానికి అనుగుణంగా ఉండటం మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కాకుండా ఇతరుల ఆరాధనను తిరస్కరించడం.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఒకే సందేశంతో దైవప్రవక్తలందరిని పంపాడు అది ఏమిటంటే : అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించమని, ఆయనతో భాగస్వాములను చేయకుండా మరియు ఆయనను వదిలి ఇతరుల ఆరాధనను తిరస్కరించమని ప్రజలను పిలవడం.

ఇస్లాం అనేది ప్రవక్తలందరి మతం, కాబట్టి వారి సందేశం కూడా ఒకటే,వారి షరీఅత్ లు (చట్టాలు) భిన్నమైనవి. ప్రవక్తలందరూ ప్రబోధించిన సరైన ధర్మాన్ని నేడు ముస్లింలు మాత్రమే పాటిస్తున్నారు. ఈ యుగంలో ఇస్లాం సందేశమే నిజమైనది, ఇది సృష్టికర్త నుండి మానవాళికి చివరి సందేశం.

ఇబ్రాహీం, మూసా, ఈసా అలైహిమస్సలాంలను పంపిన ప్రభువు ఆయనే, ఆయనే ప్రవక్తల పరిసమాప్తి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపాడు. ఇస్లామిక్ షరియా మునుపటి చట్టాలన్నింటినీ రద్దు చేయడానికి వచ్చింది.

ఇస్లాం తప్ప నేడు ప్రజలు అనుసరించే అన్ని మతాలు మానవ నిర్మిత మతాలు, వాస్తవానికి దైవికమైనవి కావు మానవ చేతులతో వక్రీకరించబడిన మూఢనమ్మకాలు, వారసత్వంగా వచ్చిన పురాణాలు మరియు మానవ ప్రయత్నాల మిశ్రమంగా మారాయి.

ముస్లింల ధర్మం విషయానికొస్తే, ఇది ఒక స్పష్టమైన ధర్మం మార్చలేనిది. అదేవిధంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు మాత్రమే అంకితం చేయబడిన వారి ఆరాధనలు ఏకరీతిగా ఉంటాయి, వారంతా ఐదు పూటల నమాజులు చేస్తారు, జకాత్ ఇస్తారు మరియు రంజాన్ మాసంలో ఉపవాసాన్ని పాటిస్తారు. వారి శాస్త్రం అయిన దివ్య ఖురాన్ పై మీరు యోచన చేస్తే అది అన్ని దేశాలలో ఒకే విధంగా కనబడుతుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక, పాపానికి పూనుకోక, (నిషిద్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. [సూరతుల్ మాయిదహ్: 3]

దివ్యఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:- (ఓ ప్రవక్తా!) ఇలా అను: "మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడిన వాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫు నుండి (అవతరింపజేయబడిన వాటిని) కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణ చేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము. మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు. [ఆలి ఇమ్రాన్: 84-85]

మరియు ఇస్లాం ధర్మం సంపూర్ణమైన జీవిత విధానాన్నికలిగి ఉంది. ఇది సహజసిద్ధమైనది మరియు హేతుబద్ధమైనది. దీనిని సవ్యమైన మనస్సులు తప్పక అంగీకరిస్తాయి. దీనిని మహోన్నతుడైన సృష్టికర్త తన సృష్టికోసం నియమించాడు. మరియు ఇది ప్రజలకు ఇహపరలోకాలలో మేలు మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇందులో జాతి లేదా రంగు ఆధారంగా వివక్షత లేదు. మరియు ఇందులో మానవులంతా సమానమే. ఇస్లాంలో ఒకరిపై మరొకరి మధ్య వ్యత్యాసం వారి సత్క్యార్యాల ఆధారంగా మాత్రమే ఉన్నది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. [అన్-నహ్ల్ :97]

ఇస్లాం ఆనందానికి మార్గం

ఇస్లాం ప్రవక్తలందరి ధర్మం. మరియు అది ప్రజలందరి కొరకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ధర్మం. మరియు ఇది ప్రత్యేకంగా అరబ్బుల ధర్మం కాదు.

