مقدمة وغلاف المنتقى من موسوعة الأحاديث النبوية
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
తొలి పలుకులు
సర్వస్తోత్రాలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే చెందుతాయి. మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబము పై, ఆయన సహచరులపై, ప్రళయదినం వరకు దాతృత్వంతో ఆయనను అనుసరించేవారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక. దీని తరువాత:
అల్లాహ్ గ్రంధం తర్వాత ముస్లింలు ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన విషయం ఏమిటంటే; అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్, దాని పై ధ్యాసపెట్టడం మరియు యోచన చేయడం, నేర్చుకోవడం మరియు ఆచరించడం. ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: "ఓ ప్రజలారా, నేను మీ మధ్య రెండు విషయాలను వదిలివెళ్తున్నాను. మీరు వాటిని గట్టిగా పట్టుకుంటే, మీరు ఎప్పటికీ మార్గం తప్పరు. అవి అల్లాహ్ యొక్క గ్రంథం మరియు ఆయన ప్రవక్త యొక్క సున్నత్." దీనిని ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ ఉల్లేఖించారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {దైవప్రవక్త మీకు ఇచ్చినదాన్ని (సంతోషంగా) పుచ్చుకోండి,ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలి పెట్టండి} [అల్ హష్ర్ :7] అందువలన, ఇస్లామిక్ కంటెంట్ సర్వీస్ అసోసియేషన్ ఇన్ లాంగ్వేజెస్ మరియు రబ్వాలోని కమ్యూనిటీ అవేర్‌నెస్ అసోసియేషన్ ప్రవక్త హదీసుల కోసం ఒక ఎన్‌సైక్లోపీడియాను సిద్ధం చేయడానికి మరియు దానిని అనేక భాషల్లోకి అనువదించడానికి ఆసక్తిగా ఉన్నాయి.
అప్పుడు, అల్లాహ్ దయతో, ఈ ఎన్సైక్లోపీడియా నుండి ఒక ముస్లింకు అవసరమైన మతపరమైన మరియు ప్రాపంచిక పరమైన విషయాల గురించి హదీసులను సేకరించారు, ఇందులో పొందుపరచబడిన హదీసులు క్లుప్తంగా వివరించబడ్డాయి, ఆ హదీసుల అర్థం మరియు సూచనలు స్పష్టం చేయబడ్డాయి, కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు వివరించబడ్డాయి మరియు అవి ఈ పేరుతో ముందుకు తీసుకురాబడ్డాయి: "హదీస్-ఎ-నబవి ఎన్సైక్లోపీడియా నుండి ఎంచుకున్న హదీసుల సేకరణ" ఈ పని ప్రపంచంలోని అన్ని సజీవ భాషలలోకి అనువదించ బడుతుంది, తద్వారా దీని కంటెంట్ నుండి ప్రయోజనాన్ని వ్యాప్తి చేయవచ్చు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్‌ను వారి వివిధ భాషలలో మానవాళికి తెలియజేయవచ్చు.
మేము అల్లాహ్ తో దుఆ చేస్తున్నాము అల్లాహ్ మా ఈ కార్యాన్ని స్వీకరించుగాక, ఈ పనిలో శుభాలు ప్రసాదించుగాక, కేవలం ఇది అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే, మరియు దీనిని సిద్ధం చేయడానికి, అనువదించడానికి మరియు ప్రచురించడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రతిఫలం ప్రసాదించుగాక.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
సంక్షిప్త పరిచయం
ప్రవక్త యొక్క హదీసులు ధర్మ శాసనానికి రెండవ మూలం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు. అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.} [అన్ నజ్మ్ : 3 - 4]
హదీస్-ఎ-నబవి ఎన్సైక్లోపీడియా నుండి ఎంపిక చేయబడిన ఈ హదీసుల సేకరణ సమాహారం. ఇందులో ముస్లిం దాసుడు తన ధర్మానికి మరియు ప్రపంచానికి సంబంధించిన వ్యవహారాలలో అవసరమైన హదీసుల సంక్షిప్త వివరణ ఇవ్వబడింది. వాటి అర్థాన్ని స్పష్టం చేయడంతోపాటు వాటి ద్వారా రుజువైన ముఖ్యమైన అంశాలను కూడా పాయింట్ బై పాయింట్‌గా చూపించారు. అది కూడా ప్రపంచంలోని అనేక సజీవ భాషల్లో అనువాదంతో. తద్వారా ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుంది మరియు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రజలందరికీ వారి సొంత భాషలలో తెలియజేయ బడుతుంది.