ఇస్లాం ఈ ఇహలోకంలో నిజమైన ఆనందానికి మరియు పరలోకంలో శాశ్వతమైన ఆనందానికి మార్గం.

ఆత్మ మరియు శరీర అవసరాలను తీర్చే ఏకైక ధర్మం ఇస్లాం మాత్రమే, మరియు మానవ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: (అల్లాహ్) అన్నాడు: "మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరి కొకరు శత్రువులై ఉంటారు. కాని నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది, కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు. మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము. [తాహా: 123-124]

ఇహలోకంలో మరియు పరలోకంలో ఒక ముస్లిం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాడు?

ఇస్లాంనకు గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో నుంచి ఇవి కొన్ని:

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క దాసునిగా మారడం ద్వారా ప్రాపంచిక జీవితంలో విజయం మరియు గౌరవాన్ని పొందుతాడు, లేకపోతే, అతడు షైతానుకు మరియు కోరికలకు బానిస అవుతాడు.

- పరలోకంలో విజయం అంటే అల్లాహ్ దాసుడిని క్షమించి, అతని పట్ల సంతృప్తి చెందుతాడు మరియు అతనిని స్వర్గంలోకి ప్రవేశపెడతాడు, తద్వారా అతను మన్నత మరియు శాశ్వతమైన అనుగ్రహాలను పొందుతాడు. నరకాగ్ని శిక్ష నుండి మనిషి రక్షించబడుతాడు.

- విశ్వాసి ప్రళయ దినాన ప్రవక్తలతో, సత్యవంతులతో, అమరవీరులతో మరియు సద్వర్తనులతో ఉంటాడు. మరియు ఇది ఎంత మధురమైన సాంగత్యం! మరియు విశ్వసించని వారి విషయానికొస్తే, వారు నిరంకుశులు, దుర్మార్గులు, నేరస్థులు మరియు అవినీతిపరులతో ఉంటారు.

- ఎవరినైతే అల్లాహ్ స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడో వారు మరణం, అనారోగ్యం, బాధ, వృద్ధాప్యం లేదా విచారం లేని శాశ్వతమైన అనుగ్రహాలలో జీవిస్తారు. వారి కోరికలు నెరవేరుతాయి మరియు వారు కోరుకున్నదంతా వారికి లభిస్తుంది. నరకాగ్నిలోకి ప్రవేశించిన వారి విషయానికొస్తే, వారు శాశ్వతమైన మరియు నిరంతరాయమైన వేదనను అనుభవిస్తారు.

స్వర్గంలో, ఏ కన్ను చూడని, ఏ చెవి వినని మరియు ఏ మానవ మేదస్సు ఊహించలేని ఆనందాలున్నాయి. దీనికి నిదర్శనాలలో ఒకటి అల్లాహ్ సూక్తి: ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. [అన్ నహ్ల్ : 97]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు. [అస్ సజదహ్ : 17]

ముస్లిమేతరుడు ఏమి నష్టపోతాడు?

ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరించిన వారు అల్లాహ్‌ను గురించి తెలుసుకోవడం మరియు ఆయన గురించి అంతర్దృష్టిని పొందడం అనే గొప్ప జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతారు. అదనంగా, వారు ఈ జీవితంలో భద్రత మరియు మనశ్శాంతిని ఇచ్చే , అలాగే పరలోకంలో శాశ్వతమైన అనుగ్రహాలను ప్రసాదించే అల్లాహ్‌పై విశ్వాసాన్ని కోల్పోతారు.

అల్లాహ్ మానవుల వైపు అవతరింపజేసిన గొప్ప గ్రంధంపై విశ్వాసాన్ని మరియు దాని అనుసరణను మానవుడు కోల్పోతాడు.

వారు గొప్ప ప్రవక్తలపై విశ్వాసం ఉంచే అవకాశాన్ని కోల్పోతారు, అలాగే తీర్పు రోజున స్వర్గంలో వారితో పాటు వెళ్ళే అవకాశాన్ని కోల్పోతారు. బదులుగా, వారు నరకం యొక్క అగ్నిలో షైతానులు, నేరస్థులు మరియు నిరంకుశులతో కలిసి ఉంటారు. వారి నివాసం మరియు సాంగత్యం ఎంత నీచమైనది!

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం! వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు : "ఓ నా దాసులారా! నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి. [అజ్ జుమర్: 15-16]

ఎవరైతే పరలోకంలో విమోచనాన్ని కోరుకుంటారో, అతను అల్లాహ్ కు విధేయుడై, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించేవాడై ముస్లింగా ఉండాలి.

ప్రవక్తలు మరియు సందేశహరులు అలైహిముస్సలాం ఏకగ్రీవంగా అంగీకరించిన ఒక వాస్తవం ఏమిటంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను విశ్వసించి మరియు ఆరాధనలో ఆయనకు భాగస్వాములను చేయకుండా, ప్రవక్తలను, సందేశహరులందరిని విశ్వసించే ముస్లింలు మాత్రమే పరలోకంలో రక్షింపబడతారు. ప్రవక్తలను అనుసరించి, వారిని విశ్వసించి, వారి సందేశాన్ని ధృవీకరించే వారందరూ స్వర్గంలోకి ప్రవేశిస్తారు మరియు నరకాగ్ని నుండి రక్షించబడతారు.

మూసా ప్రవక్త కాలంలో జీవించి ఆయనను విశ్వసించి, ఆయన బోధనలను అనుసరించిన వారు ముస్లిములు,పుణ్య విశ్వాసులు. అయితే, అల్లాహ్ యేసును ప్రవక్తగా పంపిన తర్వాత, మూసా అనుచరులు యేసును విశ్వసించి, ఆయనను అనుసరించటం తప్పనిసరి అయినది.

కాబట్టి, ఈసాను విశ్వసించిన వారు నీతిమంతులైన ముస్లింలు, మరియు ఈసాను విశ్వసించడానికి నిరాకరించి, నేను మూసా మతాన్నే అనుసరిస్తాను, అని అనేవారు ఆవిశ్వాసులు. ఎందుకంటే వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పంపిన ప్రవక్తను విశ్వసించడానికి నిరాకరించారు.

తరువాత, అల్లాహ్ చివరి చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపారు, ఆయన్ను విశ్వసించడం ప్రతి ఒక్కరిపై విధిగా మారింది. మూసా మరియు ఈసాలను పంపిన ప్రభువే, చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా పంపాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యాన్ని తిరస్కరించి, 'నేను మూసా లేదా ఈసాను అనుసరిస్తూనే ఉంటాను అని అనే వాడు విశ్వాసి కాదు.

ఒక వ్యక్తి నిజానికి ముస్లింల పట్ల గౌరవం కలవాడని పలకటం మాత్రమే సరిపోదు మరియు పరలోకంలో తన మోక్షం కొరకు దానధర్మాలు చేసి మరియు పేదలకు సహాయం చేస్తే సరిపోదు. బదులుగా, అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను మరియు అంతిమ దినాన్ని విశ్వసించడం అవసరం. అల్లాహ్ అతని కర్మలను అప్పుడే అంగీకరిస్తాడు! సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌తో భాగస్వాములను చేయడం, ఆయనను విశ్వసించడం, ఆయన అవతరింపజేసిన దివ్యగ్రంథాన్ని తిరస్కరించడం లేదా అతని చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వాన్ని తిరస్కరించడం కంటే ఘోరమైన పాపం మరొకటి లేదు.

కాబట్టి, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించంటం గురించి విన్న యూదులు, క్రైస్తవులు మరియు ఇతరులు ఆయనను విశ్వసించడానికి నిరాకరించారు మరియు ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. కాబట్టి వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క తీర్పు, ఏ మానవుని తీర్పు కాదు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు. [అల్ బయ్యిన: 6]

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మానవాళికి చివరి సందేశం అవతరించినందున, ఇస్లాం గురించి మరియు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం గురించి విన్న ప్రతి వ్యక్తి ఆయనను విశ్వసించడం, ఆయన షరియత్ ను అనుసరించడం మరియు ఆయనను ఆయన ఆదేశాలలో, ఆయన వారింపులలో అనుసరించటం తప్పనిసరి అవుతుంది. కాబట్టి, ఎవరైతే ఈ చివరి సందేశం గురించి విని దానిని తిరస్కరిస్తారో, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారి నుండి దేనినీ అంగీకరించడు మరియు పరలోకంలో అతన్ని శిక్షిస్తాడు.

దీనికి ఆధారంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సూక్తి కూడా ఉంది: మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు. [ఆలి ఇమ్రాన్: 85]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు. [ఆలి ఇమ్రాన్: 64]

ముస్లింలు తెలుసు కోవలసినది ఏమిటి?

ముస్లిం విశ్వాసము ఈ ఆరు మూల స్తంభాలను విశ్వసించాలి:

సృష్టికర్తగా,ఆహార ప్రధాతగా, ప్రణాళికకర్తగా మరియు యజమానిగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై విశ్వాసం. ఆయనను పోలింది ఏదీ లేదు, ఆయనకు భార్య లేదా సంతానం లేరు. ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు మరియు ఆయనతో పాటు వేరేతరులను పూజించరాదు. ఆయనను తప్ప ఇతరులను పూజించడం చెల్లదని నమ్మడం తప్పనిసరి.

దైవదూతల పట్ల విశ్వాసం వారు అల్లాహ్ దాసులని, ఆయన వారిని కాంతి నుండి సృష్టించాడని విశ్వసించడం. మరియు ఆయన తన ప్రవక్తలకు దైవవాణిని అవతరింపజేయడాన్ని వారి కార్యాలలో ఒకటిగా చేశాడు.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరింపజేసిన అన్ని గ్రంధాలపై విశ్వాసం (తౌరాత్ మరియు ఇంజీలు వాటి వక్రీకరణకు ముందు వంటివి) మరియు చివరి గ్రంధం దివ్యఖురాన్.

నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా మరియు వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంటి ప్రవక్తలందరిపై విశ్వాసం. వారు దైవిక ద్యోతకం ద్వారా మద్దతివ్వబడిన మానవులు మరియు వారి నిజాయితీని ధృవీకరించదానికి సంకేతాలు మరియు అద్భుతాలు ఇవ్వబడ్డాయి.

తీర్పు దినంపై విశ్వాసం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆ రోజున పూర్వం మరియు తరువాతి తరాలతో సహా ప్రజలందరినీ మరణాంతరం లేపుతాడు. మరియు తన సృష్టిరాసుల మధ్య తీర్పునిస్తాడు. ఆయన విశ్వాసులను స్వర్గంలోకి ప్రవేశపెడతాడు, అవిశ్వాసులను నరకాగ్నిలోకి ప్రవేశింపజేస్తాడు.

విధి వ్రాతపై విశ్వాసం, మరియు అల్లాహ్ కు గతంలో జరిగినదంతా మరియు భవిష్యత్తులో జరగబోయేవన్నీ తెలుసునని విశ్వసించటం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సర్వ జ్ఞాని, ప్రతి దానిని వ్రాసి ఉంచాడు మరియు ఆయనే ప్రతీది సృష్టించాడు.

మరియు అల్లాహ్ ను ఆయన ధర్మబద్ధం చేసిన నమాజు, జకాత్, ఉపావాసంతో ఆరాధించాలి, మరియు స్థోమత ఉంటే హజ్ చేయాలి. ఆ తర్వాత, అతను తన ధర్మాన్ని నేర్చుకోవాలి, అదే ఇహలోకంలో అతని ఆనందానికి మరియు పరలోకంలో అతని సాఫల్యానికి మూలం అవుతుంది.